రాశిఫలాలు...22.06.25 నుండి 28.06.25 వరకు

పండగలు – పర్వదినాలు ...
––––––––––––––––––––––
23, సోమవారం, మాస శివరాత్రి.
24, మంగళవారం, కృష్ణాంగారక చతుర్దశి.
25, బుధవారం, వట సావిత్రీ వ్రతం.
27, శుక్రవారం, పూరీ జగన్నాథ స్వామి రథోత్సవం.
––––––––––––––––––––––––––––
మేషం... (అశ్వని, భరణి, కృత్తిక 1వ పాదం)
ముఖ్యమైన కార్యక్రమాలు కష్టమైనా లెక్కచేయకుండా పూర్తి చేస్తారు. ఆత్మీయులు, శ్రేయోభిలాషుల సలహాలు స్వీకరిస్తారు. సంఘంలో పలుకుబడి, గౌరవం పెరుగుతుంది.చిన్ననాటి మిత్రులతో ఉత్సాహంగా గడుపుతారు. శత్రువులు కూడా మిత్రులుగా మారి సహకరిస్తారు. వాహన, గృహయోగాలు కలిగే సూచనలు. నిరుద్యోగుల యత్నాలు అనుకూలిస్తాయి. తీర్థయాత్రలు చేస్తారు. ఎటువంటి సమస్య ఎదురైనా నేర్పుగా పరిష్కరించుకుని ముందడుగు వేస్తారు. పరిచయాలు మరింత పెరుగుతాయి. సొమ్ముకు లోటు లేకుండానే గడుస్తుంది. రుణదాతల ఒత్తిడులు తొలగుతాయి. భూవిక్రయాలు అనుకూలించి మరింత సొమ్ము సమకూర్చుకుంటారు. వేడుకల నిర్వహణకు కొంత సొమ్ము వెచ్చిస్తారు. కుటుంబసభ్యులు మీపట్ల మరింత సానుకూల వైఖరితో ఉంటారు. భార్యాభర్తల మధ్య అపోహలు తొలగుతాయి. వ్యాపారాలు క్రమేపీ వృద్ధి చెందుతాయి. నూతన పెట్టుబడులకు తగిన సమయం. భాగస్వాములతో వివాదాలు తీరతాయి. లాభాల బాటలో నడుస్తారు. ఉద్యోగులకు కోరుకున్న మార్పులు ఉండవచ్చు. సహచరుల సాయం సంపూర్ణంగా అందుతుంది. పారిశ్రామికవేత్తలు, కళాకారులకు పట్టింది బంగారమే కాగలదు. 26,27 తేదీల్లో పనులలో జాప్యం. ప్రయాణాలు చివరిలో రద్దు. బంధువర్గంతో విరోధాలు. ఈశ్వరారాధన మంచిది.
వృషభం... (కృత్తిక 2,3,4 పాదాలు, రోహిణి, వృగశిర 1,2 పాదాలు)
కొన్ని వ్యవహారాలు అనుకున్న రీతిలో పూర్తి చేస్తారు. ఆలోచనలు కార్యరూపంలో పెడతారు. తరచూ తీర్థయాత్రలు సాగిస్తారు. దూరప్రాంతాల నుంచి ముఖ్య విషయాలు తెలుస్తాయి. ఆస్తుల వ్యవహారాలలో కొంతకాలంగా జరుగుతున్న వివాదాలు పరిష్కారదశకు చేరే సూచనలు. భవిష్యత్తుపై నిరుద్యోగుల్లో కొత్త ఆశలు చిగురిస్తాయి. పలుకుబడి కలిగిన వ్యక్తులు పరిచయమవుతారు. కొత్త కాంట్రాక్టులు చేజిక్కించుకుంటారు. రావలసిన డబ్బుకు లోటు రాదు. రుణబాధలు నుంచి విముక్తి. పొదుపు చర్యల అనూహ్యంగా సొమ్ము సమకూరుతుంది. మొత్తం మీద అవసరాలకు ఏమాత్రం ఇబ్బంది లేకుండా గడుస్తుంది. బంధువులతో సఖ్యంగా మెలుగుతారు. వివాహాది వేడుకలు నిర్వహిస్తారు. విదేశాల్లో ఉన్న సంతానం దగ్గరకు పయనమవుతారు. కొంత నలత చేసినా ఉపమనం పొందుతారు. వ్యాపారాలలో కొంత మేరకు లాభాలు గడిస్తారు, పెట్టుబడులకు లోటు లేకుండా ఉంటుంది. భాగస్వాములు సైతం మీదారికే వస్తారు. ఉద్యోగాల విధి నిర్వహణలోనూ మీ సత్తా చాటుకుంటారు. ప్రమోషన్లు దక్కవచ్చు. పారిశ్రామికవేత్తలు, కళాకారులకు మరింత ఉత్సాహవంతంగా ఉంటుంది. 24,25 తేదీల్లో శ్రమ పెరుగుతుంది. మిత్రులు శత్రువులుగా మారే అవకాశం. రాబడి నిరుత్సాహ పరుస్తుంది. గురుదత్త స్తోత్రాలు పఠించండి.
