Replacing Your Old Wallet: పాత పర్స్‌ను మార్చేటప్పుడు ఈ చిట్కాలు పాటిస్తే మస్త్ సంపద
ఈ చిట్కాలు పాటిస్తే మస్త్ సంపద

Replacing Your Old Wallet: ఆర్థిక లావాదేవీలకు ముఖ్యమైన వస్తువు అయిన పర్స్‌ను మార్చేటప్పుడు కొన్ని సాంప్రదాయ, వాస్తు పద్ధతులను అనుసరించడం వల్ల సానుకూల ఫలితాలు వస్తాయని వాస్తు నిపుణులు సూచిస్తున్నారు. పండితుల ప్రకారం, పాత పర్స్‌ను పారవేసే ముందు, దానిలోని సానుకూల శక్తి కొత్త పర్స్‌కు బదిలీ కావడానికి కొన్ని పద్ధతులు పాటించాలి.
పాత పర్స్‌ను పారవేసే ముందు, దానిలో రెండు బియ్యం గింజలు, ఒక రూపాయి నాణెం ఉంచి, దేవతల గదిలో లేదా ఇంట్లో ఒక రోజు పాటు ఉంచాలి.
ఆ తర్వాత, నాలుగు బియ్యం గింజలు, ఒక రూపాయి నాణెం కొత్త పర్స్‌లో ఉంచి పూజలు చేయాలి.
ఈ ఒక రూపాయి నాణెంను పిల్లలు, భార్య లేదా తల్లిదండ్రుల నుండి తీసుకుంటే మరింత శుభమని నమ్ముతారు.
ఈ పద్ధతులు పాటించడం వల్ల సంపద పెరుగుతుందని, సానుకూల శక్తి ఆకర్షించబడుతుందని పండితులు చెప్పారు.
పాత పర్స్‌తో జాగ్రత్త
గురూజీ ప్రకారం.. పాత పర్స్‌ను గౌరవించడం చాలా ముఖ్యం. దానిని చెత్తబుట్టలో వేయకూడదు, అలాగే నీటిలో కూడా వేయకూడదు. పాత పర్స్‌లో రాహువు ప్రభావం ఎక్కువగా ఉంటుందని నమ్ముతారు. అలాగే చాలామంది తమ పర్సులో తల్లిదండ్రుల ఫోటోలు లేదా దేవుడి ఫోటోలు ఉంచుకుంటారు కాబట్టి, దానిని గౌరవప్రదంగా పరిగణించాలని సలహా ఇచ్చారు. మూడు రోజుల తర్వాత పాత పర్స్‌ను ఇంటి బయట పారవేయడం మంచిదని తెలిపారు.ఈ చిట్కాలు పాటించడం వల్ల ఆర్థికంగా మంచి ఫలితాలు వస్తాయని వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతున్నారు.
