గంగా స్నానం, దీపాలు ఎందుకు అంత పవిత్రం..?

Kartik Pournami: కార్తీక పౌర్ణమి హిందూ మతంలో అత్యంత పవిత్రమైన రోజుల్లో ఒకటిగా చెప్తారు. కార్తీక మాసంలో వచ్చే ఈ పౌర్ణమి నాడు కొన్ని ప్రత్యేక ఆచారాలు పాటించడం వల్ల అనంతమైన పుణ్యం లభిస్తుందని నమ్ముతారు.

గంగా స్నానం మరియు దీపారాధన ప్రాముఖ్యత

స్నానం: కార్తీక పౌర్ణమి రోజున గంగానదిలో స్నానం చేయడం చాలా శుభప్రదం. ఇలా చేయడం వల్ల అన్ని పాపాలు తొలగిపోయి, ఆత్మ శుద్ధి అవుతుందని.. తద్వారా మోక్షానికి మార్గం సుగమం అవుతుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం.

బ్రహ్మ ముహూర్త స్నానం: ముఖ్యంగా బ్రహ్మ ముహూర్త సమయంలో స్నానం చేయడం ద్వారా గత జన్మల పాపాలు కూడా తొలగిపోతాయని చెబుతారు.

దీపారాధన: ఈ రోజున నది ఒడ్డున దీపాలు వెలిగించడం వల్ల జీవితంలో వెలుగు, శాంతి, శ్రేయస్సు లభిస్తాయని నమ్ముతారు.

ఈ రోజు పూజించాల్సిన దేవతలు

కార్తీక పౌర్ణమి రోజున కేవలం గంగా స్నానం మాత్రమే కాకుండా ఉపవాసం ఉండటం, దానధర్మాలు చేయడం ద్వారా కూడా పుణ్యం లభిస్తుంది. ఈ రోజున భక్తులు విష్ణువు, శివుడు, లక్ష్మీ దేవిని ప్రత్యేకంగా పూజించడం ఆచారం.

విష్ణువు మత్స్య అవతారం

మత విశ్వాసాల ప్రకారం.. కార్తీక పౌర్ణమి రోజుకు విష్ణుమూర్తి మత్స్య అవతారానికి ప్రత్యేక అనుబంధం ఉంది. విష్ణువు పది ప్రధాన అవతారాలలో మొదటిది ఈ మత్స్య అవతారం. ఈ రోజునే విష్ణువు చేప రూపంలో దర్శనమిచ్చి, ప్రళయం సమయంలో వేదాలను రక్షించడానికి, సృష్టిని తిరిగి ప్రారంభించడానికి మనువుకు మార్గనిర్దేశం చేశాడని పురాణ గాథలు చెబుతున్నాయి. అందుకే ఈ రోజున విష్ణువును పూజించడం వల్ల జీవితంలో ధర్మం, జ్ఞానం, ఆధ్యాత్మిక శక్తి పెరుగుతాయి.

PolitEnt Media

PolitEnt Media

Next Story