జనవరి నెల దర్శన కోటా షెడ్యూల్ విడుదల

శ్రీవారి భక్తులకు శుభవార్త: జనవరి నెల దర్శన కోటా షెడ్యూల్ విడుదల

January Darshan Quota Schedule Released for Lord Venkateswara: వచ్చే సంవత్సరం జనవరి 2026 నెలలో తిరుమల శ్రీవారిని దర్శించుకోవాలనుకునే భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) శుభవార్త అందించింది. జనవరి నెలకు సంబంధించిన వివిధ రకాల దర్శనం టికెట్లు, ఆర్జిత సేవలు, వసతి గదుల ఆన్‌లైన్ కోటా విడుదల షెడ్యూల్‌ను టీటీడీ తాజాగా ప్రకటించింది. ఈ నెల అక్టోబర్ 19 నుంచి దశలవారీగా కోటా టికెట్లను ఆన్‌లైన్‌లో విడుదల చేయనున్నారు.

జనవరి నెల దర్శన కోటా విడుదల వివరాలు

తిరుమల, 2025, అక్టోబర్ 17: 2026 జనవరి నెలకు సంబంధించి టీటీడీ విడుదల చేయు వివిధ దర్శనాల, గదుల కోటా వివరాలు ఈ విధంగా ఉన్నాయి.

తిరుమ‌ల శ్రీ‌వారి ఆర్జిత సేవా టికెట్లు, అంగ ప్రదక్షిణ టోకెన్లకు సంబంధించిన జనవరి నెల కోటాను అక్టోబర్ 19న ఉదయం 10 గంట‌ల‌కు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేయ‌నుంది.

ఈ సేవా టికెట్లు ఎలక్ట్రానిక్ డిప్ కోసం అక్టోబర్ 21వ తేదీ ఉదయం 10 గంటల వరకు ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవచ్చు.

ఈ టికెట్లు పొందిన వారు అక్టోబర్ 21 నుండి 23వ తేదీ మధ్యాహ్నం 12 గంటల లోపు సొమ్ము చెల్లించిన వారికి టికెట్లు మంజూరవుతాయి.

23న ఆర్జిత సేవా టికెట్ల విడుదల

కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవ టికెట్లను 23న ఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్ లైన్ లో విడుదల చేయ‌నుంది.

వర్చువల్ సేవల కోటా విడుదల

వర్చువల్ సేవలు, వాటి దర్శన స్లాట్లకు సంబంధించిన కోటాను 23న మధ్యాహ్నం 3 గంటలకు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేయ‌నుంది.

24న శ్రీవాణి దర్శన కోటా విడుదల

శ్రీవాణి ట్రస్టు దర్శన టికెట్ల కోటాను 24న ఉదయం 11 గంటలకు విడుదల చేయనున్నారు.

వృద్ధులు, దివ్యాంగుల దర్శన కోటా…

వ‌యోవృద్ధులు, దివ్యాంగులు, దీర్ఘ‌కాలిక వ్యాధులున్న‌వారు తిరుమల శ్రీ‌వారిని ద‌ర్శించుకునేందుకు వీలుగా ఉచిత‌ ప్ర‌త్యేక ద‌ర్శ‌నం టోకెన్ల కోటాను 24న మధ్యాహ్నం 3 గంట‌ల‌కు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుద‌ల చేయ‌నుంది.

25న ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటా విడుదల

ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటాను 25న ఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేయ‌నుంది.

తిరుమ‌ల‌, తిరుప‌తిల‌లో గదుల కోటా విడుద‌ల‌…

తిరుమల, తిరుపతిల‌లో గదుల కోటాను 25న మధ్యాహ్నం 3 గంటలకు ఆన్‌లైన్‌లో విడుదల చేస్తారు.

https://ttdevasthanams.ap.gov.in వెబ్‌సైట్ ద్వారా శ్రీ‌వారి ఆర్జిత‌సేవ‌లు, ద‌ర్శ‌న టికెట్లు బుక్ చేసుకోవాల‌ని కోర‌డ‌మైన‌ది.

PolitEnt Media

PolitEnt Media

Next Story