మిథునం... (మృగశిర 3,4 పాదాలు, ఆరుద్ర, పునర్వసు 1,2,3 పాదాలు).
కొత్త కార్యక్రమాలకు శ్రీకారం చుట్టి సకాలంలో పూర్తి చేస్తారు. ఒక సమాచారంతో ఊపిరిపీల్చుకుంటారు. సంఘంలో విశేష అతిథి మర్యాదలు పొందుతారు. ఆస్తుల వ్యవహారాలలో చిక్కులు, సమస్యలు తీరతాయి. తీర్థయాత్రలు చేస్తారు. ప్రముఖులు పరిచయమై చేయూతనిస్తారు. కొత్త కాంట్రాక్టులు సైతం దక్కుతాయి. ఇంటి నిర్మాణాలకు సమాయత్తమవుతారు. విద్యార్థులు కోరుకున్న కోర్సులు దక్కించుకుంటారు. సొమ్ముకు ఏమాత్రం లోటు రాదు. ఎడాపెడా సొమ్ము అందుతునే ఉంటుంది. దీర్ఘకాలిక రుణబాధలు చాలావరకు తీరతాయి. కుటుంబంలో కొన్ని విషయాలలో మీకు మీరే సాటి అనిపించుకుంటారు. మీపై వచ్చిన అపవాదులు తొలగుతాయి. సంతానం వివాహాది విషయాలు కొలిక్కి తెస్తారు. ఆస్తుల విషయంలో సోదరులతో ఒక ఒప్పందానికి వస్తారు. ఆరోగ్యపరంగా గతం నుంచి ఎదురవుతూ వస్తున్న ఇబ్బందులు తీరతాయి. మరింత మెరుగైన జీవనం సాగిస్తారు. వ్యాపారాలలో మరింత ప్రోత్సాహకరంగా ఉంటుంది. విస్తరణలో అవాంతరాలు తొలగుతాయి. నూతన పెట్టుబడులు అందుకుంటారు. భాగస్వాముల నిర్ణయాలు మీకే ఉపకరిస్తాయి. ఉద్యోగులకు కోరుకున్న చోటుకు బదిలీలు ఉండవచ్చు. అలాగే, విధి నిర్వహణలో మీకు ఎదురులేని పరిస్థితి. పారిశ్రామికవేత్తలు, కళాకారులకు అనూహ్యమైన విజయాలు. 27,28 తేదీల్లో బంధువులతో తగాదాలు. ప్రయాణాల్లోనూ, పనులలోనూ ఆటంకాలు. వ్యయప్రయాసలు. శివపంచాక్షరి పఠించండి.
కర్కాటకం... (పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష).
