Mars Mahadasha in Your Horoscope: జాతకంలో కుజ మహాదశ? ఆటంకాలు, శక్తివంతమైన పరిహారాలివే..
శక్తివంతమైన పరిహారాలివే..

Mars Mahadasha in Your Horoscope: నవగ్రహాలలో కుజుడు అత్యంత శక్తివంతమైన, ఉగ్ర స్వభావం కలిగిన గ్రహంగా పరిగణించబడతాడు. ఒకరి జాతక చక్రంలో కుజ మహాదశ కాలం 7 సంవత్సరాల పాటు కొనసాగుతుంది. ఈ దశలో కుజుడు బలహీనంగా ఉన్నా లేదా ప్రతికూల స్థానాల్లో ఉన్నా జీవితంలో ఊహించని కల్లోలాలు, అశాంతి ఏర్పడే అవకాశం ఉందని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది. ధైర్యం, ఉత్సాహం క్షీణించడం, విపరీతమైన ఆవేశం, కుటుంబ కలహాలు, తరచూ ప్రమాదాలు లేదా నిరంతర మానసిక ఒత్తిడి ఎదురవుతుంటే జాతకంలో కుజ దోషం లేదా కుజ మహాదశ ప్రభావం ఉండవచ్చని పండితులు పేర్కొంటున్నారు.
కుజ మహాదశ అశుభ ప్రభావాలను తగ్గించే 5 శక్తివంతమైన పరిహారాలు
సంకటమోచన హనుమాన్ ఆరాధన: కుజుడిని శాంతింపజేయడానికి ఆంజనేయ స్వామి పూజ అత్యంత శ్రేయస్కరం. రోజూ హనుమాన్ చాలీసా, బజరంగ్ బాణ్ లేదా హనుమాన్ అష్టకం పఠించడం వల్ల మనోధైర్యం, ఆత్మవిశ్వాసం పెరిగి రక్షణ కలుగుతుంది.
మంగళవారం వ్రతం - దానధర్మాలు: మంగళవారం నాడు ఉపవాసం ఉండటం లేదా సాత్విక ఆహారం తీసుకోవడం మంచిది. ఈ రోజున ఎర్ర కందులు (ఎర్ర పప్పు), బెల్లం, రాగి పాత్రలు లేదా ఎరుపు రంగు వస్త్రాలను పేదలకు దానం చేయడం వల్ల కుజ దోష తీవ్రత తగ్గుతుంది.
ఆవేశం, తొందరపాటు నిర్ణయాలకు కళ్లెం: కుజుడు అగ్ని తత్వానికి, దూకుడుకు ప్రతీక. కాబట్టి ఈ దశలో అనవసర వాదనలకు దిగకుండా ప్రశాంతంగా ఉండాలి. కోపంలో పెద్ద ఆర్థిక లేదా కుటుంబ నిర్ణయాలు తీసుకోకపోవడం శ్రేయస్కరం.
శారీరక వ్యాయామం - యోగా:
అంగారకుడు కండరాల బలానికి కారకుడు. నిత్యం వ్యాయామం, ఆటలు లేదా యోగా సాధన చేయడం వల్ల శరీరంలోని అధిక ఉద్రిక్తత తొలగిపోయి, పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుంది.
తోబుట్టువులతో సత్సంబంధాలు: జ్యోతిష్య శాస్త్ర ప్రకారం కుజుడు సోదరులకు (ముఖ్యంగా తమ్ముళ్లకు) కారకుడు. తోబుట్టువులను గౌరవిస్తూ, వారితో సత్సంబంధాలు కొనసాగించడం వల్ల కుజుని అనుగ్రహం లభించి ఈ ఏడేళ్ల మహాదశ సులభంగా గడిచిపోతుంది.

