Sri Venkateswara Swamy Brahmotsavams: కూకట్‌పల్లి కేపీహెచ్బీలో వైభవంగా వేంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు..
వేంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు..

Sri Venkateswara Swamy Brahmotsavams: హైదరాబాద్ కూకట్‌పల్లి హౌసింగ్‌బోర్డు కాలనీలో శ్రీ పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామి వారి 33వ వార్షిక బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా కొనసాగుతున్నాయి. బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని ఆలయంలోని వేద పండితులు ప్రతిరోజూ స్వామివారికి, అమ్మవారికి ప్రత్యేక పూజలు, విశిష్ట అలంకరణలు శాస్త్రోక్తంగా నిర్వహిస్తున్నారు.
ఈ బ్రహ్మోత్సవాల సందర్భంగా ఆలయంలో అత్యంత విశిష్టమైన ఆధ్యాత్మిక కార్యక్రమాలను చేపట్టారు. ఇందులో భాగంగా ప్రత్యేక హోమాలు, మహిళలచే సామూహిక కుంకుమార్చనలు, రమా సహిత సత్యనారాయణ స్వామి వ్రతాలు, సంతానప్రాప్తి కోసం పుత్రకామేష్టి యాగం, సర్వదోష నివారణ కోసం కళ్యాణమస్తు హోమం వంటి పూజా కార్యక్రమాలను నిర్వాహకులు భక్తిశ్రద్ధలతో నిర్వహిస్తున్నారు.
బ్రహ్మోత్సవాల వేళ ఆలయ ప్రాంగణాన్ని రంగురంగుల పుష్పాలతో, దేదీప్యమానమైన విద్యుత్ దీపాలతో సర్వాంగసుందరంగా అలంకరించారు. దీంతో కేపీహెచ్‌బీ పరిసర ప్రాంతాలన్నీ ఆధ్యాత్మిక వాతావరణంతో ఓలలాడుతున్నాయి. ఈ పవిత్ర బ్రహ్మోత్సవాలు ఈనెల 9వ తేదీ వరకు కొనసాగనున్నాయి. స్వామివారి దివ్య మంగళ స్వరూపాన్ని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయానికి తరలివస్తున్నారు.
ఇక ఈ ఉత్సవాల్లో భాగంగా సైబరాబాద్ పోలీస్ కమిషనర్ రమేష్ రెడ్డి, కూకట్‌పల్లి డీసీపీ రితిరాజ్, ఏసీపీ రవికిరణ్ రెడ్డి తదితర ప్రముఖులు స్వామివారిని దర్శించుకుని, ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. ఆలయానికి వచ్చే భక్తుల సౌకర్యార్థం కమిటీ సభ్యులు విస్తృత ఏర్పాట్లు చేయడంతో పాటు, ప్రతిరోజూ భారీ అన్నదాన కార్యక్రమాన్ని కూడా నిర్వహిస్తున్నారు.
- Latest Telugu NewsKukatpallyKPHBSri Venkateswara SwamyVenkateswara TempleBrahmotsavamBrahmotsavamsDevotional NewsSpiritual NewsTemple FestivalHindu FestivalReligious EventHyderabad NewsTelangana NewsTemple CelebrationsDevoteesHindu TraditionsLord VenkateswaraTirumala TraditionSpiritualityTelugu NewsReligious UpdatesTemple RitualsIndian Culture

