Giripradakshina at Simhachalam: సింహాచలంలో గిరిప్రదక్షిణ.. రెండు రోజులపాటు ఆర్జిత సేవలు రద్దు
రెండు రోజులపాటు ఆర్జిత సేవలు రద్దు

Giripradakshina at Simhachalam: సింహాచలం శ్రీ వరాహలక్ష్మీ నరసింహ స్వామి దేవస్థానం లో ఈ నెల 9 న జరిగే గిరిప్రదక్షిణ విజయవంతం చేయాలనీ ఈవో వేండ్ర త్రినాధరావు పిలుపునిచ్చారు. స్వామివారి సింహగిరి ప్రదక్షణ కు లక్షలాది మంది భక్తుల తరలి వచ్చే అవకాశం ఉన్నందున ఈ నేపథ్యంలోనే భక్తులకు కల్పించాల్సిన సదుపాయాలకు సంబంధించి ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. భక్తులు కాలినడకన సింహగిరిప్రదక్షిణ 32 కిలోమీటర్ల తిరుగునందున, 32 కిలోమీటర్ల మేర కిలోమీటర్ కి ఒక మెడికల్ క్యాంపు ,డి ఎం,& హెచ్ ఓ వారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేస్తున్నట్లుగా తెలిపారు. ప్రధానంగా జీవీఎంసీ 32 కిలోమీటర్ల మేర త్రాగునీరు, నిరంతరముగా విద్యుత్ సరఫరా మరుగుదొడ్ల నిర్వహణ చేస్తున్నట్లుగా తెలియజేశారు. గిరి ప్రదక్షిణలో పాల్గొనే భక్తుల సౌకర్యార్థం జీవీఎంసీ హెల్ప్ లైన్,టోల్ ఫ్రీ నెంబర్ లను ఏర్పాటు చేయడమైనదని జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్ తెలియజేశారు. సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీనరసింహస్వామి గిరి ప్రదక్షిణలో లక్షలాదిమంది భక్తులు 32 కిలోమీటర్లు ప్రదక్షణ చేస్తారని వారి సౌకర్యార్థం జీవీఎంసీ హెల్ప్ లైన్ నెంబర్ 0891-2507225, ఆపరేషన్ సెంటర్ ద్వారా టోల్ ఫ్రీ నెంబర్ 1800-4250-0009 లను ఏర్పాటు చేసిందని తెలియజేశారు. స్వచ్ఛంద సంస్థలు సహకారముతో కొండ చుట్టూ 38 స్టాల్స్ ఏర్పాటు చేసి మజ్జిగ ,టీ ,కాఫీ, పులిహార, ఫలహారాలు ఏర్పాటు చేస్తున్నట్లుగా తెలియజేశారు. * ప్రతి భక్తుడు నిబద్ధత కలిగి భక్తి తో స్వామి వారి గిరి ప్రదక్షిణ చేయాలని కోరారు. గిరి ప్రదర్శన సందర్భంగా ఈ నెల 9, 10 తేదీ ల్లో అన్ని ఆర్జిత సేవలను రద్దు చేసినట్లు ఆలయ స్థానాచార్యులు టీపీ రాజగోపాల్ తెలిపారు.
