Lunar Eclipse Tomorrow: చంద్రగ్రహణం.. రేపు ఆలయాలు మూసివేత
రేపు ఆలయాలు మూసివేత

Lunar Eclipse Tomorrow: తెలుగు రాష్ట్రాల్లోని ఆలయాలు అన్నీ రేపు చంద్రగ్రహణం కారణంగా మూతపడనున్నాయి. తిరుమల శ్రీవారి ఆలయ దర్శనాలను ఉదయం 9 నుంచి రాత్రి 7.30 వరకు నిలిపివేస్తారు. తిరుమలలో గ్రహణం కారణంగా అన్నప్రసాద వితరణ, సర్వదర్శనంలో మార్పులు ఉండనున్నాయి. గ్రహణం ముగిసిన తర్వాత ఆలయాలను శుద్ధి చేసి, పుణ్యాహవాచనం నిర్వహించిన అనంతరం తిరిగి భక్తులను దర్శనాలకు అనుమతించనున్నారు.
మరోవైపు తెలంగాణ లోని యాదగిరిగుట్ట ఆలయాన్ని ఉదయం 7కే మూసివేస్తామని తిరిగి బుధవారం తెరవనున్నట్లు యాజమాన్యం వెల్లడించింది. రేపు నిర్వహించాల్సిన హోలికోత్సవాన్ని ఈరోజు సాయంత్రం నిర్వహించనున్నట్లు తెలిపింది. అయితే శ్రీకాళహస్తి ఆలయం మాత్రం రేపు తెరిచే ఉంటుంది.
రేపు చంద్రగ్రహణం మధ్యాహ్నం 3.20 గంటలకు ప్రారంభమై సాయంత్రం 6.48 గంటలకు వీడుతుంది. సాయంత్రం గం.4.34 నుంచి 5.33 మధ్య సంపూర్ణ గ్రహణకాలం ఉంటుంది. అయితే భారత్‌లో సాయంత్రం గం.6.20 నుంచి సుమారు 27 నిమిషాలు కనిపిస్తుంది. అండమాన్ దీవులు, ఈశాన్య రాష్ట్రాల్లోని పలు ప్రాంతాలు మినహా దేశంలోని మిగతా చోట్ల సంపూర్ణ చంద్రగ్రహణం కనిపిస్తుంది. ఇక మళ్లీ భారత్‌లో 2028 డిసెంబరు 31న సంపూర్ణ చంద్రగ్రహణం చూడొచ్చు.

