Foundation of Your Home: మీ ఇంటికి పునాది వేసే ముందు ఇది తెలుసుకోండి..
ఇది తెలుసుకోండి..

Foundation of Your Home: ఇల్లు కట్టడం అనేది కేవలం ఒక నిర్మాణం కాదు, అది కుటుంబ భవిష్యత్తుకు సంబంధించిన ఒక ముఖ్యమైన నిర్ణయం. ఇల్లు కట్టేటప్పుడు పాటించాల్సిన ముఖ్యమైన వాస్తు సూత్రాల గురించి పండితులు కీలక విషయాలు వివరించారు. ముఖ్యంగా ఆయ అనే అంశాన్ని పరిగణనలోకి తీసుకోవడం చాలా అవసరం తెలిపారు. ఆయ అంటే ఇంటి ఆయుష్షు అని అర్థం.
ఆయ అంటే ఏమిటీ..? దానిని ఎలా లెక్కిస్తారు?
ఆయ అనేది ఇంటి పొడవు, వెడల్పు ఆధారంగా లెక్కించే ఒక సంఖ్య. ఇంటి పొడవు, వెడల్పును గుణించి, ఆ సంఖ్యను తొమ్మిదిచే గుణించి, చివరిగా ఎనిమిదిచే భాగిస్తే వచ్చే శేషాన్ని ఆయగా పరిగణిస్తారు. ఒకటి నుంచి ఎనిమిది వరకు ఎనిమిది రకాల ఆయాలు ఉంటాయి. ప్రతి ఆయానికి వేర్వేరు ఫలితాలు ఉంటాయని నమ్ముతారు.
ధ్వజాయ, వృషభాయ, గజాయ అనేవి ఇల్లు కట్టడానికి అత్యంత శుభప్రదమైన ఆయాలు. ఈ ఆయాలలో ఇల్లు కట్టడం వల్ల ఇంటి ఆయుష్షు పెరుగుతుందని, కుటుంబ సభ్యులకు ఆనందం, శ్రేయస్సు లభిస్తాయని నమ్మకం.
గృహ నిర్మాణంలో ఇతర ముఖ్య అంశాలు
ఆయను పరిగణనలోకి తీసుకోవడంతో పాటు గృహ నిర్మాణం ప్రారంభించడానికి ముందు కొన్ని ఇతర విషయాలను కూడా పాటించాలని సూచిస్తున్నారు:
జాతకంలో గృహయోగం ఉందో లేదో తనిఖీ చేయాలి.
ఇల్లు కట్టడానికి అనువైన, శుభప్రదమైన స్థలాన్ని ఎంచుకోవాలి.
శుభ ముహూర్తంలో మాత్రమే నిర్మాణ పనులను ప్రారంభించాలి.
ఆయాన్ని లెక్కించే పద్ధతి గురించి మరింత తెలుసుకోవడానికి ఒక జ్యోతిష్కుడిని సంప్రదించడం మంచిదని ఆయన సలహా ఇచ్చారు. భౌతిక సౌకర్యాలతో పాటు ఆధ్యాత్మిక అంశాలను కూడా పరిగణనలోకి తీసుకుంటే ఇల్లు ఒక పవిత్రమైన, సంతోషకరమైన ప్రదేశంగా మారుతుందని గురూజీ చెప్పారు.
