అష్ట సిద్ధులు – నవ నిధులు

Devotional: Devotional:హిందూ మతంలో హనుమంతుడిని బలం, జ్ఞానం, శౌర్యానికి దేవుడిగా పరిగణిస్తారు. బలం, శక్తి వీర హనుమాన ప్రధాన లక్షణాలు. హనుమంతుడు అష్ట సిద్ధి, నవ నిధిని ఇచ్చేవాడు అని హనుమాన్ చాలీసాలో కూడా ప్రస్తావించబడింది. హనుమంతుడి అనుగ్రహం ఏ భక్తుడికైనా లభిస్తే ఈ తొమ్మిది నిధిల వరం తన భక్తులకు ఇస్తాడు. హనుమతుడికి సీతా దేవి నుంచి అష్ట సిద్ధులు, నవ నిధులకు అధిపతి అనే వరం పొందాడు. హనుమంతుడి ఈ ఎనిమిది సిద్ధులు, తొమ్మిది నిధిలు అతని శక్తుల రూపం,.. ఈ రోజు అష్ట సిద్ధి, నవ నిధుల రహస్యాన్ని తెలుసుకుందాం..

శక్తి, భక్తి, సంపదల రూపమైన హనుమంతుడు. హనుమాన్ చాలీసాలో ఇలా పిలిచేలా, హనుమంతుడు భక్తులకు ఎనిమిది సిద్ధులు, తొమ్మిది నిధులను ప్రసాదించగల దేవుడు.

అష్ట సిద్ధులు (8 శక్తులు)

ఈ శక్తులు భౌతిక, ప్రకృతి, ఆధ్యాత్మిక పరిమితులను అధిగమించే స్వరూపాలు.

1. అణిమ (Anima) – శరీరాన్ని అణువు అంత చిన్నదిగా మార్చే శక్తి.

లంక ప్రవేశానికి ఈ శక్తిని ఉపయోగించాడు.

2. మహిమ (Mahima) – శరీరాన్ని అనంతంగా పెంచగల శక్తి.

యుద్ధంలో శత్రువులకు భయం కలిగించేందుకు ఉపయోగించాడు.

3. గరిమ (Garima) – శరీర బరువును పెంచే శక్తి.

శత్రువులు తనను కదిలించకుండా నిలబడేందుకు ఉపయోగించాడు.

4. లఘిమ (Laghima) – శరీరాన్ని తేలిక చేయడం.

గాలిలో పర్యటించి, సముద్రాన్ని దాటడానికి ఉపయోగించాడు.

5. ప్రాప్తి (Prapti) – ఏదైనా కావలసిన వస్తువును పొందగల శక్తి.

సంజీవని తీసుకురావడంలో ఈ శక్తి సహాయపడింది.

6. ప్రాకామ్య (Prakamya) – కోరికలు నెరవేర్చే శక్తి.

భక్తుల అభీష్టాలను తీర్చేందుకు ఉపయోగించాడు.

7. ఈశిత్వం (Ishitva) – ప్రకృతిని నియంత్రించే శక్తి.

అగ్నిని ఆపి, లంకను నియంత్రించాడు.

8. వశిత్వం (Vashitva) – ఇతరులను ప్రభావితం చేసే శక్తి.

రావణాస్థానాన్ని ఓడించి, సీతమ్మను రక్షించాడు.

నవ నిధులు (9 సంపదలు)

ఈ నిధులు భౌతికమే కాక, ఆధ్యాత్మిక, మానసిక సంపదను సూచిస్తాయి.

1. పద్మ నిధి – ధర్మానికి, దాతృత్వానికి అనుకూలమైన సంపద

2. మహాపద్మ నిధి – అపారమైన, పవిత్రమైన సంపద

3. శంఖ నిధి – కీర్తి, అధికారానికి సంబంధించి

4. ముకుంద నిధి – విలాస జీవితం, రాజసిక శక్తికి

5. నంద నిధి – కుటుంబ శ్రేయస్సుకు సంబంధించినది

6. మకర నిధి – సైనిక శక్తి, రక్షణకు ఉపయోగపడే సంపద

7. కచ్చప నిధి – వ్యక్తిగత వనరులు, స్వావలంబనకు

8. నీల నిధి – జ్ఞానం, తెలివితేటలకు ప్రతీక

9. ఖర్వ నిధి – అంతర్గత శాంతి, సామరస్యానికి ప్రతీక

PolitEnt Media

PolitEnt Media

Next Story