Medaram: మేడారం సమ్మక్క-సారలమ్మ జాతరలో తిరుగువారం (తిరుగు పండుగ) అనేది చాలా ముఖ్యమైన ఘట్టం. ప్రధాన జాతర ముగిసిన వారం రోజులకు, అంటే ఇవాళ( బుధవారం నాడు) ఈ వేడుకను నిర్వహిస్తారు.. తిరుగువారం పండుగ రోజున గిరిజన, గిరిజనేతర భక్తులు అమ్మవార్లను దర్శించి మొక్కులు చెల్లించుకుంటారు. ఈ పండుగతో మహాజాతర పూజా కార్యక్రమాలు పూర్తికానున్నాయి.

ప్రధాన జాతరలో కోట్లాది మంది భక్తుల రాకతో జరిగిన సందడి తర్వాత, వన దేవతలను శాంతింపజేయడానికి ఈ పూజలు చేస్తారు. ఈ రోజున మేడారంలోని గ్రామస్తులు, పూజారులు కలిసి అమ్మవార్లకు ప్రత్యేక అభిషేకాలు, నైవేద్యాలు సమర్పిస్తారు. ప్రధాన జాతర సమయంలో రాలేని భక్తులు, దర్శనం చేసుకోలేకపోయిన వారు ఈ తిరుగువారం రోజున వచ్చి ప్రశాంతంగా మొక్కులు చెల్లించుకుంటారు. ఈ పండుగతో మేడారం జాతర హడావుడి అధికారికంగా ముగిసినట్లు పరిగణిస్తారు. మళ్లీ వచ్చే రెండేళ్ల వరకు అమ్మవార్లు చిలకలగుట్టపైనే ఉంటారని భక్తుల నమ్మకం.

మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర అనేది కేవలం ఒక ఉత్సవం మాత్రమే కాదు, అది గిరిజన సంస్కృతికి మరియు ధైర్యానికి నిదర్శనం. ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతరగా పేరుగాంచిన ఈ వేడుకను "తెలంగాణ కుంభమేళా" అని కూడా పిలుస్తారు.

ఈ ఏడాది జనవరి 28 నుంచి జనవరి 31 వరకు అత్యంత వైభవంగా జరిగింది. జనవరి 28 (బుధవారం) కన్నెపల్లి నుంచి సారలమ్మ గద్దెకు.. జనవరి 29 (గురువారం) చిలకలగుట్ట నుంచి సమ్మక్క అమ్మవారు గద్దెపైకి .. జనవరి 30 (శుక్రవారం) భక్తులు తమ మొక్కులు చెల్లించుకునే ప్రధాన రోజు. జనవరి 31న వన దేవతలు తిరిగి వనప్రవేశం చేశారు. ఇవాళ తిరుగువారం పండుగతో జాతర అధికారికంగా ముగుస్తుంది.

PolitEnt Media

PolitEnt Media

Next Story