అనూహ్య పరిణామాలను ఆసక్తిగా గమనించి ముందుకు సాగుతారు. ఆశ్చర్యకర విషయాలు తెలుసుకుంటారు. విద్యార్థుల ప్రతిభాపాటవాలు వెలుగులోకి వస్తాయి. కీలక సమావేశాలలో పాల్గొంటారు. చిన్ననాటి మిత్రులు తారసపడతారు. కాంట్రాక్టర్లకు శుభవార్తలు అందుతాయి. స్థిరాస్తి వివాదాలు చాలావరకూ పరిష్కరించుకుంటారు. ఇళ్లు, వాహనాలు కొనుగోలు చేస్తారు. తీర్థయాత్రలు చేస్తారు. శత్రువులను కూడా మిత్రులుగా మార్చుకుని సత్తా చాటుకుంటారు. ఊహించని రీతిలో సొమ్ము సమకూరుతుంది. రెండుమూడు విధాలుగా ధనలాభం. ఆస్తుల విక్రయాలు పూర్తయి ఆ డబ్బు కూడా సమకూరుతుంది. కుటుంబసభ్యులు మీపై మరింత నమ్మకాన్ని పెంచుకుంటారు. సమర్థత, చాకచక్యంతో కొన్ని సమస్యలు పరిష్కరించుకుంటారు. కొంత నలత చేసినా ఉపశమనం లభిస్తుంది. అంతగా వైద్యసేవలు అవసరం ఉండవు. వ్యాపారాలలో నూతన పెట్టుబడులు, భాగస్వాములతో కళకళలాడుతుంటాయి. రావలసిన లాభాలు అందుకుంటారు. విస్తరణలోనూ విజయం సాధిస్తారు. ఉద్యోగులు ఎటువంటి అవరోధమైనా పట్టుదలతో అధిగమిస్తారు. విధులలో భారం తగ్గుతుంది. ప్రమోషన్లకు అవకాశాలున్నాయి. పారిశ్రామికవేత్తలు, శాస్త్రవేత్తలకు పట్టింది బంగారమే. 25,26 తేదీల్లో మానసిక అశాంతి. చేపట్టిన కార్యక్రమాలు నిదానంగా సాగుతాయి. ముఖ్య నిర్ణయాలలో. ఆదిత్య హృదయం పఠించండి.
సింహం... (మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం)
వీరికి అన్నింటా విజయాలే. ఏ కార్యక్రమం చేపట్టినా ఎదురుండదు. వెనువెంటనే పూర్తి కాగలవు. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. విద్యార్థులు కోరుకున్న అవకాశాలు సాధిస్తారు. ఆస్తుల వ్యవహారాలు కొలిక్కి వస్తాయి. తీర్థయాత్రలు చేస్తారు. నూతన ఉద్యోగాలు దక్కవచ్చు. ఒక మరపురాని సంఘటన ఎదురుకావచ్చు. గతంలో మిమ్మల్ని వదిలివెళ్లిన ఒక వ్యక్తి తిరిగి చెంతకు చేరతారు. సొమ్ముకు లోటు రాదు. అవసరాలకు మించి ధనప్రాప్తి. షేర్ల విక్రయాలు మరింత లాభించి ఉత్సాహం చెందుతారు. ఖర్చులకు వెనుకాడరు. మొత్తం మీద ఆర్థికంగా పుంజుకున్నట్టే. కుటుంబంలో మీరంటే ఇష్టపడనివారంటూ ఉండరు. కుటుంబంలోని వారికి మీరే ముఖ్య అతిథిగా మారతారు. వివాహాది శుభకార్యాలు సైతం నిర్వహిస్తారు. బంధువుల రాక మరింత సంతోషం కలిగిస్తుంది. కొంత నలత చేసినా సర్దుబాటు కాగలదు. అలాగే, కుటుంబంలోని ఒకరి ఆరోగ్యంపై కూడా శ్రద్ధ చూపుతారు. వ్యాపారులు అనుకున్న లాభాల వైపు సాగుతారు. పెట్టుబడులు సమకూరతాయి. కొత్త భాగస్వాములు జతకడతారు. విస్తరణలో అవాంతరాలు తొలగుతాయి. ఉద్యోగులపై వచ్చిన ఆరోపణలు తొలగుతాయి. సచ్ఛీలురుగా బయటపడి సత్తా చాటుకుంటారు. కొత్త విధులు చేపడతారు. రాజకీయవేత్తలు, కళాకారులు, పరిశోధకులు తమ నైపుణ్యతను చాటుకుంటారు. 27,28 తేదీల్లో దీర్ఘకాలిక రుణబాధలు చికాకు పరుస్తాయి. సన్నిహితులతో వివాదాలు. ఆర్థిక లావాదేవీలు మందకొడిగా సాగుతాయి. రాఘవేంద్ర స్వామి స్తోత్రాలు పఠించండి.
