వైభవంగా తెప్పోత్సవాలు ప్రారంభం

Kapileswara Temple: తిరుపతిలోని శ్రీ కపిలేశ్వరస్వామివారి ఆలయంలో తెప్పోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. మొదటిరోజు శ్రీ వినాయకస్వామివారు, శ్రీ చంద్రశేఖరస్వామివారు తెప్పపై విహరించి భక్తులను అనుగ్రహించారు.

తెప్పోత్సవాల సందర్భంగా ఆలయంలో ప్రత్యేక కార్యక్రమాలు జరిగాయి. సాయంత్రం 6 నుంచి రాత్రి 8 గంటల వరకు తెప్పోత్సవం కన్నులపండుగగా జరిగింది. విద్యుద్దీపాలతో అందంగా అలంకరించిన తెప్పపై ఆశీనులైన శ్రీ వినాయకస్వామివారు, శ్రీ చంద్రశేఖరస్వామి వారు కపిలతీర్థం పుష్కరిణిలో 9 చుట్లు తిరిగారు. పెద్ద ఎత్తున హాజరైన భక్తులు స్వామివారికి కర్పూర నీరాజనాలు అందించారు. ఈ సందర్భంగా టీటీడీ అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు భక్తి సంకీర్తనలు అలపించారు.

ఈ కార్యక్రమంలో ఆలయ డెప్యూటీ ఈవో శ్రీమతి నాగరత్నం, ఇతర అధికారులు, ఆలయ అర్చకులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

PolitEnt Media

PolitEnt Media

Next Story