100 ఎకరాల్లో టీటీడీ దివ్య వృక్షాల ప్రాజెక్టు

TTD’s Divya Vriksha Project: టీటీడీ (తిరుమల తిరుపతి దేవస్థానాలు) 100 ఎకరాల్లో 'దివ్య వృక్షాల' ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టిందని టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు తెలిపారు. దేశవ్యాప్తంగా టీటీడీ ఆధ్వర్యంలో ప్రస్తుతం 60 ఆలయాలున్నాయి. భవిష్యత్తులో వివిధ రాష్ట్రాల్లో మరిన్ని ఆలయాలు నిర్మించనున్నాం’ అని తెలిపారు.

హిందూ దేవాలయాలలో అత్యంత పవిత్రమైన ధ్వజస్తంభాల (జెండా స్తంభాలు) నిర్మాణానికి అవసరమైన దివ్య వృక్షాలను (పవిత్రమైన చెట్లను) టీటీడీ స్వయంగా పెంచడం, సంరక్షించడం. ప్రాచీన, ఆగమ శాస్త్రాలకు అనుగుణంగా ధ్వజస్తంభాలను తయారు చేయడానికి, బలమైన, దీర్ఘకాలికంగా నిటారుగా పెరిగే టేకు, ఏగిస (ఇండియన్ కినో), టెర్మినేలియా, షోరియా జాతికి చెందిన వృక్షాలను పెంచుతారు.భవిష్యత్తులో ధ్వజస్తంభాల అవసరాల కోసం పవిత్రమైన కలపను ముందుగానే సిద్ధం చేసుకోవడం ద్వారా సంస్థాగత స్వావలంబన (Self-reliance) సాధించడం, అలాగే ఆధ్యాత్మిక పవిత్రత, పర్యావరణ బాధ్యతను కొనసాగించడం.ధ్వజస్తంభాల కోసం ప్రత్యేకంగా పవిత్ర వృక్షాలను పండించే దేశంలోనే తొలి దేవాలయ సంస్థగా టీటీడీ నిలవనుంది.

PolitEnt Media

PolitEnt Media

Next Story