జూలై 06 నుండి 08 వరకు జ్యేష్ఠాభిషేకం

Jyeshtabhishekam: తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో జూలై 06 నుండి 08వ తేదీ వరకు మూడు రోజుల పాటు జ్యేష్ఠాభిషేకం జరుగనుంది. ప్రతి ఆషాఢ మాసంలో తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారికి జ్యేష్ఠాభిషేకం నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. ఇందులో భాగంగా ఆలయంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తారు. మొదటి రోజు జూలై 06న ఉదయం సుప్రభాతంతో స్వామివారిని మేల్కొలిపి కైంకర్యాలు శ‌త‌క‌ల‌శ‌ స్న‌ప‌నం, మ‌హాశాంతి హోమం చేప‌డుతారు. ఆలయంలోని కల్యాణమండపంలో శ్రీదేవి, భూదేవి సమేత శ్రీగోవిందరాజస్వామివారి ఉత్సవమూర్తులకు స్నపన తిరుమంజనం, సమర్పణ, బ్రహ్మఘోష తదితర కార్యక్రమాలు వేడుకగా జరుగనున్నాయి. జూలై 07వ తేదీ రెండో రోజున ఉదయం సాంప్రదాయబద్ధంగా కైంకర్యాలు జరిగాక శాత్తుమొరాయి, ఆస్థానం నిర్వహిస్తారు. సాయంత్రం ఉభయ నాంచారులతో స్వామివారు నాలుగు మాడా వీధులలో విహరించి భక్తులను అనుగ్రహించనున్నారు. జూలై 08వ తేదీ మూడో రోజున తిరుమంజనం, సమర్పణ, కవచ ప్రతిష్ట తదితర కార్యక్రమాల అనంతరం సాయంత్రం కవచ సమర్పణ చేపడుతారు. సాయంత్రం 5.30 – 6.30 గం.ల వరకు ఉభయ నాంచారులతో శ్రీవారు నాలుగు మాడ వీధులలో విహరిస్తారు.

PolitEnt Media

PolitEnt Media

Next Story