Lemon: ప్రస్తుత రోజుల్లో ఎన్నో రకాల వాస్తు చిట్కాలు పాటిస్తున్నప్పటికీ.. ఇళ్లల్లో ఏదో ఒక సమస్య, ఆర్థిక ఇబ్బందులు వెంటాడుతూనే ఉంటాయి. అంతా బాగున్నా కుటుంబంలో కలహాలు, మానసిక అశాంతి కలుగుతుంటాయి. అయితే, మన ఇంటి వంటగదిలో లభించే ఒక చిన్న నిమ్మకాయతో ఈ సమస్యలన్నింటికీ చెక్ పెట్టవచ్చని వాస్తు నిపుణులు చెబుతున్నారు.

వాస్తు శాస్త్రం ప్రకారం.. నిమ్మకాయకు ప్రతికూల శక్తిని (Negative Energy) అత్యంత వేగంగా గ్రహించే శక్తి ఉంది. అందుకే ఇంట్లో నెగటివ్ వైబ్స్ ఎక్కువగా ఉన్నప్పుడు, గాలి సరిగా ప్రసరించని చోట నిమ్మకాయ పరిహారాలు అద్భుతంగా పనిచేస్తాయి.

1) ప్రధాన ద్వారం వద్ద రక్షణ:ఎవరి ఇళ్లల్లో అయితే ఆర్థిక సమస్యలు, మానసిక వేదన ఎక్కువగా ఉంటాయో.. వారు కొన్ని నిమ్మకాయలను పూజించి, ధూప-దీపాలు సమర్పించిన తర్వాత ఇంటి ప్రధాన గుమ్మం వద్ద కట్టాలని వాస్తు పండితులు సూచిస్తున్నారు. ఇది బయటి నుంచి వచ్చే దుష్ట శక్తులను, నరదిష్టిని అడ్డుకుంటుంది.

2).. ఇంటి శుభ్రతలో నిమ్మ:ఇంటిని ప్రతిరోజూ నీళ్లతో శుభ్రం చేసేటప్పుడు.. ఆ నీటిలో రెండు చుక్కల నిమ్మరసం మరియు కొద్దిగా ఉప్పు వేసి ఇల్లు తుడవాలి. దీనివల్ల ఇంట్లోని క్రిములతో పాటు, ప్రతికూల శక్తి కూడా పూర్తిగా తొలగిపోతుంది.

3)గాజు గ్లాస్ చిట్కా: ఒక గాజు గ్లాసులో మంచి నీళ్లు పోసి, అందులో ఒక నిమ్మకాయను వేసి హాలులో టేబుల్ మీద ఉంచితే.. అది ఆ ప్రాంతంలోని నెగటివ్ ఎనర్జీని పీల్చుకుని, సానుకూల వాతావరణాన్ని వెదజల్లుతుంది. వ్యాపార స్థలాల్లో కూడా ఈ చిట్కాను చాలా మంది పాటిస్తుంటారు.

PolitEnt Media

PolitEnt Media

Next Story