వాస్తు శాస్త్రం ఏం చెబుతోంది!

Keeping a Taj Mahal Photo at Home: ప్రపంచ వింతల్లో ఒకటిగా, ప్రేమకు చిహ్నంగా తాజ్ మహల్ పేరు పొందింది. అయితే చూడటానికి ఎంత అందంగా ఉన్నా.. తాజ్ మహల్ చిత్రాన్ని లేదా బొమ్మను ఇంట్లో ఉంచడం వాస్తు ప్రకారం మంచిది కాదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. దీని వెనుక ఉన్న కారణాలు ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చనీయాంశమవుతున్నాయి.

సమాధి చిహ్నం:

తాజ్ మహల్ వాస్తవానికి షాజహాన్ తన భార్య ముంతాజ్ జ్ఞాపకార్థం నిర్మించిన ఒక సమాధి స్మారక చిహ్నం*వ. వాస్తు శాస్త్ర సంప్రదాయాల ప్రకారం:

ప్రతికూల శక్తి:

మరణానికి లేదా దహన సంస్కారాలకు సంబంధించిన వస్తువులను ఇంట్లో ఉంచడం వల్ల సానుకూల శక్తి తగ్గుతుంది.

మనశ్శాంతికి భంగం:

మరణాన్ని సూచించే చిహ్నాలు ఇంట్లో ఉండటం వల్ల నిరంతరం ఏదో తెలియని విచారం, ఆందోళన లేదా భయం కలిగే అవకాశం ఉంది.

పురోగతికి అడ్డంకులు:

వాస్తు నిపుణుల అభిప్రాయం ప్రకారం, ఇంట్లో సమాధి చిత్రాలు ఉండటం వల్ల కుటుంబ సభ్యుల ఎదుగుదలపై ప్రభావం పడుతుంది:

ఆర్థిక ఇబ్బందులు:

వ్యాపారంలో లేదా ఉద్యోగంలో పురోగతి మందగించడం, ఆర్థిక పరమైన చిక్కులు ఎదురయ్యే అవకాశం ఉంది.

పనుల్లో జాప్యం:

చేపట్టిన పనులు సకాలంలో పూర్తి కాకపోవడం నిరాశ వంటి భావాలు కుటుంబ సభ్యుల్లో కలగవచ్చు.

బహుమతిగా ఇవ్వడం అశుభమా?

సాధారణంగా పెళ్లిళ్లకు లేదా గృహప్రవేశాలకు తాజ్ మహల్ బొమ్మలను బహుమతిగా ఇస్తుంటారు. కానీ శాస్త్రం ప్రకారం..

ప్రేమకు చిహ్నం అనుకున్నప్పటికీ, అది ఒక సమాధి కాబట్టి దానిని ఇతరులకు బహుమతిగా ఇవ్వడం అశుభంగా పరిగణించబడుతుంది.

ది స్వీకరించేవారి ఇంట్లో కూడా ప్రతికూల వాతావరణానికి దారితీస్తుందని కొందరి నమ్మకం.

మన ఇంట్లో ఉంచే ప్రతి వస్తువు మన మానసిక స్థితిని, ఇంటి శక్తిని ప్రభావితం చేస్తుంది. కాబట్టి అందంగా కనిపిస్తున్నాయని సమాధులను సూచించే చిత్రాల కంటే.. ప్రశాంతతను, పురోగతిని ఇచ్చే చిత్రాలను ఎంచుకోవడం ఉత్తమం.

PolitEnt Media

PolitEnt Media

Next Story