శుభమా..? అశుభమా?

Dog Appearing in a Dream: కలలు అనేవి మన మనసులో ఉండే ఆలోచనలు, భయాలు, ఆశలకు ప్రతిబింబాలు. కలల శాస్త్రం ప్రకారం.. ప్రతి కలకూ ఒక ప్రత్యేకమైన అర్థం ఉంటుంది. ముఖ్యంగా కలలో కుక్క కనిపిస్తే దాని అర్థం సందర్భాన్ని బట్టి మారుతుందని కలల సిద్ధాంత నిపుణులు చెబుతున్నారు. కుక్కలు విశ్వాసానికి, స్నేహానికి చిహ్నాలుగా భావిస్తారు. అయితే కలలో కనిపించే కుక్క రంగు, దాని ప్రవర్తన, అది చేసే పనులను బట్టి దాని అర్థం శుభమా, అశుభమా అని తెలుసుకోవచ్చు. మళ్లీ మీకు అలాంటి కల వచ్చినప్పుడు ఈ విషయాలను గుర్తుంచుకోండి.

కుక్క రంగును బట్టి కలల ఫలితం:

తెల్ల కుక్క:

మీకు కలలో తెల్ల కుక్క కనిపిస్తే అది చాలా మంచి సంకేతం. ఇది మీ జీవితంలో కొత్త అవకాశాలు వస్తాయని, అలాగే నిజమైన, నమ్మకమైన స్నేహితులను పొందుతారని సూచిస్తుంది. సంబంధాలలో విధేయతకు, స్థిరత్వానికి ఇది చిహ్నం.

నల్ల కుక్క: కలలో నల్ల కుక్క కనిపించడం అశుభంగా పరిగణిస్తారు. అది మిమ్మల్ని వెంబడిస్తున్నట్లు లేదా చూస్తున్నట్లు కలగంటే.. మీ జీవితంలో తెలియని శత్రువులు, ప్రతికూల శక్తులు ఉన్నాయని అర్థం చేసుకోవాలి. ఇది మిమ్మల్ని జాగ్రత్తగా ఉండమని హెచ్చరిస్తుంది.

కుక్క ప్రవర్తనను బట్టి కలల ఫలితం:

కుక్క వెంబడిస్తున్నట్లు కల:

ఈ కల మీకు అభద్రతాభావాలు, భయాలు ఉన్నాయని సూచిస్తుంది. మీరు ఏదైనా కష్టమైన నిర్ణయం తీసుకోవడానికి వెనుకడుగు వేస్తున్నారని లేదా కొన్ని బాధ్యతల నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నిస్తున్నారని ఈ కల సూచిస్తుంది.

కుక్క కరిచినట్లు కల:

ఈ కల అత్యంత తీవ్రమైన సంకేతాల్లో ఒకటి. మీకు దగ్గరగా ఉన్నవారు మిమ్మల్ని మోసం చేయవచ్చని లేదా మీ వెనుక కుట్ర జరుగుతోందని ఈ కల సూచిస్తుంది. మీరు ఎవరిని నమ్ముతున్నారో జాగ్రత్తగా ఉండాలి.

కుక్కతో ఆడుకుంటున్నట్లు కల:

మీరు కలలో కుక్కతో సంతోషంగా ఆడుకుంటున్నట్లు కనిపిస్తే అది శుభ సంకేతం. భవిష్యత్తులో మీ సంబంధాలు బలపడతాయని, జీవితంలో కొత్త అవకాశాలు, ఆనందం వస్తాయని ఇది సూచిస్తుంది. ఇది సానుకూల మార్పులకు సంకేతం.

PolitEnt Media

PolitEnt Media

Next Story