బుగ్గ రామలింగేశ్వరస్వామి జాతర..

Bugga Ramalingeshwara Swamy Jatara: కార్తీక పౌర్ణమి సందర్భంగా ఇవాళ్టి నుంచి బుగ్గ రామలింగేశ్వరస్వామి జాతర ప్రారంభం అయింది. పౌర్ణమి నుంచి అమావాస్య వరకు 15 రోజుల పాటు జరిగే ఈ జాతరకు పలు జిల్లాల నుంచి లక్షల్లో భక్తులు పుణ్యస్నానాలను ఆచరించి మొక్కులు తీర్చుకుంటారు. రంగారెడ్డి జిల్లా మంచాల మండల పరిధిలోని ఆరుట్ల గ్రామ సమీపంలో ఉన్న కొండలు, గుట్టల నడుమ శ్రీశ్రీశ్రీ బుగ్గరామలింగేశ్వర స్వామి జాతర జరిగినన్ని రోజులు ఈ ప్రాంతం శివనామస్మరణతో మార్మోగోతుంది. ఇక్కడ భక్తులు ఉదయం నుంచి దేవాలయానికి చేరుకోని కార్తీక స్నానాలు ఆచరించి స్వామి వారికి ప్రత్యేక పూజలు చేస్తారు. ఆలయ ప్రాంగణంలో సత్యనారాయణస్వామి వ్రతాలు, శివలింగం, తులసికోట వద్ద మహిళలు కార్తీక దీపాలు వెలిగించి తమ మొక్కులను తీర్చుకుంటారు.

కార్తీక పౌర్ణమి బుగ్గ జాతర

శ్రీశ్రీశ్రీ బుగ్గ రామలింగేశ్వరస్వామి క్షేత్రం దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందింది. అరణ్యవాసంలో ఉన్న రాముడికి శివుడు ప్రత్యక్షమైన చోటు కాబట్టే ఇక్కడ స్వామి రామలింగేశ్వరుడిగా వెలిసాడని ప్రతీతి. పవిత్రమైన సెలయేటి చెంతన వెలసినందున బుగ్గ రామలింగేశ్వరుడిగా పేరొచ్చింది. అడవిలో పుట్టే ఈ ప్రవాహం శివుడిని అభిషేకించడానికే పుట్టిందా అన్నట్లు తూర్పు నుంచి పడమరకు ప్రవహించి తిరిగి అడవిలో ప్రవేశించి అదృశ్యమవుతుంది. దీనిని మరో దక్షిణ కాశీగా పిలుస్తుంటారు. కాశీ వెళ్లలేని వారు ఇక్కడ కార్తీక మాసంలో గుండంలో మునిగితే కాశీకి వెళ్ళినంత పుణ్యం అని భక్తుల నమ్మకం. ఏండ్లుగా లక్షల్లో భక్తులు వచ్చే, హైదరాబాద్ నగరానికి కూతవేటు దూరంలో ఉన్న ఈ క్షేత్రం అభివృద్ధికి మాత్రం నోచుకోలేదు. దేవాలయ కమిటీ ఆధ్వర్యంలో చందాలతో ప్రతి యేటా జాతర జరుగుతుంది. ఈ సంవత్సరం ప్రభుత్వం ఒక కోటి రూపాయలు ప్రభుత్వ నిధులు ఇవ్వడంతో దేవాలయాన్ని ముస్తాబు చేశారు.

PolitEnt Media

PolitEnt Media

Next Story