పండగలు – పర్వదినాలు ...

––––––––––––––––––––––

30, సోమవారం, స్కంధ పంచమి.

01, మంగళవారం, కుమార షష్ఠి.

––––––––––––––––––––––––


మేషం... (అశ్వని, భరణి, కృత్తిక 1వ పాదం)

కుటుంబంలో మీ అంచనాలు నిజమవుతాయి. కొత్త విషయాలు గ్రహిస్తారు. బంధువుల ప్రోద్బలంతో కొన్ని ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. విద్యార్థులకు శ్రమ ఫలిస్తుంది. ఇంటి నిర్మాణాల్లో ముందడుగు వేస్తారు. అందరిలోనూ పలుకుబడి పెరుగుతుంది. రావలసిన డబ్బు సకాలంలో అందుతుంది. అయితే ఖర్చులు కూడా తప్పవు. ప్రస్తుత పరిస్థితుల రీత్యా మధ్యలో కొంత ఇబ్బంది పడినా ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతారు.కుటుంబ సమస్యలను ఓర్పుగా పరిష్కరించుకుంటారు. దూరపు బంధువులను కలుసుకుంటారు. వివాహాది వేడుకల నిర్వహణలో నిర్ణయాలు తీసుకుంటారు. స్వల్ప ఆరోగ్య సమస్యలు. వ్యాపారులు క్రమేపీ లాభాల బాటలో నడుస్తారు. మొదట్లో చికాకు పర్చినా అధిగమిస్తారు. ఉద్యోగాలలో చికాకులు అధిగమించి ముందుకు సాగుతారు. రాజకీయ, పారిశ్రామికవర్గాలకు కొన్ని ఇబ్బందులు, సమస్యలు తీరే సమయం. 29,30 తేదీల్లో ఆరోగ్యభంగం, ఔషధసేవనం.బంధువులతో తగాదాలు. ఆలోచనలు నిలకడగా ఉండవు. పంచముఖ ఆంజనేయస్వామిని పూజించండి.


వృషభం... (కృత్తిక 2,3,4 పాదాలు, రోహిణి, వృగశిర 1,2 పాదాలు)

పనులు చాకచక్యంగా పూర్తి చేస్తారు. బంధువులు, మిత్రుల నుంచి ఒక ముఖ్య సమాచారం అందుతుంది. కొన్ని వివాదాలు పరిష్కార దశకు చేరుకుంటాయి. ఒక ఆహ్వానం ఉత్సాహాన్ని నింపుతుంది. కొత్త ఒప్పందాలు చేసుకుంటారు. నిరుద్యోగుల ఆశలు కొంత ఫలిస్తాయి. బాకీలు వసూలై అవసరాలు తీరతాయి. అయితే ప్రస్తుత పరిస్థితులు కొంత నిరాశ పర్చి రాబడిపై ప్రభావం చూపుతాయి. వ్యాపారాలు కాస్త పుంజుకుంటాయి. భాగస్వాములతో వివాదాలు తీరతాయి. ఉద్యోగాలు సంతృప్తికరంగా సాగుతాయి. విధుల్లో అవాంతరాలు తొలగుతాయి. పారిశ్రామికవర్గాలకు ప్రభుత్వం నుంచి కీలక సందేశం అందుతుంది. 04,05 తేదీల్లో బాధ్యతలు ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. వ్యయప్రయాసలు.ఆదాయానికి మించి ఖర్చులు. హయగ్రీవస్తోత్రాలు పఠించండి.


మిథునం... (మృగశిర 3,4 పాదాలు, ఆరుద్ర, పునర్వసు 1,2,3 పాదాలు)

ముఖ్య పనులు నిదానంగా కొనసాగుతాయి. బంధువులతో తరచూ విభేదాలు. ఇంటాబయటా చికాకులు పెరుగుతాయి. ధార్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. కాంట్రాక్టులు ఎట్టకేలకు దక్కించుకుంటారు. ప్రస్తుత పరిస్థితులు కొంత అనుకూలించకున్నా ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతారు. ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్నా అవసరాలు తీరతాయి. రుణదాతలు ఒత్తిడులు పెంచుతారు. కుటుంబసభ్యుల సలహాలు స్వీకరించి కొన్ని వ్యవహారాలు చక్కదిద్దుతారు. వ్యాపారాలు క్రమేపీ లాభాల బాటలో నడుస్తారు. ఉద్యోగాలు ఆశించిన విధంగా కొనసాగుతాయి. పైస్థాయి వారి నుంచి తగినంత ప్రోత్సాహం అందుతుంది. పారిశ్రామికవర్గాలకు శుభవార్తలు అందుతాయి. 30,01 తేదీల్లో ఆకస్మిక ధనలాభం. ప్రముఖులతో పరిచయాలు. ఆలోచనలు అమలు చేస్తారు. ఆదిత్య హృదయం పఠించండి.

