Jupiter and Saturn Retrograde: గురు, శని వక్ర చలనం.. 4 రాశుల వారికి తిరుగుండదు.. డబ్బే డబ్బు, లక్కీ ఛాన్స్..
డబ్బే డబ్బు, లక్కీ ఛాన్స్..

Jupiter and Saturn Retrograde: జ్యోతిష్య శాస్త్రంలో గురు, శని గ్రహాల కదలికలకు అత్యంత ప్రాధాన్యత ఉంది. దేవగురువు అయిన బృహస్పతి భాగ్యాన్ని, నవగ్రహాలలో న్యాయధికారి అయిన శని దేవుడు మన కర్మల ఫలితాలను నిర్దేశిస్తారు. ఈ జూలై నెలలో ఈ రెండు కీలక గ్రహాల స్థితిగతులలో వచ్చే మార్పులు కొన్ని రాశుల వారికి అమితమైన అదృష్టాన్ని మోసుకురానున్నాయి. ముఖ్యంగా ఈ క్రింది 4 రాశుల వారు ఆర్థికంగా, వృత్తిపరంగా అద్భుతమైన పురోగతిని సాధించబోతున్నారు. ఆ లక్కీ రాశులు ఏంటో ఇప్పుడు చూద్దాం..
మేష రాశి
గురు, శని గ్రహాల మార్పులు మేష రాశి వారికి ఉద్యోగ, వ్యాపార రంగాలలో గోల్డెన్ పీరియడ్‌ను తీసుకువస్తాయి. చాలా కాలంగా నిలిచిపోయిన పనులు సజావుగా సాగుతాయి. రావలసిన బాకీలు వసూలవుతాయి. నిరుద్యోగులకు మంచి కంపెనీల నుండి ఆఫర్లు వస్తాయి. ఉద్యోగులకు ప్రమోషన్ లేదా జీతాల పెంపు ఉండే అవకాశం ఉంది.
సింహ రాశి
సింహ రాశి వారికి ఈ కాలంలో సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. గురు దేవుని అనుగ్రహం వల్ల పెండింగ్ పనులు వేగవంతం అవుతాయి. కొత్త ఆదాయ వనరులు తెరుచుకుంటాయి. పెట్టుబడుల నుండి మంచి లాభాలు అందుతాయి. కుటుంబంలో ఉన్న చిన్నపాటి విభేదాలు తొలగిపోయి ప్రశాంతత చేకూరుతుంది. కోర్టు కేసులు మీకు అనుకూలంగా మారే అవకాశం ఉంది.
తులా రాశి
తులా రాశి వారికి శని దేవుని అనుకూలత వల్ల శ్రమకు తగ్గ ప్రతిఫలం లభిస్తుంది. వ్యాపారస్తులు ఊహించని లాభాలను గడిస్తారు. నూతన వ్యాపార ఒప్పందాలు కుదురుతాయి. కార్యాలయంలో మీ పనితీరుకు పైఅధికారుల నుండి ప్రశంసలు దక్కుతాయి. విదేశీ ప్రయాణాలకు ఉన్న అడ్డంకులు తొలగిపోతాయి.
కుంభ రాశి
కుంభ రాశికి శని అధిపతి కావడంతో పాటు, గురుడి శుభ దృష్టి వల్ల ఈ రాశి వారికి ఆకస్మిక ధనలాభ సూచనలు ఉన్నాయి. పూర్వీకుల ఆస్తి కలిసిరావడం లేదా పాత పెట్టుబడుల నుండి భారీ రిటర్న్స్ రావడం జరుగుతుంది. ఆర్థిక ఇబ్బందుల నుండి పూర్తిగా విముక్తి లభిస్తుంది. నూతన వాహనం లేదా ఇల్లు కొనుగోలు చేసే కల నెరవేరుతుంది. ఆరోగ్యం మెరుగుపడుతుంది.
అదృష్టం మరింత పెరగాలంటే..
శనిదేవుని ఆరాధన:
శనివారం రోజు శని చాలీసా పఠించడం లేదా నువ్వుల నూనెతో దీపారాధన చేయడం వల్ల శని దోషాలు తొలగి శుభ ఫలితాలు పెరుగుతాయి.
గురు పూజ:
గురువారం నాడు దక్షిణామూర్తిని లేదా రాఘవేంద్ర స్వామిని పూజించడం, పసుపు రంగు వస్తువులను దానం చేయడం వల్ల గురు బలం మరింత పెరుగుతుంది.

