Srisailam Temple: నేటినుంచి శ్రీశైలం ఆలయంలో ఉచిత దర్శనం!
ఆలయంలో ఉచిత దర్శనం!

Srisailam Temple: నేటి నుంచి శ్రీశైలం ఆలయంలో మల్లికార్జున స్వామి ఉచిత స్పర్శ దర్శనం ప్రారంభం అయింది. సామాన్య భక్తులను దృష్టిలో ఉంచుకొని ఉచిత స్పర్శ దర్శనాలను పునః ప్రారంభించింది దేవస్థానం. ఉచిత స్పర్శ దర్శనానికి కంప్యూటర్ టోకెన్ల ద్వారా భక్తులకు దర్శనానికి అనుమతించనున్నారు అధికారులు. భక్తుల సౌకర్యార్థం వారంలో నాలుగు రోజులపాటు మంగళవారం నుంచి శుక్రవారం వరకు 1000 మంది భక్తులకు ఉచిత స్పర్శ దర్శనం కల్పించనున్నారు. మంగళవారం నుంచి శుక్రవారం వరకు మధ్యాహ్నం 1.45 గంటల నుంచి 3.45 గంటల వరకు ఉచిత స్పర్శ దర్శనం కల్పించనున్నారు. ఉత్సవాల సమయంలో ప్రభుత్వ సెలవు దినాలలో భక్తుల రద్దీ సమయంలో ఉచిత స్పర్శ దర్శనం నిలుపుదల ఉంటుంది. భక్తులు సహకరించాలని ఆలయ అధికారులు కోరారు. శ్రీశైల మహాక్షేత్రంలో కొలువుదీరిన మల్లికార్జునస్వామిని భక్తులు తమ చేతులతో తాకుతూ 'స్పర్శ దర్శనం' చేసుకొనే సంప్రదాయం దశాబ్దాలుగా కొనసాగుతోంది. రోజురోజుకు భక్తుల రద్దీ పెరుగుతుండటంతో సామాన్యులకు తక్కువ టైమ్లో మల్లన్న దర్శనం కల్పించాలన్న ఉద్దేశంతో ఆరు నెలల కిందట శని, ఆది, సోమవారాల్లో ఆర్జిత అభిషేకాలు రద్దు చేయడంతో పాటు, మంగళవారం నుంచి శుక్రవారం వరకు మధ్యాహ్నం వేళల్లో ఉచిత సర్శ దర్శనాన్నీ నిలుపుదల చేశారు దేవస్థానం అధికారులు.
