ఎలా ఇవ్వాలి?

Tamboolam: హిందూ సంప్రదాయంలో పూజా కార్యక్రమాలు, శుభకార్యాలు ఆతిథ్యంలో తాంబూలం (వెతకలు, పోక చెక్క, సున్నం కలిపి) ఇవ్వడానికి అత్యంత ప్రాధాన్యత ఉంది. అయితే, తాంబూలాన్ని సరైన పద్ధతిలో ఇస్తేనే పూర్తి ఫలితం లభిస్తుందని పండితులు చెబుతున్నారు. తాంబూలాన్ని ఎల్లప్పుడూ జంటగా (రెండు) ఇవ్వాలి. దీనిని శుభానికి సంకేతంగా భావిస్తారు. దేవుడికి నైవేద్యం సమర్పించిన తర్వాత లేదా అతిథులకు భోజనం పెట్టిన తర్వాతనే తాంబూలం ఇవ్వాలి. ఇది ఆతిథ్యాన్ని పూర్తి చేసినట్లుగా పరిగణించబడుతుంది. ఇచ్చే వ్యక్తి తాంబూలాన్ని తమ రెండు చేతులతో పట్టుకొని, తీసుకునే వారి రెండు చేతుల్లోనూ ఆప్యాయతతో ఉంచాలి. కేవలం ఒక్క తమలపాకు, ఒక పోక చెక్క మాత్రమే ఇవ్వడం అశుభమని పెద్దలు చెబుతారు. తాంబూలాన్ని ఎప్పుడూ పూర్తిగా ఇవ్వాలి. వివాహాలు, గృహ ప్రవేశాలు వంటి శుభ కార్యాలలో తాంబూలం మార్పిడి మంగళకరంగా భావిస్తారు.: పూజల తర్వాత దేవుడికి లేదా పెద్దలకు తాంబూలం సమర్పిస్తే, వారి ఆశీస్సులు, దైవానుగ్రహం లభిస్తాయని నమ్మకం. ఆతిథ్యం ఇచ్చిన తర్వాత తాంబూలం ఇవ్వడం వల్ల భోజనం సంపూర్ణమై, సంతృప్తి కలుగుతుందని శాస్త్రాలు చెబుతున్నాయి. పండుగలు, శుభకార్యాల సమయంలో తాంబూలం ఇచ్చేటప్పుడు ఈ నియమాలను పాటించడం వల్ల ఇంట్లో సుఖసంతోషాలు, అదృష్టం కలుగుతాయని ఆధ్యాత్మిక నిపుణులు సూచిస్తున్నారు. తాంబూలంలో దక్షిణ కూడా కచ్చితంగా ఉండాలి. అందుకే రూపాయి, 2 రూపాయల నాణేలు ఉంచాలి. తమలపాకు చివర్లు, అరటి పండ్లు చివర్లు ఇచ్చేవారి వైపు ఉండకూడదు. లేకపోతే తాంబూలం ఇచ్చిన ఫలితం దక్కదని పండితులు చెబుతారు.

