ఇది శని దోషం పోయినట్లేనట..

Lost Your Footwear at a Temple: సాధారణంగా దేవాలయానికి వెళ్ళినప్పుడు మన కొత్త చెప్పులు గానీ, ఖరీదైన పాదరక్షలు గానీ పోతే చాలా బాధపడతాం. దేవుడి దగ్గరికి వస్తే ఇలా జరిగిందేంటి? అని నిందలు వేసుకుంటాం. కానీ, జ్యోతిష్య శాస్త్రం ప్రకారం పవిత్ర స్థలాల్లో చెప్పులు పోగొట్టుకోవడం అత్యంత శుభప్రదమని, అది మీపై ఉన్న దౌర్భాగ్యం తొలగిపోవడానికి సంకేతమని పండితులు చెబుతున్నారు.

శని గ్రహంతో విడదీయలేని సంబంధం:

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, పాదరక్షలు శని గ్రహానికి చిహ్నంగా పరిగణించబడతాయి. ఒక వ్యక్తి జాతకంలో శని దోషం, ఏలినాటి శని లేదా శని ప్రభావం ఎక్కువగా ఉన్నప్పుడు.. ఆలయం వంటి చోట చెప్పులు పోతే, ఆ పాదరక్షలతో పాటు శని వల్ల కలిగే ప్రతికూల ప్రభావాలు కూడా తొలగిపోతాయని నమ్ముతారు.

శనివారం రోజు జరిగితే: ముఖ్యంగా శనివారం రోజు దేవాలయంలో చెప్పులు పోతే, అది శని దేవుని కోపం తగ్గుముఖం పట్టిందనడానికి బలమైన సంకేతం. అందుకే కొన్ని ప్రాంతాల్లో శని దేవుని ఆలయం వద్ద పాత చెప్పులను కావాలనే వదిలి వెళ్తుంటారు.

ప్రతికూల శక్తి నుండి విముక్తి:

మనం ధరించే బూట్లు లేదా చెప్పులు రోజంతా బయటి దుమ్ము, ధూళితో పాటు ఎంతో ప్రతికూల శక్తిని గ్రహిస్తాయి.

పరిశుద్ధత: పవిత్రమైన ఆలయ ప్రాంగణంలో ఆ చెప్పులు పోగొట్టుకుంటే, ఆ ప్రతికూలత అక్కడే ఉండిపోయి, మీరు శుద్ధమైన మనసుతో, తేలికైన భావంతో ఇంటికి వెళ్తున్నట్లు అర్థం.

దురదృష్టానికి ముగింపు: పాదరక్షలు పోగొట్టుకోవడం అంటే మీ జీవితంలోని పాత దుఃఖం లేదా దురదృష్టం ముగిసిపోయిందని చెప్పడానికి చిహ్నం.

కొత్త ప్రారంభానికి నాంది:

చెప్పులు పోయినప్పుడు చాలా మంది ఖాళీ కాళ్లతో ఇంటికి నడవాల్సి వస్తుంది. జ్యోతిష్య పరిభాషలో దీనిని ఒక 'కొత్త ప్రారంభంగా భావిస్తారు. మీ జీవితంలోకి కొత్త అదృష్టం, ఆనందం ప్రవేశించబోతున్నాయని చెప్పడానికి ఇది ఒక సంకేతం.

కాబట్టి ఇకపై ఎప్పుడైనా గుడిలో చెప్పులు పోతే అస్సలు టెన్షన్ పడకండి. మీపై ఉన్న శని ప్రభావం లేదా కష్టాలు ఆ చెప్పులతో పాటు పోయాయని సంతోషంగా ఇంటికి రండి..

PolitEnt Media

PolitEnt Media

Next Story