కన్య... (ఉత్తర 2,3,4 పాదాలు, హస్త, చిత్త 1,2 పాదాలు)
పొరపాట్లు సరిదిద్దుకుని ముందుకు సాగుతారు. చేపట్టిన కార్యక్రమాలను సకాలంలో పూర్తి చేస్తారు. ఆత్మీయులు, మిత్రులు శుభవర్తమానాలు అందిస్తారు. కొత్త కాంట్రాక్టులు దక్కించుకుంటారు. విద్యార్థులకు అనుకూల ఫలితాలు ఊరటనిస్తాయి. చర్చలు సఫలం కాగలవు. ఇంటి నిర్మాణయత్నాలు సాగిస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. గతం గుర్తుకు వస్తుంది. ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడతారు. రుణబాధలు చాలావరకూ తీరతాయి. ఆకస్మిక ధనలాభాలు కలిగి ఆశ్చర్యపోతారు. మీరు మర్చిపోయిన బాకీలు సైతం అందుతాయి. కుటుంబంలో అందరికీ ఆదర్శవంతంగా నిలుస్తారు. మీమాటే శిరోధార్యంగా భావిస్తారు. ఆరోగ్యం మరింత మెరుగుపడుతుంది. అలాగే, పెద్దల ఆరోగ్యంపై ఆందోళన తొలగుతుంది. వ్యాపారాలలో క్రమేపీ అనుకూల వాతావరణం నెలకొని లాభాలు గడిస్తారు. కొత్త పెట్టుబడులు సమకూరతాయి. ఉద్యోగాలు విధి నిర్వహణలో ఆటంకాలు తొలగుతాయి. పైస్థాయి వారి చేయూత అందుతుంది. కొత్త బాధ్యతలు చేపడతారు. పారిశ్రామికవేత్తలు, కళాకారులకు అనూహ్యమైన అవకాశాలు దక్కుతాయి. 22,23 తేదీల్లో కార్యక్రమాలలో అవరోధాలు. మానసిక అశాంతి. దూరప్రయాణాలు ఉండవచ్చు. గణేశాష్టకం పఠించండి.
తుల... (చిత్త 3,4పాదాలు, స్వాతి, విశాఖ 1,2,3 పాదాలు)
అనుకున్న కార్యక్రమాలను కొంత జాప్యం జరిగినా పూర్తి చేస్తారు. ఆత్మీయుల నుంచి అందిన లేఖ ద్వారా కీలక విషయాలు తెలుస్తాయి. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడవచ్చు. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. కొత్త కాంట్రాక్టులు చేజిక్కించుకుంటారు. మీ వ్యూహాలను అమలు చేసి కొన్ని విజయాలు సాధిస్తారు. నిరుద్యోగులు ఆశించిన ఉపాధి అవకాశాలు పొందుతారు. ఇంటి నిర్మాణయత్నాలు సానుకూలమవుతాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేపడతారు. ఇతరుల నుంచి పెండింగ్బాకీలు వసూలవుతాయి. డబ్బుకు లోటు లేకుండా గడుస్తుంది. ఖర్చులు మీదపడినా లెక్కచేయరు. కుటుంబంలో శుభకార్యాలు నిర్వహిస్తారు. సంతానంతో నెలకొన్న ఇబ్బందులు తొలగుతాయి. మొదటి ప్రయత్నంలోనే వివాహాయత్నాలు సానుకూలం కావడం విశేషం. ఆరోగ్యం మరింత మెరుగ్గా ఉంటుంది. వైద్యసేవలు విరమిస్తారు. వ్యాపారాలలో లాభాలు మరింత దక్కుతాయి. నూతన పెట్టుబడులకు తగిన సమయం. భాగస్వాములతో వివాదాలు తీరతాయి. ఉద్యోగులకు విధి నిర్వహణ ప్రోత్సాహకరంగా సాగుతుంది. సహచరులతో వివాదాలు సర్దుకుంటాయి. పారిశ్రామికవేత్తలు, కళాకారులకు మరింత ఉత్సాహవంతంగా ఉంటుంది. 25,26 తేదీల్లో వివాదాలకు దూరంగా ఉండండి. బంధువుల నుంచి ఆర్థిక విషయాల్లో ఒత్తిడులు. ఆర్థిక పరిస్థితి నిరాశాజనకంగా ఉంటుంది. వేంకటేశ్వరస్వామి స్తోత్రాలు పఠించండి.
