గిరిజన జాతర ఎప్పుడంటే.?

Medaram Jaatara: ఆసియాలోనే అతిపెద్ద గిరిజ‌న జాత‌ర మ‌న మేడారం జాత‌ర‌. ప్రతి రెండు సంవ‌త్సరాల కోసారి వ‌చ్చే మేడారం జాత‌ర కోసం అంద‌రం ఎదురు చూస్తూ ఉంటాం. వ‌చ్చే ఏడాది జ‌న‌వ‌రిలో మొద‌ల‌య్యే ఈ జాత‌ర తేదీల‌ను పూజారుల సంఘం ప్రకటించింది. జనవరి 28 నుంచి 31వ తేదీ వరకు జాతర నిర్వహిస్తున్నట్లు వెల్లడించింది. ల‌క్షల మంది వ‌చ్చే ఈ జాత‌రను ఘ‌నంగా నిర్వహిచేందుకు తెలంగాణ ప్రభుత్వం అన్నీ ఏర్పాట్లు చేయనుంది.

మొదటి రోజు 2026 జనవరి 28 న కన్నెపల్లి నుంచి సారలమ్మ, కొండాయి నుంచి గోవిందరాజులు, పూనుగొండ్ల నుంచి పగిడిద్దరాజు మేడారంలోని గద్దెలపైకి చేరుకోనున్నారు. 29న చిలుకలగుట్ట నుంచి సమ్మక్కను తీసుకొచ్చి గద్దెపై ప్రతిష్ఠిస్తారు. 30న భక్తులు మొక్కులు సమర్పించనున్నారు. 31న సాయంత్రం 6 గంటలకు అమ్మవార్లను తిరిగి వనప్రవేశం చేయడంతో మహా జాతర ముగియనున్నది. ఆసియా ఖండంలో అతిపెద్ద గిరిజన జాతరగా దీనికి గుర్తింపు ఉంది

PolitEnt Media

PolitEnt Media

Next Story