Goddess Padmavathi: తిరుచానూరులోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో వరలక్ష్మీ వ్రతం వేడుకలు ఎంతో వైభవంగా జరిగాయి. ఈ పవిత్రమైన శుక్రవారం నాడు అమ్మవారు స్వర్ణరథంపై ఆసీనులై భక్తులకు దివ్యదర్శనమిచ్చారు. బంగారు రథంపై కొలువుదీరిన అమ్మవారిని చూసేందుకు రెండు కళ్లూ చాలవని భక్తులు పరవశించిపోయారు.

ఈ స్వర్ణరథోత్సవంలో మహిళా భక్తులు భారీ సంఖ్యలో ఉత్సాహంగా పాల్గొన్నారు. అత్యంత భక్తిశ్రద్ధలతో అమ్మవారి నామస్మరణ చేస్తూ ఆలయం చుట్టూ ఉన్న నాలుగు మాడ వీధుల్లో రథాన్ని లాగారు. మార్గమధ్యంలో భక్తులు అమ్మవారికి కర్పూర హారతులు సమర్పించి, తమ మొక్కులు చెల్లించుకున్నారు. స్వర్ణరథంపై కనువిందు చేస్తున్న అమ్మవారిని దర్శించుకోవడం తమ పూర్వజన్మ సుకృతంగా భావించి భక్తులు తరించారు.

ఈ ఆధ్యాత్మిక వేడుకలో తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) జేఈఓ డాక్టర్ ఏ. శరత్, ఆలయ డెప్యూటీ ఈవో శ్రీ హరింద్రనాథ్ తదితర అధికారులు పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. వీరితో పాటు వేల సంఖ్యలో తరలివచ్చిన భక్తులు ఈ పవిత్ర రథోత్సవాన్ని తిలకించి అమ్మవారి కృపకు పాత్రులయ్యారు.

PolitEnt Media

PolitEnt Media

Next Story