Gajakesari Rajayog Begins Today: జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాల కలయిక కొన్ని అరుదైన యోగాలను సృష్టిస్తుంది. అలాంటి వాటిలో అత్యంత శక్తివంతమైనది, శుభప్రదమైనది గజకేసరి రాజయోగం. ఏప్రిల్ 21న గురు, చంద్రుల కలయిక వల్ల ఈ అద్భుతమైన యోగం ఏర్పడుతోంది. దీని ప్రభావంతో కొన్ని రాశుల వారికి అదృష్ట ద్వారాలు తెరుచుకోబోతున్నాయి.

గజకేసరి రాజయోగం అంటే ఏమిటి?

జాతకంలో గురుడు, చంద్రుడు ఒకరికొకరు కేంద్ర స్థానాల్లో ఉన్నప్పుడు లేదా ఒకే రాశిలో కలిసినప్పుడు ఈ యోగం సంభవిస్తుంది. ఈరోజు చంద్రుడు మిథున రాశిలోకి ప్రవేశించి, అప్పటికే అక్కడ ఉన్న గురువుతో జతకట్టడం వల్ల ఈ రాజయోగం ఏర్పడింది. దీనివల్ల ముఖ్యంగా నాలుగు రాశుల వారికి విపరీతమైన ధనలాభం, కీర్తి ప్రతిష్టలు లభిస్తాయి.

ప్రయోజనం పొందే ఆ 4 రాశులు ఇవే:

మిథున రాశిః

ఈ రాజయోగం మీ రాశిలోనే ఏర్పడుతుండటం వల్ల మీకు గరిష్ట ప్రయోజనాలు లభిస్తాయి. చంద్రుని ప్రభావంతో మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. సరైన సమయంలో సరైన నిర్ణయాలు తీసుకుంటారు. మీరు చేపట్టే ప్రతి పనిలోనూ విజయం మీ వరిస్తుంది. కుటుంబంతో కలిసి సంతోషంగా గడుపుతారు.

సింహ రాశి

సింహ రాశి వారికి ఈ సమయం ఆర్థికంగా అద్భుతంగా ఉండబోతుంది. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. పాత అప్పుల బాధ నుండి విముక్తి లభిస్తుంది. స్టాక్ మార్కెట్ లేదా ఇతర రంగాల్లో పెట్టుబడులు పెట్టడానికి ఇది అత్యంత అనుకూలమైన సమయం. మీ ఆర్థిక స్థితి గణనీయంగా మెరుగుపడుతుంది.

కన్యా రాశి

కన్యా రాశి వారికి అటు ఆరోగ్యం, ఇటు ఐశ్వర్యం రెండూ లభిస్తాయి. ఉద్యోగంలో ఉన్న అడ్డంకులు తొలగిపోతాయి. కొత్త బాధ్యతలు లేదా ప్రమోషన్లు వచ్చే అవకాశం ఉంది. పారిశ్రామికవేత్తలు, వ్యాపారులకు ఊహించని లాభాలు అందుతాయి. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి.

కుంభ రాశి

కుంభ రాశి వారి చిరకాల కోరికలు నెరవేరే సమయం ఆసన్నమైంది. కొత్త ఇల్లు లేదా వాహనం కొనాలనే మీ కల ఈ కాలంలో నెరవేరే అవకాశం ఉంది. కుటుంబంలో శుభకార్యాలు జరగవచ్చు. మానసిక ప్రశాంతతతో పాటు ఇల్లంతా పండుగ వాతావరణం నెలకొంటుంది.

గజకేసరి రాజయోగం అనేది గజం (ఏనుగు) లాంటి శక్తిని, కేసరి (సింహం) లాంటి పరాక్రమాన్ని ఇస్తుందని శాస్త్రం చెబుతోంది. ఈ అరుదైన యోగం ఇచ్చే అవకాశాలను సద్వినియోగం చేసుకుని ఆయా రాశుల వారు అభివృద్ధి పథంలో పయనించాలని జ్యోతిష్య నిపుణులు సూచిస్తున్నారు.

PolitEnt Media

PolitEnt Media

Next Story