Having Six Fingers on the Right Hand: కుడి చేతిలో ఆరు వేళ్లు ఉంటే అదృష్టమా..? అశుభమా..?
ఆరు వేళ్లు ఉంటే అదృష్టమా..? అశుభమా..?

Having Six Fingers on the Right Hand: మన శరీరం దేవుడు ఇచ్చిన అత్యంత విలువైన బహుమతి. దాని బలం, సామర్థ్యాలు దైవ దయ వల్లేనని పండితులు చెబుతుంటారు. మన శరీరంలో కనిపించే కొన్ని వింత లక్షణాలు, వాటి ఆధ్యాత్మిక ప్రాముఖ్యతను పండితులు ఎప్పుడో వివరించారు. ముఖ్యంగా కుడి చేతిలో ఆరవ వేలు ఉండటం వెనుక ఉన్న పురాతన సంప్రదాయాలను, నమ్మకాలను వెల్లడించారు.
శరీర విభాగం: సూర్య - చంద్ర వైపు
మన శరీరం సూర్యుని వైపు (కుడి భాగం), చంద్రుని వైపు (ఎడమ భాగం) అని రెండు భాగాలుగా విభజించబడింది. సాధారణంగా పురుషులకు కుడి వైపున ఎక్కువ శక్తి ఉంటుంది. స్త్రీలకు ఎడమ వైపున కొంచెం ఎక్కువ శక్తి ఉంటుంది. సచిన్ టెండూల్కర్, మితాబ్ బచ్చన్ వంటి ప్రముఖులు ఎడమ చేతితో రాసే పురుషులు గొప్ప అదృష్టాన్ని పొందుతారని అన్నారు. ---
కుడి చేతిలో ఆరవ వేలు: ఒక శుభ సంకేతం
సైన్స్ ప్రకారం కుడి చేతిలో అదనపు వేలు కేవలం మామూలే అయినప్పటికీ.. మన గ్రంథాలు, సంప్రదాయాలు దీనిని చాలా శుభ సంకేతంగా పరిగణిస్తున్నాయని పండితులు వివరించారు.
ఆధ్యాత్మిక - అదృష్ట ఫలితాలు
అదృష్టం - మార్పులు: కుడి చేతిలో అదనపు వేలు కనిపించినప్పుడు ఆ వ్యక్తి జీవితంలో గొప్ప మార్పులు సంభవిస్తాయని, అదృష్టం పుష్కలంగా ఉంటుందని పండితులు తెలిపారు.
కీర్తి - గౌరవం: అలాంటి వ్యక్తులు ప్రసిద్ధులు అవుతారు. గొప్ప వ్యక్తులుగా ఎదుగుతారు. వారు కుటుంబంలో మంచి పేరు సంపాదించుకుంటారు. తమ బాధ్యతలను విజయవంతంగా నిర్వహిస్తారు.
కుటుంబ నిర్వహణ: ఈ లక్షణం ఉన్నవారు తమ కుటుంబాన్ని సానుకూలంగా నిర్వహించడంలో కీలక పాత్ర వహిస్తారు.
గ్రహ దోషాల నుండి విముక్తి: కుడి చేతిలో అదనపు వేలు ఉండటం అదృష్టాన్ని తెస్తుందని, గ్రహ దోషాల నుండి విముక్తిని కలిగిస్తుందని, కర్మ నుండి తప్పించుకోవడానికి సహాయపడుతుందని నమ్మకం.
వారి మాటలు నిజమవుతాయి:
పండితుల ప్రకారం.. ఆరవ వేలు ఉన్న వ్యక్తులు ఏదైనా చెబితే అది నిజమవుతుంది. వారి చేతుల్లో డబ్బు తీసుకున్నప్పుడు అదృష్టం వస్తుంది. వారు ఆహారాన్ని దానం చేసినా లేదా ఇతరులకు మంచి చేయడానికి వెళ్ళినా అది శుభసూచకం.

