July Astrology: జూలై జ్యోతిష్యం.. ఈ 4 రాశుల వారు అప్పులు ఇస్తే అంతే సంగతులు.. డబ్బుల విషయంలో చాలా జాగ్రత్త..
డబ్బుల విషయంలో చాలా జాగ్రత్త..

July Astrology: గ్రహాల మార్పులు, నక్షత్రాల గమనం ఆధారంగా ప్రతి నెల కొందరికి యోగిస్తే, మరికొందరికి మాత్రం సవాళ్లు ఎదురవుతుంటాయి. ముఖ్యంగా ఆర్థిక విషయాలకొస్తే.. జూలై నెలలో కొన్ని రాశుల వారికి గ్రహాల అనుకూలత సరిగ్గా లేదు. దీనివల్ల ఈ నెలలో డబ్బు విషయంలో ఏ మాత్రం అజాగ్రత్తగా ఉన్నా భారీగా నష్టపోయే ప్రమాదం ఉందని జ్యోతిష్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా అప్పులు ఇవ్వడం లేదా తీసుకోవడం అనే విషయాల్లో ఈ క్రింది 4 రాశుల వారు చాలా అప్రమత్తంగా ఉండాలి. ఆ రాశులు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..
మేష రాశి
మేష రాశి వారికి ఈ నెలలో ఆర్థికపరమైన ఒడిదొడుకులు కనిపించే అవకాశం ఉంది. ఈ నెలలో ఎవరికీ పెద్ద మొత్తంలో అప్పులు ఇవ్వకండి. ఒకవేళ ఇస్తే ఆ డబ్బు తిరిగి రావడం చాలా కష్టమవుతుంది. అలాగే విలాసాల కోసం కొత్తగా అప్పులు చేయడం కూడా మంచిది కాదు.
మిథున రాశి
మిథున రాశి వారికి జూలై నెలలో రాబడి బాగున్నప్పటికీ, ఖర్చులు కూడా అదే స్థాయిలో ఉంటాయి. స్నేహితులు లేదా బంధువులు అడిగారని నమ్మి ష్యూరిటీలు సంతకాలు పెట్టకండి. ఈ నెలలో మీరు చేసే ఆర్థిక లావాదేవీలు భవిష్యత్తులో మీ బంధాలను దెబ్బతీసే ప్రమాదం ఉంది. పొదుపుపై దృష్టి పెట్టడం చాలా ఉత్తమం.
సింహ రాశి
సింహ రాశి వారి జాతకంలో ఈ నెలలో వ్యయ స్థానం బలంగా ఉండటం వల్ల అనుకోని ఖర్చులు ముందుకు వస్తాయి. వ్యాపార విస్తరణ కోసమో లేదా లగ్జరీ వస్తువుల కోసమో భారీ మొత్తంలో అప్పులు తీసుకోవద్దని నిపుణులు సూచిస్తున్నారు. ఈ నెలలో చేసే అప్పులు మిమ్మల్ని తీరని మానసిక ఒత్తిడికి గురిచేస్తాయి. ఆర్థిక నిర్ణయాలు తీసుకునే ముందు కుటుంబ సభ్యుల సలహా తీసుకోండి.
వృశ్చిక రాశి
వృశ్చిక రాశి వారికి ఈ నెలలో గ్రహాల సంచారం అనుకూలంగా లేదు. దీనివల్ల మోసపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఆన్‌లైన్ లావాదేవీలు, కొత్త పెట్టుబడుల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. నమ్మకస్తులైన వారికి కూడా ఈ నెలలో హ్యాండ్ లోన్లు ఇవ్వకపోవడమే మంచిది. మీ ఆర్థిక పరిస్థితిని ఇతరులతో ఎక్కువగా పంచుకోకండి.
గ్రహ దోషాల నివారణకు పరిహారాలు..
లక్ష్మీ ఆరాధన:
ఆర్థిక ఇబ్బందుల నుండి బయటపడటానికి శుక్రవారం పూట మహాలక్ష్మిని పూజించడం, స్తోత్రాలు పఠించడం మంచిది.
దానధర్మాలు:
శనివారం లేదా బుధవారం నాడు పేదలకు అన్నదానం చేయడం వల్ల లేదా అవసరమైన వారికి వస్త్రదానం చేయడం వల్ల గ్రహ దోషాల తీవ్రత తగ్గుతుంది.