వృశ్చికం... (విశాఖ 4వ పాదం, అనూరాధ, జ్యేష్ఠ)
మీ వైఖరి అర్థంకాక మిత్రులు మొదట్లో కొంత గందరగోళం చెందుతారు. అయితే క్రమేపీ అర్థం చేసుకుని మీదారికి వస్తారు. పనులు చకచకా సాగుతాయి. మీ సామర్థ్యం, నైపుణ్యం వెలుగులోకి వస్తాయి. సభలు,సమావేశాలలో పాల్గొంటారు. దూరప్రాంతాల నుంచి శుభవార్తలు అందుతాయి. సేవాకార్యక్రమాలలో చురుగ్గా పాల్గొంటారు. పలుకుబడి కలిగిన వారితో పరిచయాలు. వాహనాలు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. ప్రత్యర్థుల అంచనాలు పసిగట్టి తదనుగుణంగా ముందుకు సాగుతారు. విద్యార్థుల యత్నాలు సఫలమవుతాయి. తీర్థయాత్రలు చేస్తారు. కొంత సొమ్ము ఊహించని విధంగా లభిస్తుంది. పెండింగ్బాకీలు, షేర్ల విక్రయాల ద్వారా మరింత సొమ్ము సమకూరుతుంది. మీ అంచనాలకు తగినట్లుగా కుటుంబసభ్యులు వ్యవహరిస్తారు. అందరి మధ్య ప్రేమానురాగాలు పెరుగుతాయి. సంతాన వివాహయత్నాలు కలసివస్తాయి. వ్యాపారాలు క్రమేపీ వృద్ధి చెందుతాయి. నూతన పెట్టుబడులు సైతం అందుతాయి. విస్తరణ కార్యక్రమాలు మరింత ముమ్మరం చేస్తారు. ఉద్యోగాలలో నూతన బాధ్యతలతో ముందుకు సాగి విజయాలు సాధిస్తారు. కోరుకున్న పదోన్నతులు రావచ్చు. అలాగే, విధి నిర్వహణలో తగిన గుర్తింపు రాగలదు. రాజకీయవేత్తలు, పరిశోధకులకు మరింత సానుకూలమైన కాలం. 27,28 తేదీల్లో ఇంటాబయటా ఒత్తిడులు. ఆదాయానికి మించి ఖర్చులు. వ్యవహారాలు కాస్త నెమ్మదిస్తాయి. దక్షిణామూర్తి స్తోత్రాలు పఠించండి.
