Precautions Pregnant Women During a Solar Eclipse: సూర్యగ్రహణం వేళ గర్భిణులు పాటించాల్సిన ముఖ్యమైన జాగ్రత్తలు..
ముఖ్యమైన జాగ్రత్తలు..

Precautions Pregnant Women During a Solar Eclipse: జ్యోతిష్య శాస్త్రంలోనూ, ఖగోళ శాస్త్రంలోనూ సూర్యగ్రహణానికి అత్యంత ప్రాధాన్యత ఉంది. గ్రహణ సమయంలో వెలువడే వికిరణాలు వాతావరణంలో జరిగే మార్పుల వల్ల కొన్ని ప్రతికూల ప్రభావాలు ఉంటాయని విశ్వసిస్తారు. ముఖ్యంగా గర్భవతులుగా ఉన్న మహిళలు గ్రహణ సమయంలో ప్రత్యేక జాగ్రత్తలు వహించాలని ధర్మశాస్త్రాలు, పెద్దలు సూచిస్తున్నారు.
గ్రహణ సమయంలో గర్భిణులు పాటించాల్సిన నియమాలు
ఇంటికే పరిమితం కావడం
గ్రహణ సమయంలో సూర్యకిరణాలు నేరుగా శరీరంపై పడకుండా ఉండటానికి గర్భిణులు బయటకు రాకుండా ఇంట్లోనే సురక్షితంగా ఉండటం మంచిది.
ఆహార నియమాలు
గ్రహణ సమయానికి ముందే ఆహారం తీసుకోవడం శ్రేయస్కరం. గ్రహణ సమయంలో ఆహారం వండటం లేదా తినడం చేయకూడదు. గ్రహణానికి ముందే ఇంట్లో ఉన్న నీళ్లు, ఆహార పదార్థాలపై తులసి ఆకులు లేదా దర్భలు వేసి ఉంచాలి.
పదునైన వస్తువులను వాడకూడదు
గ్రహణ సమయంలో కత్తెర, సూది, కత్తి, బ్లేడు వంటి పదునైన వస్తువులను ఉపయోగించకూడదు. అలాగే బట్టలు కుట్టడం, కూరగాయలు కోయడం వంటి పనులు చేయకూడదు.
మానసిక ప్రశాంతత - దైవ స్మరణ:
గ్రహణ సమయాన్ని ప్రతికూలంగా భావించకుండా ఇంట్లోనే ప్రశాంతంగా కూర్చుని విష్ణు సహస్రనామం, సంతాన గోపాల మంత్రం, గాయత్రీ మంత్రం లేదా ఇష్టదైవ నామస్మరణ చేయడం వల్ల గర్భంలో ఉన్న శిశువుకు శుభ ఫలితాలు కలుగుతాయి.
నిద్రించడం, వంగడం తగ్గించాలి
గ్రహణం జరుగుతున్నంత సేపు నిద్రపోకుండా, కడుపుపై ఒత్తిడి పడేలా వంగకుండా ప్రశాంతమైన భంగిమలో కూర్చోవడం లేదా విశ్రాంతి తీసుకోవడం మంచిది.
-గ్రహణం ముగిసిన తర్వాత చేయాల్సిన పనులు
గ్రహణం పూర్తయిన వెంటనే ఇల్లంతా శుభ్రం చేసుకుని, గర్భిణీలు
తలస్నానం చేయాలి.
ఆ తర్వాత ఇష్టదైవానికి పూజ చేసుకుని, వీలైతే స్వయంపాకం లేదా బట్టలను పేదలకు దానం చేయడం శుభప్రదం.