కర్కాటకం... (పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష)

కొత్త పనులు ప్రారంభిస్తారు. అనుకున్న విధంగా ఆప్తులు సహాయపడతారు. వ్యతిరేక పరిస్థితులను అనుకూలంగా మార్చుకుంటారు. జీవితాశయం నెరవేరుతుంది. దైవకార్యాలలో పాల్గొంటారు. ఆస్తుల విషయంలో ఇబ్బందులు తొలగుతాయి. ఆర్థిక ఇబ్బందులు అధిగమిస్తారు. రుణబాధలు తొలగుతాయి. కుటుంబంలో సంతోషకరమైన విషయాలు తెలిసి ఉత్సాహంగా గడుపుతారు. ఇంతకాలం ఎదుర్కొన్న ఆరోగ్య సమస్యలు తీరతాయి. ఉద్యోగులకు పనిభారం కాస్త తగ్గి ఉపశమనం లభిస్తుంది. వ్యాపారాభివృద్ధి. అనుకున్న పెట్టుబడులకు ఢోకా ఉండదు. పారిశ్రామిక, రాజకీయవర్గాలకు సమస్యలు కొన్ని తీరతాయి. 02,03 తేదీల్లో పనుల్లో ప్రతిబంధకాలు. శ్రమాధిక్యం తప్పదు. సోదరులు, మిత్రులతో విభేదాలు. దుర్గాదేవిని పూజించండి.

సింహం... (మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం)

వ్యవహారాలలో విజయం. శుభకార్యాలలో పాల్గొంటారు. పాతమిత్రులను కలుసుకుని మనస్సులోని విషయాలు వెల్లడిస్తారు. వాహనాలు, స్థలాల కొనుగోలు యత్నాలు ముందుకు సాగవు. పట్టుదలతో ముందుకుసాగి కొన్ని విజయాలు సా««ధిస్తారు. నిరుద్యోగులకు శ్రమా«నంతరం ఫలితం కనిపిస్తుంది. ఆకస్మిక ధనలబ్ధి. దీర్ఘకాలిక రుణబాధలు కాస్త తీరతాయి. అయితే ఖర్చుల విషయంలో తొందరవద్దు. ఎంతోకాలంగా వేధిస్తున్న సమస్యల నుంచి విముక్తి. శుభకార్యాలు జరుగుతాయి. అయితే విదేశాలలో ఉన్న బంధువుల క్షేమసమాచారాలపై కొంత ఆందోళన చెందుతారు. ఉదర సంబంధిత రుగ్మతలతో బాధపడతారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో అనుకున్న విధంగా లక్ష్యాలు సాధిస్తారు. కళాకారులకు అవకాశాలు కొన్ని నిరాశ పరుస్తాయి. 04,05 తేదీల్లో వ్యవహారాలు నిరాశ కలిగిస్తాయి. కుటుంబంలో చికాకులు. మానసిక ఆందోళన. సుబ్రహ్మణ్యాష్టకం పఠించండి.


కన్య... (ఉత్తర 2,3,4 పాదాలు, హస్త, చిత్త 1,2 పాదాలు)

అనూహ్యమైన రీతిలో కార్యక్రమాలు పూర్తి కాగలవు. అందరిలోనూ విశేషౖమైన గౌరవం లభిస్తుంది. గతంలో దూరమైన వారు తిరిగి దగ్గరకు చేరతారు. స్థిరాస్తి వివాదాలు తీరి ఉపశమనం లభిస్తుంది. కాంట్రాక్టర్లు అనుకోని విధంగా లాభపడతారు. వాహనాలు, ఆభరణాల కొనుగోలు యత్నాలు నిదానిస్తాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ఊహించని రీతిలో ధనలాభం. రుణదాతల ఒత్తిడులు తొలగుతాయి. కుటుంబం శుభకార్యాల నిర్వహణపై చర్చలు ముమ్మరం చేస్తారు. వ్యాపారాలు గతం కంటే లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగాలలో నూతనోత్సాహం. అదనపు బాధ్యతల నుంచి విముక్తి. పారిశ్రామిక, సాంకేతికవర్గాల వారికి చెప్పుకోతగ్గ ప్రగతి ఉంటుంది. 01,02 తేదీల్లో ఆరోగ్య సమస్యలు వేధిస్తాయి. ప్రత్యర్థుల నుంచి సమస్యలు ఎదురవుతాయి. రాబడి తగ్గి రుణాలు చేస్తారు. గణపతికి అర్చనచేయండి.


