Grand Pushpayaga Mahotsavam: తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో జూన్ 22న పుష్పయాగ మహోత్సవం అత్యంత వైభవంగా నిర్వహించనున్నారు.

ఇందుకోసం జూన్ 21న సాయంత్రం 5.30 గంటల నుండి రాత్రి 8.30 గంటల వరకు సేనాధిపతి ఉత్సవం, పుష్పయాగ అంకురార్పణ కార్యక్రమాలు జరగనున్నాయి.

జూన్ 22న ఉదయం 9.30 గంటలకు స్నపన తిరుమంజనం నిర్వహించగా, మధ్యాహ్నం 1 గంట నుండి సాయంత్రం 4 గంటల వరకు పుష్పయాగం ఘనంగా జరుగుతుంది. ఈ సందర్భంగా వివిధ రకాల సుగంధ పుష్పాలు, పవిత్ర పత్రాలతో స్వామివారికి విశేష పూజలు, అభిషేకాలు నిర్వహిస్తారు. అనంతరం సాయంత్రం 6 గంటలకు వీధి ఉత్సవం వైభవంగా జరుగనుంది.

లోప పరిహారార్థం పుష్పయాగం

వార్షిక బ్రహ్మోత్సవాలు, నిత్యకైంకర్యాల నిర్వహణలో అర్చకులు, పరిచారకులు, అధికారులు, భక్తుల వల్ల తెలియక జరిగిన లోపాలకు ప్రాయశ్చిత్తంగా ఈ పుష్పయాగాన్ని నిర్వహిస్తారని ఆలయ అర్చకులు తెలిపారు.

గృహస్తులు (ఇద్దరు) రూ.516/- టికెట్‌ కొనుగోలు చేసి ఈ పవిత్ర పుష్పయాగ సేవలో పాల్గొని స్వామివారి అనుగ్రహాన్ని పొందవచ్చని ఆలయ అధికారులు తెలిపారు.

PolitEnt Media

PolitEnt Media

Next Story