జగదభిరాముని అభ‌యం

Jagadabhirama: తిరుపతి శ్రీ కోదండరామస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా నాలుగో రోజు శుక్రవారం రాత్రి 7 గంటలకు సర్వభూపాల వాహనంపై స్వామివారు భక్తులకు అభయమిచ్చారు. భక్తులు అడుగడుగునా కర్పూరహారతులు సమర్పించి స్వామివారిని దర్శించుకున్నారు.

సర్వభూపాలురు అంటే అందరు రాజులు అని అర్థం. ”రాజా ప్రజారంజనాత్‌” అన్నట్లు ప్రజలను రంజింపజేసేవారే రాజులు. ఈ రాజులందరికీ రాజాధిరాజు భగవంతుడు.

వాహ‌న‌సేవ‌లో తిరుమల శ్రీశ్రీశ్రీ పెద్దజీయ‌ర్‌స్వామి, శ్రీశ్రీశ్రీ చిన్నజీయ‌ర్‌స్వామి, ఆలయ డెప్యూటీ ఈవో శ్రీమతి నాగరత్న, టెంపుల్‌ ఇన్‌స్పెక్టర్లు శ్రీ సురేష్, శ్రీ హరికృష్ణ, ఆర్చకులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

మరోవైపు తిరుపతి ఎమ్మెల్యే శ్రీ అరణి శ్రీనివాసులు కుమారుడు శ్రీ అరణి మదన్ మోహన్ తమ జేఎంసీ కన్ట్స్రక్షన్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ తరఫున టీటీడీ శ్రీవేంకటేశ్వర గో సంరక్షణ ట్రస్టుకు శుక్రవారం రూ.10 లక్షలు విరాళంగా అందించారు.

ఈ మేరకు దాత శ్రీవారి ఆలయంలోని రంగనాయకుల మండపంలో టీటీడీ ఈవో శ్రీ ముద్దాడ రవిచంద్రకు విరాళం డీడీని అందజేశారు.

PolitEnt Media

PolitEnt Media

Next Story