Manglik Dosha and Marriage: హిందూ సాంప్రదాయంలో వివాహ నిశ్చయానికి ముందు వధూవరుల జాతకాలను పరిశీలించడం అనూహ్యంగా వస్తున్న ఆచారం. జాతక చక్రంలో అన్ని గ్రహాల స్థితులు ఒకెత్తయితే.. కుజ దోషం లేదా మంగళ దోషం అనేది ఒక ఎత్తు. జాతకంలో కుజుడి ప్రభావం వల్ల కలిగే ఈ దోషం వివాహ బంధాన్ని, దంపతుల జీవితాన్ని ఎంతగానో ప్రభావితం చేస్తుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతుంటారు. అసలు కుజ దోషం అంటే ఏమిటి? ఇది పెళ్లిపై ఎలాంటి ప్రభావం చూపుతుంది? దీనికి గల సాధారణ పరిహారాలు ఏంటో ఇప్పుడు వివరంగా చూద్దాం.

అసలు కుజ దోషం అంటే ఏమిటి?

ఒకరి జాతక చక్రంలో లగ్నం నుండి లేదా చంద్రుడి నుండి 1, 2, 4, 7, 8, 12వ స్థానాల్లో కుజ గ్రహం గనుక ఉంటే దానిని కుజ దోషం లేదా చేవ్వాయ్ దోషం అని పిలుస్తారు. జ్యోతిష్యం ప్రకారం కుజుడు అగ్ని తత్వానికి, దూకుడుకు, శౌర్యానికి ప్రతీక. అందుకే ఈ స్థానాల్లో కుజుడు ఉన్నప్పుడు జాతకంలో తీవ్రమైన మార్పులు కనిపిస్తాయి.

వివాహ అనుకూలతపై కుజ దోష ప్రభావం..

స్వభావంలో దూకుడు:

కుజ దోషం ఉన్న వ్యక్తులు సాధారణంగా కొంచెం దూకుడు స్వభావాన్ని కలిగి ఉంటారు. తమ భాగస్వామిపై ఆధిపత్యం చలాయించాలనే మనస్తత్వం వీరిలో ఎక్కువగా కనిపిస్తుంది.

బంధంలో కలహాలు:

జాతకంలో 7 లేదా 8వ స్థానంలో కుజుడు ఉన్నప్పుడు దంపతుల మధ్య చిన్న చిన్న విషయాలకే తీవ్రమైన గొడవలు రావడం, మనస్పర్ధలు రావడం జరుగుతుంది. ఇది బంధం బలహీనపడటానికి దారితీస్తుంది.

పెళ్లి ఆలస్యం కావడం:

కొంతమందికి కుజ దోషం కారణంగా అనుకున్న సమయానికి వివాహం కాకపోవడం, సంబంధాలు కుదిరినట్టే కుదిరి క్యాన్సిల్ అవ్వడం వంటి ఇబ్బందులు ఎదురవుతాయి.

జాతక పొంతన ఎలా చూడాలి?

జ్యోతిష్య శాస్త్ర నియమాల ప్రకారం, వరుడి జాతకంలో కుజ దోషం ఉంటే.. వధువు జాతకంలో కూడా కుజ దోషం ఉండాలి. ఇలా ఇద్దరి జాతకాల్లోనూ దోషం సమానంగా ఉన్నప్పుడు, ఆ దోష తీవ్రత తగ్గి వారి వైవాహిక జీవితం సుఖసంతోషాలతో సాగుతుందని నమ్ముతారు. ఒకరికి ఉండి, మరొకరికి లేకపోతే పెళ్లి తర్వాత సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది.

కుజ దోష నివారణకు సరళమైన పరిహారాలు..

కుజ దోషం ఉందని ఆందోళన చెందాల్సిన పని లేదు. శాస్త్రంలో దీనికి కొన్ని అద్భుతమైన పరిహారాలు సూచించబడ్డాయి..

అంగారక పూజ, కుజ శాంతి

మంగళవారం రోజున నవగ్రహాల్లోని కుజ గ్రహానికి ఎర్రటి పూలతో పూజ చేయడం, కందులను దానం చేయడం వల్ల దోష తీవ్రత తగ్గుతుంది.

సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన

కుజుడి అధిదేవత అయిన మురుగన్ లేదా సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని నిత్యం ఆరాధించడం, మంగళవారం నాడు సుబ్రహ్మణ్య అష్టకం పఠించడం వల్ల కుజ దోషం తొలగిపోతుంది.

హనుమాన్ చాలీసా పఠనం:

రోజూ లేదా ప్రతి మంగళవారం హనుమాన్ చాలీసా పఠించడం వల్ల అంగారకుడి ప్రతికూల ప్రభావం నుండి ఉపశమనం లభిస్తుంది.

కుంభ వివాహం:

దోష తీవ్రత ఎక్కువగా ఉన్న జాతకులకు పెళ్లికి ముందు కుంభ వివాహం వంటి సాంప్రదాయ ప్రక్రియల ద్వారా దోషాన్ని నివారిస్తారు.

PolitEnt Media

PolitEnt Media

Next Story