Jupiter Transit Before Diwali: బృహస్పతి సంచారం.. దీపావళికి ముందు ఈ 2 రాశులకు పట్టిందల్లా బంగారమే
దీపావళికి ముందు ఈ 2 రాశులకు పట్టిందల్లా బంగారమే

Jupiter Transit Before Diwali: గ్రహాల సంచారం, ముఖ్యంగా దేవగురువు బృహస్పతి సంచారం జ్యోతిషశాస్త్రంలో అత్యంత ముఖ్యమైనది. అదృష్టం, సంపద, జ్ఞానం, శ్రేయస్సుకు కారకుడైన బృహస్పతి స్థానం మారడం దేశం, ప్రపంచంపై ప్రభావం చూపుతుంది. అక్టోబర్ 18న దీపావళి పండుగకు ముందు బృహస్పతి తన రాశిని మారుస్తాడు. ప్రస్తుత మిథునంలో ఉండగా.. అక్టోబర్ 18న కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తాడు. ఈ సంచారం పవిత్రమైన ధనత్రయోదశి రోజున జరుగుతోంది, కాబట్టి దీని ప్రభావం మరింత ఎక్కువగా ఉంటుంది.
ఈ బృహస్పతి సంచారం మొత్తం 12 రాశులపై ప్రభావం చూపినా, ముఖ్యంగా ఈ రెండు రాశులకు గోల్డెన్ టైమ్ లాంటి అద్భుతమైన ఫలితాలను ఇవ్వనుంది.
అదృష్టాన్ని అందుకునే రాశులు:
మిథున రాశి:
దీనివల్ల ఆర్థిక సమస్యలు తొలగిపోయి, ఆకస్మిక ధన లాభాలు పొందే అవకాశం ఉంది. మీ సంపాదన శక్తి పెరిగి, ఆదాయం మెరుగుపడుతుంది. పొదుపు చేస్తారు. ఆర్థికం, బ్యాంకింగ్, టీచింగ్ రంగాలలో ఉన్నవారికి ఎక్కువ ప్రయోజనాలు లభిస్తాయి. కుటుంబంలో శాంతి, సంతోషం నెలకొంటుంది. మీ మాట తీరు ప్రభావవంతంగా ఉండి, ఇతరులను ఆకర్షిస్తుంది. పెద్దల మద్దతు లభిస్తుంది. పెట్టుబడులకు ఇది మంచి సమయం.
కన్య రాశి:
బృహస్పతి సంచారం సంపద మరియు ప్రతిష్టను పెంచుతుంది. పనిలో ఆధిపత్యం పెరుగుతుంది. ఉద్యోగంలో పదోన్నతి, జీతం పెరుగుదల, వ్యాపారంలో వృద్ధికి అవకాశాలు ఉన్నాయి. చాలాకాలంగా పెండింగ్‌లో ఉన్న పనులు పూర్తవుతాయి. శత్రువులపై విజయం సాధిస్తారు. దాదాపు అన్ని ప్రయత్నాలలో విజయం లభిస్తుంది. పెళ్లికాని వారికి వివాహం జరిగే అవకాశం ఉంది. వైవాహిక జీవితం సామరస్యంగా ఉంటుంది. పిల్లలు కావాలనుకునే వారికి శుభవార్త అందవచ్చు.
జ్యోతిష్య ప్రాముఖ్యత:
ధన త్రయోదశి రోజున బృహస్పతి రాశి మారడం చాలా శుభప్రదం. ఈ సమయంలో దానం చేయడం, ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొనడం, బంగారం, వెండిని కొనుగోలు చేయడం వల్ల జీవితంలో అదృష్టం, శ్రేయస్సు పెరుగుతాయని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు.
