ఇవాళ గద్దెపైకి సారక్క

Medaram Jatara Begins: ఈ రోజు జనవరి 28 మేడారం మహాజాతరలో మొదటి రోజు. ఈ రోజు సాయంత్రమే సారక్క (సారలమ్మ) కన్నెపల్లి నుంచి గద్దెపైకి రానున్నారు.సారలమ్మ ఆగమనం: కన్నెపల్లి గ్రామం నుంచి ఆదివాసీ పూజారులు సారక్కను కుంకుమ భరిణ రూపంలో తీసుకువస్తారు.

సారక్కను తీసుకువస్తున్నప్పుడు జంపాన్న వాగు మీదుగా పూజారులు వస్తారు. ఆ సమయంలో భక్తులు ఇచ్చే హారతులు, కొట్టే డప్పులతో మేడారం మార్మోగిపోతుంది. సారక్కతో పాటు కొండాయి నుంచి గోవిందరాజును, పూనుగొండ్ల నుంచి పగిడిద్దరాజును ఆదివాసీ సంప్రదాయాల ప్రకారం గద్దెలపైకి చేరుస్తారు.

ఇవాళ సారక్క, పగిడిద్దరాజు, గోవిందరాజులు గద్దెపైకి చేరుతారు.రేపుచిలుకలగుట్ట నుండి సమ్మక్క తల్లి గద్దెపైకి వస్తారు. ఈ రోజే భక్తుల రద్దీ అత్యధికంగా ఉంటుంది.జనవరి 30న భక్తులు మొక్కులు చెల్లించుకునే ప్రధాన రోజు.జనవరి 31 న దేవతలు వన ప్రవేశం చేయడంతో జాతర ముగుస్తుంది.

ఇప్పటికే మేడారానికి భక్తుల తాకిడి విపరీతంగా పెరిగింది. ప్రభుత్వం సుమారు 4,000 కు పైగా ప్రత్యేక బస్సులను నడుపుతోంది.

Updated On 28 Jan 2026 2:51 PM IST
PolitEnt Media

PolitEnt Media

Next Story