Devotional:ఓంకారం యొక్క ప్రాముఖ్యత, దాని వెనుక ఉన్న రహస్యాల గురించి చాలా మందికి తెలియదు. ఓంకారం అనేది కేవలం ఒక శబ్దం కాదు. అకార, ఉకార, మకరాల కలయిక. పురాతన కాలం నుండి దీనిని పవిత్ర శ్లోకంగా భావిస్తారు. ఇది అనేక ఆరోగ్య, ఆధ్యాత్మిక ప్రయోజనాలను కలిగి ఉందని గురువులు, స్వామిజీలు చెబుతారు.

ఓంకారం యొక్క శారీరక ప్రయోజనాల్లో రక్త ప్రసరణ, శ్వాసకోశ వ్యవస్థను మెరుగుపరచడం, ఒత్తిడిని తగ్గించడం ఉన్నాయి. దీని జపం శరీరం నుండి ప్రతికూల శక్తిని బహిష్కరించి సానుకూల శక్తిని పెంచుతుందని నమ్ముతారు. కొన్ని పరిశోధనల ప్రకారం.. ఓం జపించడం వల్ల థైరాయిడ్ సమస్యల నుండి ఉపశమనం పొందే శక్తి ఉందని వెల్లడైంది.

ఓం మంత్రం వల్ల కలిగే మానసిక ప్రయోజనాల్లో మానసిక ప్రశాంతత, ఒత్తిడి ఉపశమనం ఆలోచనా శక్తి పెరగడం వంటివి ఉన్నాయి. ఓం జపించడం వల్ల మనస్సు ప్రశాంతంగా ఉంటుంది.

ఓంకారం ఆధ్యాత్మికంగా, ఓంకారం ఆత్మతో సంబంధాన్ని బలోపేతం చేస్తుంద,ని మోక్షాన్ని పొందడంలో సహాయపడుతుందని చెప్పబడింది. దీనిని అన్ని మంత్రాలకు రాజుగా పరిగణిస్తారు. చాలా మంత్రాలు ఓం తో ప్రారంభమవుతాయి. ప్రతిరోజూ కొన్ని నిమిషాలు ఓం జపించడం వల్ల అనేక ఆరోగ్య, ఆధ్యాత్మిక ప్రయోజనాలు లభిస్తాయి.

PolitEnt Media

PolitEnt Media

Next Story