తుల... (చిత్త 3,4పాదాలు, స్వాతి, విశాఖ 1,2,3 పాదాలు)

ఆశ్చర్యకరమైన రీతిలో కొన్ని కార్యక్రమాలు సకాలంలో పూర్తి చేస్తారు. స్థిరాస్తి విషయంలో వివాదాలు తీరతాయి. నిరుద్యోగుల యత్నాలలో పురోగతి కనిపిస్తుంది. ఇంటి నిర్మాణాల్లో అవరో«ధాలు తొలగుతాయి. ఆలయాలు సందర్శిస్తారు. ఎట్టకేలకు కొంత సొమ్ము అంది ఊరట చెందుతారు. రుణబాధలు తొలగుతాయి. కుటుంబసభ్యులతో కష్టసుఖాలు పంచుకుంటారు. మీసలహాలు ఎంతో ఉపయోగపడతాయి. స్వల్ప అనారోగ్యం, ఔషధసేవనం. వ్యాపారాలు క్రమేపీ లాభిస్తాయి. నూతన పెట్టుబడుల కోసం యత్నిస్తారు. ఉద్యోగాలలో అప్పగించిన బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహిస్తారు. పనిఒత్తిడులు లెక్కచేయరు. రాజకీయవర్గాలకు కాస్త చికాకులు తప్పవు. 02,03 తేదీల్లో కార్యక్రమాలు వాయిదా వేస్తారు. ప్రయాణాలలో మార్పులు. విలువైన వస్తువులు జాగ్రత్త. గాయత్రీదేవి స్తోత్రాలు పఠించండి.


వృశ్చికం... (విశాఖ 4వ పాదం, అనూరాధ, జ్యేష్ఠ)

మొదట్లో పనులు కొంత నెమ్మదించినా క్రమేపీ వేగం పుంజుకుంటాయి. వ్యతిరేకులను సైతం అనుకూలంగా మార్చుకుంటారు. ఊహించని ఆహ్వానాలు అందుతాయి. స్థిరాస్తి వివాదాలు తీరి లబ్ధి పొందుతారు. ఇంటి నిర్మాణయత్నాలు కలసివస్తాయి. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. సమాజంలో పరపతి పెరుగుతుంది. ఊహించని విధంగా ఆదాయం సమకూరుతుంది. అయితే ఖర్చులు కూడా పెరిగే సూచనలు. కుటుంబంలో మీ మాట చెల్లుబాటు కాగలదు. క్షణం తీరికలేకుండా గడుపుతారు. ఆరోగ్యం విషయంలో కొంత ఉపసమనం లభిస్తుంది. వ్యాపారాల విస్తరణలో ప్రతిష్ఠంభన తొలగుతుంది. అనుకున్న రీతిలో లాభాలు అందుతాయి. ఉద్యోగాలు సంతృప్తికరంగా ఉంటాయి. విధి నిర్వహణలో సహచరులు సహకరిస్తారు. కళాకారులకు సన్మానాలు. 04,05 తేదీల్లో ప్రయాణాలు చివరి క్షణంలో వాయిదా. ఆర్థిక లావాదేవీలు మందకొడిగా సాగుతాయి. కష్టం ఎక్కువ ఫలితం తక్కువగా ఉంటుంది. శివునికి అభిషేకం చేయండి.


ధనుస్సు... (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వ పాదం)

పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు. ఆలోచనలు అనుకున్న విధంగా అమలు చేస్తారు. ప్రత్యర్థులు మిత్రులుగా మారి సహకరిస్తారు. కొత్త కాంట్రాక్టులు దక్కించుకుంటారు. పరిచయాలు పెరుగుతాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ఇంటి నిర్మాణయత్నాలు కాస్త అనుకూలిస్తాయి. ప్రస్తుత పరిస్థితుల్లో నిర్ణయాలలో తొందరవద్దు. కొంత సొమ్ము ఇతరుల నుంచి అందుకుంటారు. రుణబాధలు తొలగుతాయి. కుటుంబసభ్యులతో విభేదాలు తొలగి ఊరట చెందుతారు. ఒక సమాచారంతో ఉత్సాహంగా గడుపుతారు. ఆరోగ్యం కొంత కుదుటపడుతుంది. వ్యాపారాలు విస్తరణ కార్యక్రమాలు వాయిదా వేస్తారు. అయితే లాభాలు అందుకుంటారు. ఉద్యోగాలలో కోరుకున్న మార్పులు ఉండవచ్చు. రాజకీయవర్గాలకు కొన్ని చికాకులు తొలగి ఊరట లభిస్తుంది. 03, 04 తేదీల్లో ముఖ్యమైన కార్యక్రమాలు మధ్యలోనే విరమిస్తారు. ఆదాయానికి మించి ఖర్చులు ఉంటాయి. మిత్రులు, బంధువులతో విభేదాలు. అంగారక స్తోత్రాలు పఠించండి.