ధనుస్సు... (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వ పాదం)
కొత్త కార్యక్రమాలకు శ్రీకారం చుట్టి అనుకున్న రీతిలో పూర్తి చేస్తారు. ఆత్మీయుల నుంచి శుభవార్తలు అందుతాయి. కాంట్రాక్టులు భారీగా పొందుతారు. విచిత్ర సంఘటనలు ఆకట్టుకుంటాయి. పరిస్థితులు అనుకూలించి ముందుకు సాగుతారు. విద్యార్థులు, నిరుద్యోగులు ప్రతిభ చాటుకుంటారు. వాహనాలు, భూములు కొనుగోలు చేస్తారు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడవచ్చు. రావలసిన సొమ్ము అందుతుంది. ఆస్తుల విక్రయాలు పూర్తయి సొమ్ము సమకూరుతుంది. రుణబాధల నుంచి బయటపడతారు. కొన్ని సమస్యల నుంచి అత్యంత నేర్పుగా బయటపడి ప్రశంసలు పొందుతారు. మీ నిర్ణయాలను అంతా ప్రశంసిస్తారు. సంతానం ఉద్యోగయత్నాలు సఫలమై ఉత్సాహంగా గడుపుతారు. వ్యాపారాలలో మరింత లాభాలు పొందుతారు. కొత్త భాగస్వాముల రాకతో కళకళలాడుతూ ముందుకు సాగుతాయి. ఉద్యోగాలలో ప్రోత్సాహకరంగా గడుస్తుంది. నూతనంగా విధులు చేపడతారు. గతంలో జరిగిన పొరపాట్లు సరిదిద్దుకుని ముందడుగు వేస్తారు. రాజకీయవేత్తలు, కళాకారులకు కొత్త అవకాశాలు దక్కుతాయి. 23,24 తేదీల్లో కొన్ని పనులు మధ్యలోనే విరమిస్తారు. ఆర్థిక పరిస్థితి గందరగోళంగా ఉంటుంది. ఆకస్మిక ప్రయాణాలు ఉంటాయి. శ్రీరామరక్షాస్తోత్రాలు పఠించండి.
మకరం... (ఉత్తరాషాఢ 2,3,4 పాదాలు, శ్రవణం, ధనిష్ఠ 1,2 పాదాలు)
ఎంతటి కఠినమైన వ్యవహారాన్నైనా అలసట, జాప్యం లేకుండా పూర్తి చేస్తారు. మీపై సన్నిహితులు ఉంచిన బాధ్యతలు సైతం పూర్తి చేస్తారు. సుదూర ప్రాంతాల నుంచి అందిన సమాచారం ఊరటనిస్తుంది. ఉద్యోగయత్నాలు సానుకూలమై నిరుద్యోగులు సంతోషంగా గడుపుతారు. ఆలయాలు సందర్శిస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలపై మరింత దృష్టి సారిస్తారు. పలుకుబడి కలిగిన వారితో పరిచయాలు ఏర్పడవచ్చు. కొత్త కాంట్రాక్టులు సైతం దక్కుతాయి. ఇంతకాలం పడిన కష్టాలు తీరే సమయం. వాహనాలు, స్థలాలు కొనుగోలు చేస్తారు. ఆర్థికంగా మొదట్లో కొంత ఇబ్బందిగా ఉన్నా క్రమేపీ రెండుమూడు విధాలుగా ధనప్రాప్తి కలుగుతుంది. అవసరాలకు ఏ మాత్రం లోటులేకుండా గడుస్తుంది. మీ ప్రతిపాదనలు కుటుంబసభ్యులను ఆకట్టుకుంటాయి. మిమ్మల్ని వ్యతిరేకించిన వారు సైతం మద్దతుగా నిలుస్తారు. వ్యాపారాలలో .కొత్త ప్రతిపాదనలతో భాగస్వాములను మెప్పించి ముందుకు సాగుతారు. విస్తరణ కార్యక్రమాలు మరింత ముమ్మరం చేస్తారు. ఉద్యోగులు మరిన్ని విజయాలు సాధిస్తారు. మీపై ఉంచిన బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహిస్తారు. పారిశ్రామికవేత్తలు, కళాకారులకు పురస్కారాలు అందుతాయి. 22,23 తేదీల్లో మౌనం అన్ని విధాలా శ్రేయస్కరం. ఆలోచనలు స్థిరంగా ఉండవు. ఆదాయం అంతగా ఉండదు. దత్తాత్రేయ పూజలు చేయండి.
