Mercury Enters Leo: సింహరాశిలోకి బుధుడు..బుధాదిత్య రాజయోగం.. ఈ 6 రాశులకు డబ్బే డబ్బు
ఈ 6 రాశులకు డబ్బే డబ్బు

Mercury Enters Leo: జ్యోతిష్యశాస్త్రంలో గ్రహాల రాకుమారుడిగా భావించే బుధుడు అతి తక్కువ సమయంలో తన రాశిని మార్చుకుంటాడు. ప్రస్తుతం కర్కాటక రాశిలో ఉన్న బుధుడు, ఆగస్టు 22న సూర్యుని సొంత రాశి అయిన సింహరాశిలోకి ప్రవేశించనున్నాడు. సెప్టెంబర్ 7 వరకు అక్కడే కొనసాగుతాడు. ఇప్పటికే సింహరాశిలో సూర్యుడు ఉండటంతో బుధ-సూర్యుల కలయిక వల్ల అత్యంత శక్తివంతమైన బుధాదిత్య రాజయోగం ఏర్పడుతోంది. ఈ శుభ యోగం ప్రభావంతో వ్యక్తిగత నిర్ణయాధికారం, సృజనాత్మకత, నాయకత్వ లక్షణాలు మరియు ఆత్మవిశ్వాసం పెరుగుతాయి. ద్వాదశ రాశులపై దీని ప్రభావం ఉన్నప్పటికీ, ప్రధానంగా 6 రాశుల వారికి విశేష ప్రయోజనాలు కలగనున్నాయి.
బుధాదిత్య రాజయోగంతో లబ్ధి పొందే 6 అదృష్ట రాశులు
మిథున రాశి: బుధుడు 3వ ఇంట్లోకి ప్రవేశించడంతో ఆత్మవిశ్వాసం రెట్టింపు అవుతుంది. ఉద్యోగార్థులకు, వ్యాపారం, మార్కెటింగ్, మీడియా, రచనా రంగాల్లో ఉన్నవారికి ఇది స్వర్ణయుగం లాంటి సమయం. వృత్తిపరమైన ప్రయాణాలు లాభాలను తెచ్చిపెడతాయి.
సింహ రాశి: బుధుని సంచారం 1వ ఇంట్లో (లగ్నంలో) జరగడం వల్ల సమాజంలో, పని ప్రదేశంలో మీ మాటకు విలువ, గౌరవం పెరుగుతాయి. నాయకత్వ నైపుణ్యాలు మెరుగవుతాయి. ఉద్యోగులకు పదోన్నతులు, విద్యార్థులకు పోటీ పరీక్షల్లో అద్భుత విజయాలు దక్కుతాయి.
కన్యా రాశి: చేపట్టిన ప్రతి ప్రాజెక్టు విజయవంతంగా పూర్తవుతుంది. కెరీర్‌లో స్థిరమైన పురోగతి కనిపిస్తుంది. విద్యార్థులకు ఏకాగ్రత పెరుగుతుంది. ఆధ్యాత్మిక యాత్రలు, తీర్థయాత్రలకు అవకాశం లభిస్తుంది.
తులా రాశి: బుధుడు 11వ స్థానంలోకి ప్రవేశించడం వల్ల ఊహించని ఆర్థిక లాభాలు చేకూరుతాయి. వ్యాపార భాగస్వామ్యాలు లాభసాటిగా సాగుతాయి. కొత్త ఒప్పందాలు, కాంట్రాక్టులు కుదుర్చుకోవడానికి ఇది అనుకూల సమయం.
ధనుస్సు రాశి: బుధుని 9వ స్థాన సంచారం వల్ల విదేశీ ప్రయాణాలు, విదేశాల్లో విద్య లేదా ఉద్యోగం చేయాలనుకునే వారి కలలు నెరవేరుతాయి. కోర్టు వివాదాలు, న్యాయపరమైన సమస్యలు పరిష్కారమవుతాయి. పోటీ పరీక్షల్లో మంచి ఫలితాలు వస్తాయి.
కుంభ రాశి: బుధుడు 7వ ఇంట్లోకి అడుగుపెట్టడంతో వ్యాపారస్తులకు పెద్ద మొత్తంలో లాభాలు అందుతాయి. కొత్త వ్యాపార ఒప్పందాలు ఖరారవుతాయి. వైవాహిక జీవితంలో సాన్నిహిత్యం, ఆర్థిక స్థిరత్వం పెరుగుతుంది.