మకరం... (ఉత్తరాషాఢ 2,3,4 పాదాలు, శ్రవణం, ధనిష్ఠ 1,2 పాదాలు)

కొత్త పనులు సకాలంలో పూర్తి చేస్తారు. మీ సత్తా చాటుకుని ముందుకు సాగుతారు. వాహనాలు, ఆభరణాలు కొనుగోలులో ప్రతిష్ఠంభన. శుభకార్యాలకు సన్నద్ధమవుతారు. కొత్త కాంట్రాక్టులు పొందుతారు. బంధువులతో సంబంధబాంధవ్యాలు కొంత మెరుగుపడతాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ఆర్థిక ఇబ్బందులు కొంతవరకూ తొలగుతాయి. సోదరులతో వివాదాలు పరిష్కరించుకుంటారు. సమస్యలు చాకచక్యంగా పరిష్కరించుకుంటారు. వ్యాపారాలలో ఊహించిన విధంగా లాభాలు అందుతాయి. ఉద్యోగాలలో అనుకూల వాతావరణం. మీ మాటకు ఎదురుండదు. పారిశ్రామికవర్గాలకు నూతనోత్సాహం. 01,02 తేదీల్లో ఆర్థిక ఇబ్బందులు, కొత్త రుణాలు చేస్తారు. పనుల్లో ఆటంకాలు. వ్యయప్రయాసలు. అనుకోని సంఘటనలు. సుబ్రహ్మణ్యేశ్వరుని పూజించండి.


కుంభం... (ధనిష్ఠ 3,4 పాదాలు, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3 పాదాలు)

కొన్ని వివాదాలు చాకచక్యంగా పరిష్కరించుకుంటారు. ఆత్మీయుల నుంచి పిలుపు రావచ్చు. ముఖ్య వ్యవహారాలు సాఫీగాసాగుతాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. దూరప్రాంతాల నుంచి కీలక సమాచారం అందుతుంది. విద్యార్థులకు కాస్త ఊరట లభిస్తుంది. కొన్ని సమస్యలు ఎదురైనా అధిగమిస్తారు. ఇతరుల నుంచి కొంత సొమ్ము అందుతుంది. అయితే కొత్తగా అప్పులు చేస్తారు. ప్రస్తుత పరిస్థితులు అనుకూలించక డీలా పడతారు. కుటుంబ సమస్యల వలయం నుంచి బయటపడతారు. ఆరోగ్యంపై ఆందోళన తొలగుతుంది. వ్యాపారాలలో అంచనాలు నిజం చేసుకుంటారు. లాభాలు అందుతాయి. ఉద్యోగాలలో ఒత్తిడులు, సమస్యలు తీరతాయి. సహచరులు పూర్తిగా సహకరిస్తారు. రాజకీయవేత్తలకు కృషి అంతగా ఫలించదు. 04,05 తేదీల్లో భూవివాదాలు చికాకు పరుస్తాయి. ఆకస్మిక ప్రయాణాలు ఉంటాయి. భవిష్యత్‌పై నిరుద్యోగులకు కొంత ఆందోళన. విష్ణుసహస్రనామ పారాయణచేయండి.


మీనం... (పూర్వాభాద్ర 4వ పాదం, ఉత్తరభాద్ర, రేవతి).

చేపట్టిన కార్యక్రమాలు నిదానంగా సాగుతాయి. విద్యార్థుల యత్నాలు ముందుకు సాగవు. భూముల కొనుగోలు యత్నాలు వాయిదా వేస్తారు. ఆలయాలు సందర్శిస్తారు. పలుకుబడి కలిగిన వారితో పరిచయాలు. ప్రతి విషయంలోనూ అప్రమత్తత పాటించండి. ఎటువంటి నిర్ణయమైనా నిదానంగా తీసుకుంటే మంచిది. రావలసిన సొమ్ము అందక నిరాశ చెందుతారు. కొత్త రుణయత్నాలు ముమ్మరం చేస్తారు. కుటుంబ సమస్యలతో సతమతమవుతారు. మీరన్నది కాదనడమే ధ్యేయంగా కుటుంబసభ్యులు వ్యవహరించడం మనస్తాపం కలిగిస్తుంది. ఉద్యోగులకు అనుకోని మార్పులు ఉంటాయి. వ్యాపారాలు మరింత సామాన్యంగా ఉంటాయి. పెట్టుబడుల యత్నాలు మందగిస్తాయి. పారిశ్రామికవర్గాలకు లేనిపోని చికాకులు తప్పవు. 30,01 తేదీల్లో వ్యవహారాలు ముందుకు సాగవు. ఇంటాబయటా ఒత్తిడులు తప్పవు. బాధ్యతలతో సతమతమవుతారు. శివాష్టకం ఫఠించండి.

–––––––––––––––––––––––––––––––––

Politent News Web 1

Politent News Web 1

Next Story