Sabarimala Get Its Name: శబరిమలకు ఆ పేరు ఎలా వచ్చింది?
పేరు ఎలా వచ్చింది?

Sabarimala Get Its Name: దక్షిణ భారతదేశంలో అత్యంత ప్రసిద్ధిగాంచిన పుణ్యక్షేత్రాలలో శబరిమల ఒకటి. స్వామి అయ్యప్ప కొలువై ఉన్న ఈ పర్వత ప్రాంతానికి 'శబరిమల' అనే పేరు ఎలా వచ్చిందనే దాని వెనుక పురాణ గాథ, చరిత్ర ఉన్నాయి. శబరిమల పేరు రావడానికి ప్రధానంగా రామాయణంలోని ఒక భక్తురాలైన శబరి కథను ఆధారం చేసుకుని చెబుతారు. శబరి ఒక గిరిజన మహిళ, గొప్ప రామ భక్తురాలు. ఆమె తన గురువైన మతంగ మహర్షి ఆదేశం మేరకు, తన ఆశ్రమంలో రాముడి రాక కోసం సుదీర్ఘకాలం వేచి చూసింది. శ్రీరాముడు సీతాన్వేషణలో భాగంగా లక్ష్మణుడితో కలిసి ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు, శబరిని కలుసుకున్నాడు. రాముడికి రుచి చూసిన పండ్లను ప్రేమతో అందించింది శబరి. శబరి భక్తికి మెచ్చిన రాముడు ఆమెకు మోక్షాన్ని ప్రసాదించాడు. శబరి మోక్షం పొందిన పర్వత ప్రాంతం కాబట్టే, ఆమె జ్ఞాపకార్థం ఆ ప్రదేశానికి 'శబరిమల' (శబరి నివాసం లేదా శబరి పర్వతం) అనే పేరు వచ్చిందని భక్తులు ప్రగాఢంగా విశ్వసిస్తారు.మలయాళంలో 'మల' అంటే పర్వతం అని అర్థం. భక్తులు మోక్షాన్ని పొందిన శబరి నివసించిన పర్వతం కాబట్టి, కాలక్రమేణా ఇది 'శబరిమల'గా స్థిరపడింది. శబరిమల కేవలం అయ్యప్ప స్వామి నివాసమే కాదు, ఆ పవిత్ర స్థలంలో దాగి ఉన్న రామాయణ కాలం నాటి భక్తి తత్పరతకు, చరిత్రకు కూడా ఈ పేరు నిదర్శనంగా నిలుస్తోంది.

