పఠించాల్సిన మంత్రం

Navagraha Pradakshina: హిందూ ధర్మంలో నవగ్రహ ఆరాధనకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. మన జీవితంలోని సుఖదుఃఖాలు, జయాపజయాలు మనం చేసుకున్న కర్మఫలంతో పాటు గ్రహగతులపై ఆధారపడి ఉంటాయని శాస్త్రం చెబుతోంది. అందుకే ఆలయానికి వెళ్ళినప్పుడు నవగ్రహాలకు ప్రదక్షిణలు చేయడం ద్వారా మనలోని దోషాలు తొలగి, మానసిక ప్రశాంతత లభిస్తుంది. అయితే, ఈ ప్రదక్షిణ చేసేటప్పుడు ఏదో మౌనంగా తిరగడం కంటే, గ్రహ దేవతలను స్మరిస్తూ మంత్రాన్ని పఠించడం వల్ల సంపూర్ణ ఫలితం దక్కుతుంది.

నవగ్రహ ప్రదక్షిణ చేసేటప్పుడు పఠించాల్సిన అత్యంత శక్తివంతమైన శ్లోకం ఇది:

నమః సూర్యాయ చంద్రాయ మంగళాయ బుధాయ చ

గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః

ఈ శ్లోకంలో తొమ్మిది గ్రహాలకు మనం నమస్కరిస్తాం. సూర్యుడు, చంద్రుడు, కుజుడు (మంగళ), బుధుడు, బృహస్పతి (గురు), శుక్రుడు, శని, రాహువు, కేతువులకు ప్రణామం చేయడం ద్వారా వారి అనుగ్రహం మనపై ప్రసరిస్తుంది.ప్రదక్షిణలు చేసేటప్పుడు తొందరపాటు లేకుండా, నిలకడగా నడుస్తూ ఒక్కో అడుగులో ఈ మంత్రాన్ని మనసులో జపించాలి. నవగ్రహాల చుట్టూ 9 ప్రదక్షిణలు చేయడం శ్రేయస్కరం. మీరు ఏ గ్రహ దోషంతో బాధపడుతున్నా, ఈ ఏకైక శ్లోకాన్ని పఠించడం వల్ల ఆ గ్రహ పీడ నుంచి విముక్తి లభిస్తుంది. సూర్యుడి నుంచి ఆరోగ్యం, చంద్రుడి నుంచి మనశ్శాంతి, గురు-శుక్రుల నుంచి ఐశ్వర్యం లభించాలని కోరుకుంటూ భక్తితో ప్రార్థించాలి.

PolitEnt Media

PolitEnt Media

Next Story