Guru Transit 2026: నవగ్రహాలలో అత్యంత శుభ గ్రహంగా, అదృష్టాన్ని ప్రసాదించే అధిపతిగా బృహస్పతిని భావిస్తారు. జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాల సంచారం, రాశి మార్పులతో పాటు నక్షత్ర మార్పులకు కూడా అత్యంత ప్రాముఖ్యత ఉంది. ఎందుకంటే ఈ మార్పులు 12 రాశుల వారి జీవితాలపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తాయి. ఈ క్రమంలోనే 2026 జూన్ 18వ తేదీ రాత్రి ఒక కీలకమైన ఖగోళ మార్పు జరగబోతోంది.

జూన్ 18న రాత్రి 9:32 గంటలకు గురు గ్రహం శని దేవుడికి అత్యంత ప్రియమైన పుష్యమి నక్షత్రంలోకి ప్రవేశించనుంది. ఆగస్టు 18 వరకు గురుడు ఇదే నక్షత్రంలో కొనసాగుతాడు. శని నక్షత్రంలోకి గురుడి రాక వల్ల కొన్ని రాశుల వారికి ఊహించని అదృష్టం, ప్రత్యేక ప్రయోజనాలు, సానుకూల శక్తి, మానసిక ప్రశాంతత లభిస్తాయి. జ్యోతిష్య నిపుణుల ప్రకారం.. ఈ నక్షత్ర గోచారం వల్ల అఖండమైన ధనకీర్తిని, వృత్తిలో ఉన్నత స్థానాన్ని అందుకోబోతున్న ఆ 3 అదృష్ట రాశులు ఏవో ఇప్పుడు చూద్దాం..

---

ఈ 3 రాశుల జాతకం మారబోతోంది:

ధనుస్సు రాశి

ధనుస్సు రాశి వారికి గురుడు పూషమి నక్షత్రంలోకి ప్రవేశించడం పరమ శుభప్రదంగా మారనుంది. గత కొంతకాలంగా మిమ్మల్ని వేధిస్తున్న ఆర్థిక ఇబ్బందులు, అడ్డంకులు అన్నీ తొలగిపోతాయి. ఊహించని మార్గాల ద్వారా ధనలాభం కలిగి, మీ ఆర్థిక పరిస్థితి గణనీయంగా మెరుగుపడుతుంది. వృత్తి జీవితంలో సరికొత్త, అద్భుతమైన ఉద్యోగ అవకాశాలు మీ తలుపు తడతాయి. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. జీవితంలో ఆనందం, శ్రేయస్సు వెల్లివిరుస్తాయి.

కర్కాటక రాశి

బృహస్పతి నక్షత్ర మార్పు కర్కాటక రాశి వారికి అఖండమైన అదృష్టాన్ని మోసుకొస్తోంది. ఆఫీసుల్లో మీ ప్రతిభకు తగిన గుర్తింపు లభిస్తుంది. ఉద్యోగంలో ఉన్నవారి హోదా, సామాజిక ప్రతిష్ట పెరుగుతాయి. ప్రమోషన్లు (పదోన్నతి), జీతాల పెంపునకు కొత్త మార్గాలు సుగమం అవుతాయి. ఈ సమయంలో మీకు ధార్మిక, ఆధ్యాత్మిక విషయాలపై ఆసక్తి విపరీతంగా పెరుగుతుంది. కుటుంబంలో శాంతి, సంతోషకరమైన వాతావరణం నెలకొంటుంది.

కన్యా రాశి

కన్యా రాశి వారి జీవితాల్లో కూడా ఈ గురు సంచారం సరికొత్త వెలుగులను నింపబోతోంది. సమాజంలో మీ అభిప్రాయాలకు, మీరు చేసే పనులకు అద్భుతమైన ప్రశంసలు దక్కుతాయి. మీలో ఆత్మవిశ్వాసం రెట్టింపు అవుతుంది. ఆర్థికంగా మంచి ప్రయోజనాలు చేకూరుతాయి. స్నేహితులు, ఆప్తుల నుండి ఆశించిన స్థాయి కంటే ఎక్కువ మద్దతు లభిస్తుంది. అయితే ఈ రాశి వారు ఆర్థిక లాభాలు పొందుతున్నప్పటికీ, తమ ఆరోగ్యం పట్ల మాత్రం తగిన జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.

PolitEnt Media

PolitEnt Media

Next Story