కుంభం... (ధనిష్ఠ 3,4 పాదాలు, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3 పాదాలు)
ప్రారంభంలో కొద్దిపాటి ఇబ్బందులు, సమస్యలు ఎదురై చికాకు పరుస్తాయి. అయితే రానురాను పరిస్థితులు మీకే అనుకూలిస్తాయి. మిత్రులు సంపూర్ణంగా సహకరిస్తారు. శత్రువులు కూడా మిత్రులుగా మారడం విశేషంగా చెప్పవచ్చు. నూతన ఉద్యోగయత్నాలు కలిసివస్తాయి. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. ఇంతకాలం పడిన కష్టానికి తగిన ఫలితం కనిపిస్తుంది. కాంట్రాక్టర్లకు శుభవార్తలు అందుతాయి. భవిష్యత్తుపై విద్యార్థులకు మరింత భరోసా కలుగుతుంది. ఇంటి నిర్మాణయత్నాలు కార్యరూపం దాలుస్తాయి. ఆర్థిక ఇబ్బందులు కలిగినా సర్దుబాటు కాగలదు. రుణబాధలు తొలగుతాయి. అవసరాలకు తగినంతగా సొమ్ము సమకూరుతుంది. మీ అంచనాలు, ఊహలకు తగిన విధంగా కుటుంబసభ్యులు సహకరిస్తారు. వివాహాది శుభకార్యాల నిర్వహణలో పాలుపంచుకుంటారు. వ్యాపారాలు అనుకున్న రీతిలో విస్తరిస్తారు. పెట్టుబడులు మరింత సమకూరి ముందుకు సాగుతారు. లాభాలకు లోటు ఉండదు. ఉద్యోగాలలో కొన్ని చిక్కులు ఎదురైనా నైపుణ్యంతో అధిగమిస్తారు. పైస్థాయి వారి నుంచి తగినంత ప్రోత్సాహం అందుతుంది. పారిశ్రామికవేత్తలు, కళాకారులకు నూతనోత్సాహం. 25,26 తేదీల్లో ఆర్థిక ఇబ్బందులు, రుణయత్నాలు. ఆరోగ్యసమస్యలు చికాకు పరుస్తాయి. మిత్రులతో విభేదాలు. విష్ణుసహస్రనామ పారాయణ చేయండి.
మీనం... (పూర్వాభాద్ర 4వ పాదం, ఉత్తరభాద్ర, రేవతి).
మిత్రులతో వివాదాలు నెలకొని కొంత నిరుత్సాహం చెందుతారు. ఆస్తుల విషయంలో కొంత గందరగోళ పరిస్థితులు నెలకొనవచ్చు. ఆలోచనలు స్థిరంగా ఉండక చేసే పనిపై ఏకాగ్రత లోపిస్తుంది. కష్టపడ్డా ఫలితం అంతగా లేక డీలా పడతారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో మరింత చురుగ్గా పాల్గొంటారు. మీ సొంత నిర్ణయాలతో ముందుకు సాగడం ఉత్తమం. ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించండి. ముఖ్యమైన కార్యక్రమాలు చాలా ఆలస్యంగా పూర్తి చేస్తారు. ఒక వ్యక్తి పరిచయమై మీకు కొంత ఉపకరిస్తారు. ఇబ్బందులు ఎదురైనా ఏదోవిధంగా సర్దుబాటు కాగలవు. రుణబాధలు తొలగుతాయి. ఖర్చులు తగ్గించుకునేందుకు యత్నిస్తారు. ఆదరించిన∙వారే విమర్శలు గుప్పిస్తారు. సోదరులు, సోదరీలతో అకారణంగా తగాదాలు. మీ ఆలోచనలతో కుటుంబసభ్యులు విభేదిస్తారు. జలుబు వంటి రుగ్మతలు బాధించవచ్చు. వైద్యసేవలు పొందుతారు. వ్యాపారాల విస్తరణ యత్నాలలో ఆటంకాలు ఎదురుకావచ్చు. నూతన పెట్టుబడులు ఆలస్యమవుతాయి. భాగస్వాముల సలహాలు తిరస్కరిస్తారు. ఉద్యోగాలలో ఊహించని మార్పులు తథ్యం. విధుల్లో గందరగోళ పరిస్థితి తప్పకపోవచ్చు. రాజకీయవేత్తలు, కళాకారులకు కొన్ని అవకాశాలు చేజారవచ్చు. 23,24 తేదీల్లో పనుల్లో విజయం. దూరప్రాంతాల నుంచి శుభవార్తలు. ఆర్థికాభివృద్ధి ఉంటుంది. లక్ష్మీ నృసింహస్తోత్రాలు పఠించండి.
–––––––––––––––––––––––––––––
