Malavya Rajyoga Begins on October 20: జ్యోతిషశాస్త్రంలో గ్రహాల కదలికలకు ఎంతో ప్రాధాన్యత ఉంది. సంపద, సౌందర్యం, ప్రేమ, భోగభాగ్యాలకు కారకుడైన శుక్ర గ్రహం అక్టోబర్ 20న తన సొంత రాశి అయిన తులారాశిలోకి ప్రవేశించబోతోంది. జ్యోతిష్య నిబంధనల ప్రకారం శుక్రుడు స్వక్షేత్రంలో బలంగా ఉన్నప్పుడు పంచ మహాపురుష యోగాలలో అత్యంత శక్తివంతమైన మాళవ్య రాజయోగం ఏర్పడుతుంది. ఈ రాజయోగ ప్రభావం వల్ల ప్రధానంగా ఆరు రాశుల వారికి ఆర్థికంగా, వృత్తిపరంగా విశేష ప్రయోజనాలు కలగనున్నాయని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు. ఆ రాశుల వివరాలు ఇక్కడ చూద్దాం.

కర్కాటక రాశి

కర్కాటక రాశి వారికి ఈ కాలం కెరీర్‌లో సరికొత్త అవకాశాలను తెచ్చిపెడుతుంది. కార్యాలయంలో మీ శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది. భవిష్యత్తుకు బలమైన పునాది వేసే కీలక నిర్ణయాలు తీసుకుంటారు. ఉన్నత విద్య, విదేశీ ప్రయాణాలు, ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొనాలనుకునే వారికి వాతావరణం అత్యంత అనుకూలంగా ఉంటుంది.

సింహ రాశి

సింహ రాశి వారికి వ్యాపార రంగంలో లాభాలు పెరిగే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. నిలిచిపోయిన పనులు, ప్రాజెక్టులు తిరిగి ఊపందుకుంటాయి. వ్యాపార విస్తరణకు కొత్త పరిచయాలు ఏర్పడతాయి. నగదు ప్రవాహం పెరగడంతో పాటు, విద్యార్థులకు పోటీ పరీక్షలు, ఉన్నత చదువుల్లో సానుకూల ఫలితాలు వస్తాయి.

కన్యా రాశి

ఈ రాశి వారికి భాగస్వామ్య వ్యాపారాలు మరియు ఉద్యోగాల్లో సానుకూల మార్పులు చోటుచేసుకుంటాయి. నిరుద్యోగులకు కొత్త ఉద్యోగ అవకాశాలు లభించే సూచనలు ఉన్నాయి. ఉద్యోగస్తులకు ప్రమోషన్లు, అదనపు బాధ్యతలు లేదా జీతాల పెంపు వంటి శుభవార్తలు అందుతాయి. వ్యాపారస్తులు కొత్త ఒప్పందాలు చేసుకునేందుకు ఇది సరైన సమయం.

తులా రాశి

స్వక్షేత్రంలోనే శుక్ర సంచారం జరగడం వల్ల తులారాశి వారికి ఈ యోగం అత్యంత శ్రేష్ఠమైన ఫలితాలను ఇస్తుంది. ఆత్మవిశ్వాసం రెట్టింపు అవుతుంది. ఆదాయ మార్గాలు విస్తరిస్తాయి. వృత్తి, వ్యాపారాలలో సరికొత్త ప్రణాళికలు విజయవంతం అవుతాయి. సమాజంలో గౌరవ ప్రతిష్టలు పెరగడంతో పాటు, వ్యక్తిగత మరియు దాంపత్య జీవితంలో అనుకూలమైన వాతావరణం ఉంటుంది.

వృశ్చిక రాశి

వృశ్చిక రాశి వారికి ఊహించని ధనలాభం కలిగే సూచనలు ఉన్నాయి. పాత మరియు కొత్త పరిచయాల ద్వారా అనుకూలమైన వ్యాపార అవకాశాలు దక్కుతాయి. అయితే, పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెట్టేటప్పుడు, ముఖ్యమైన ఆర్థిక నిర్ణయాలు తీసుకునేటప్పుడు తొందరపాటు లేకుండా నిపుణుల సలహాలు తీసుకోవడం శ్రేయస్కరం.

కుంభ రాశి

కుంభ రాశి వారికి ధన ప్రవాహం నిరంతరం కొనసాగుతుంది. పొదుపు చేసే సామర్థ్యం పెరుగుతుంది. కుటుంబంలో సంతోషకరమైన, ప్రశాంతమైన వాతావరణం నెలకొంటుంది. మీ సమయస్ఫూర్తి, వాక్చాతుర్యంతో క్లిష్టమైన సమస్యలను సైతం సులువుగా పరిష్కరించుకుంటారు.

Next Story