పరమ వాసుదేవుడు

Lord Vasudeva on the Chinnasesha Vahana: తిరుచానూరు శ్రీ ప‌ద్మావ‌తి అమ్మ‌వారి కార్తీక బ్రహ్మోత్సవాల మొదటిరోజైన సోమవారం రాత్రి శ్రీ పద్మావతి అమ్మవారు పరమ వాసుదేవుడు అలంకారంలో చిన్న‌శేష‌వాహ‌నంపై అభ‌య‌మిచ్చారు.

మొదటి వాహనం చిన్నశేషుడు. చిన్నశేష వాహనంపై అమ్మవారు జీవకోటిని ఉద్ధరించే లోకమాతగా దర్శనమిస్తారు. శేషభూతమైన ఈ ప్రపంచం సిరులతల్లి రక్షణలో సుఖాన్ని పొందుతోంది. ఈ వాహనంపై అమ్మవారి ద‌ర్శ‌నం వ‌ల్ల యోగసిద్ధి చేకూరుతుందని భక్తుల విశ్వాసం.

వాహనసేవలో పెద్దజీయ‌ర్ స్వామి, చిన్నజీయ‌ర్ స్వామి, ఈవో అనిల్ కుమార్ సింఘాల్, జెఈవో వి.వీర‌బ్ర‌హ్మం, సివిఎస్వో కే.వి.మురళీకృష్ణ, ఆలయ డెప్యూటీ ఈవో హరింద్రనాథ్, ఆల‌య అర్చ‌కులు బాబుస్వామి, ఇతర అధికారులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

PolitEnt Media

PolitEnt Media

Next Story