ఆర్థిక ప్రగతి కోసం ఉప్పుతో ఇలా చేస్తే చాలు..

For Peace and Financial Growth at Home: ఇల్లు అంటే కేవలం నివాస స్థలం మాత్రమే కాదు, మన మనశ్శాంతికి, విశ్రాంతికి నెలవు. అయితే ఎన్ని సౌకర్యాలు ఉన్నా కొన్ని ఇళ్లలో నిరంతర తగాదాలు, పేదరికం, ఆర్థిక నష్టం, పిల్లల సమస్యలు, చదువులో ఆటంకాలు, అనవసరమైన కోపం, మానసిక ఒత్తిడి వంటివి రాజ్యమేలుతుంటాయి. డబ్బు ఎంత వచ్చినా నిలవక, ఎప్పుడూ ఏదో ఒక ఆందోళన వెంటాడుతుంటుంది. ఈ సమస్యలన్నిటికీ ఉప్పు ఒక సులభమైన, శక్తివంతమైన పరిష్కారం అందిస్తుందని వాస్తు నిపుణులు అంటున్నారు.

ప్రతికూల శక్తులను పారదోలే ఉప్పు నీరు

ఉదయం ఇంటిని శుభ్రం చేసేటప్పుడు.. బకెట్ నీటిలో ఒక పిడికెడు ఉప్పు వేసి ఇల్లు తుడవటం వలన ఇంట్లోని ప్రతికూల శక్తులు తొలగిపోయి, సానుకూల శక్తులు ప్రవేశిస్తాయని నిపుణులు తెలిపారు. ఇది ఇంట్లో ఆహ్లాదకరమైన వాతావరణాన్ని సృష్టిస్తుంది. అయితే ఈ పద్ధతిని ఆదివారాల్లో మాత్రం చేయకూడదని హెచ్చరిస్తున్నారు.

ఉప్పుతో తడి శుభ్రం చేసే విధానం:

కిలోగ్రాము ఉప్పు వేయాల్సిన అవసరం లేదు. ఒక బకెట్ నీటిలో ఒక గుప్పెడు ఉప్పు వేసి బాగా కలపాలి. ఇంటిని నైరుతి మూల నుండి తుడవడం ప్రారంభించి, వాయువ్య, ఆగ్నేయ దిశలను పూర్తి చేసి, ఈశాన్య దిశ వైపు కదలాలి. క్రమం తప్పకుండా ఇలా తుడవటం వలన పిల్లలు మాట వినడం, విద్యలో పురోగతి, ఆర్థిక వృద్ధి, మంచి ఆరోగ్యం వంటి ఫలితాలు లభిస్తాయని, ఇది శాస్త్రాలలో పేర్కొన్న సులభమైన కానీ ప్రభావవంతమైన పద్ధతి అని వివరించారు. ఈ ప్రక్రియకు కేవలం ఉప్పు మాత్రమే సరిపోతుందని, పసుపు, తెల్ల ఆవాలు లేదా మరే ఇతర పదార్థాలు జోడించాల్సిన అవసరం లేదని ఆయన స్పష్టం చేశారు.

పేదరికాన్ని దూరం చేసే ఉప్పు కూజా

ఇంట్లో సానుకూల శక్తిని పెంచడానికి మరొక మార్గం:

ఒక గాజు కూజాలో ఉప్పు వేసి ఇంటి మూలల్లో ఉంచాలి. ప్రతి అమావాస్య లేదా పౌర్ణమి నాడు, ఈ పాత ఉప్పును తీసివేసి, కూజాలో తాజా ఉప్పుతో నింపాలి. ఇలా చేయడం వల్ల ఇంటికి పేదరికం దరిచేరదని, డబ్బు ప్రవాహం సజావుగా ఉంటుందని నమ్ముతారు. అలాగే, కుటుంబంలో తగాదాలు తగ్గి, ఇల్లు దుష్టశక్తుల నుండి రక్షించబడుతుంది.

ఆత్మహత్య ఆలోచనల నుండి రక్షణ

చెడు దృష్టి లేదా ప్రతికూల ప్రభావాలు తీవ్రంగా ఉన్నప్పుడు, కొందరు దిక్కుతోచని స్థితికి చేరుకుని, ఆత్మహత్య ఆలోచనలు కూడా చేసే ప్రమాదం ఉందని నిపుణులు తెలిపారు. ఈ ఉప్పు శుభ్రపరిచే పద్ధతి అటువంటి ప్రతికూల ప్రభావాలను తగ్గించడానికి కూడా సహాయపడుతుందని అన్నారు.

PolitEnt Media

PolitEnt Media

Next Story