దేవాలయంలోనా? ఏది శ్రేష్ఠం?

Homam at Home or Temple: మానవ జీవితంలో కష్టసుఖాలు సహజం. గ్రహ సంచారాల వల్ల కలిగే సడేసతి, అర్ధాష్టమ దోషాలు లేదా కర్మ ఫలాల వల్ల ఎదురయ్యే అడ్డంకులను తొలగించుకోవడానికి మనం సాధారణంగా హోమాలు, హవనాలు మరియు ప్రత్యేక పూజలను ఆశ్రయిస్తుంటాం. అయితే ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాలను ఇంట్లో నిర్వహించాలా లేక దేవాలయంలో చేయాలా అనే విషయంలో చాలామందిలో గందరగోళం ఉంటుంది. అయితే హోమాల్లోని రకాలను బట్టి అవి నిర్వహించాల్సిన ప్రదేశం మారుతుందని పండితులు వివరించారు.

ఇంట్లో ఏ హోమాలు నిర్వహించాలి?

పండితుల ప్రకారం.. అదృష్టం, అభివృద్ధి, ఆరోగ్యం, కుటుంబ శ్రేయస్సును కోరుతూ చేసే హోమాలను ఇంట్లోనే నిర్వహించడం అత్యంత ఉత్తమం. గణపతి హోమం, వాస్తు పూజ, సత్యనారాయణ స్వామి వ్రతం, హోమంవంటివి ఇంట్లో చేయడం వల్ల ఆ నివాసంలో సానుకూల శక్తి పెరుగుతుంది. ఇవి కుటుంబ సభ్యుల మధ్య సఖ్యతను, ఆర్థికాభివృద్ధిని పెంపొందిస్తాయి.

దేవాలయాల్లోనే చేయాల్సిన దోష నివారణ హోమాలు

దోషాలను తొలగించుకోవడానికి చేసే హోమాలను మాత్రం ఇంటి కంటే దేవాలయాల్లోనే చేయడం శుభప్రదమని పండితులు సూచించారు. సర్ప దోషం, నవగ్రహ దోష శాంతి, తీవ్ర అనారోగ్య సమస్యలు, మరణ భయం వంటి వాటి కోసం చేసే హోమాలను ఆయా శక్తి పీఠాల్లో లేదా పుణ్యక్షేత్రాల్లో నిర్వహించాలి. ఉదాహరణకు సర్ప దోష నివారణ కోసం కుక్కే సుబ్రహ్మణ్య, ఘాటి సుబ్రహ్మణ్య లేదా శ్రీకాళహస్తి వంటి క్షేత్రాల్లో ప్రత్యేక ఏర్పాట్లు ఉంటాయి.

దేవాలయానికే ఎందుకు ప్రాధాన్యత ఇవ్వాలి?

నిరంతర పవిత్రత: దేవాలయాల్లో నిత్యం బ్రాహ్మీ ముహూర్తం నుండి మంత్రోచ్ఛారణలు, అభిషేకాలు జరుగుతుంటాయి. అక్కడ వాతావరణం ఎప్పుడూ పవిత్రంగా ఉంటుంది.

నియమ నిబంధనలు: హోమాలకు కొన్ని ప్రత్యేక ఆచారాలు, కఠినమైన నియమాలు ఉంటాయి. ఇంట్లో అన్ని వేళలా అటువంటి పరిశుభ్రతను, నియమాలను పాటించడం సాధ్యం కాకపోవచ్చు.

ప్రతికూల శక్తుల ప్రభావం: ఇంట్లో కొన్నిసార్లు సూతకాలు లేదా ప్రతికూల శక్తుల ప్రభావం ఉండవచ్చు. కానీ దేవాలయాలు శక్తి స్వరూపాలకు నిలయాలు కాబట్టి అక్కడ ఫలితం వేగంగా ఉంటుంది.

సౌకర్యం: దేవాలయాల్లో హోమాలకు అవసరమైన నిష్ణాతులైన పూజారులు, పూజా ద్రవ్యాలు మరియు ప్రత్యేక హోమ గుండాలు సిద్ధంగా ఉంటాయి.

కేవలం డబ్బు ఉంది కదా అని లేదా స్థలం ఉందని అన్ని రకాల హోమాలను ఇంట్లో చేయడం సరైన పద్ధతి కాదని పండితులు హెచ్చరించారు. శుభకార్యాలకు సంబంధించినవి ఇంట్లో, దోష నివారణకు సంబంధించినవి దేవాలయాల్లో నిర్వహించుకోవడం ద్వారా పూర్తిస్థాయి దైవ అనుగ్రహం పొందవచ్చని ఆయన స్పష్టం చేశారు.

PolitEnt Media

PolitEnt Media

Next Story