Mercury Retrograde in Libra: తులారాశిలో బుధుడి వక్ర సంచారం: ఈ 4 రాశుల వారికి కెరీర్‌లో తిరుగుండదు..
తిరుగుండదు..

Mercury Retrograde in Libra: జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాల రాకుమారుడిగా భావించే బుధుడు తెలివితేటలు, వాక్చాతుర్యం, వ్యాపారం, విద్యాభివృద్ధికి కారకుడు. మిథున, కన్యారాశులకు అధిపతి అయిన బుధుడు ప్రస్తుతం తులారాశిలో సంచరిస్తున్నాడు. ఈ క్రమంలో అక్టోబర్ 24వ తేదీన తులారాశిలోనే బుధుడు వక్రగతిలోకి మారనున్నాడు.
వక్రగతి సంచారం అన్ని రాశులపై ప్రభావం చూపినప్పటికీ, ప్రత్యేకంగా నాలుగు రాశుల వారికి వృత్తి, వ్యాపార రంగాలలో అనూహ్యమైన అభివృద్ధిని, ధనలాభాన్ని అందించనుంది. ముఖ్యంగా గతంలో నిలిచిపోయిన పెండింగ్ పనులు వేగవంతం కావడం, కొత్త కాంట్రాక్టులు దక్కడం వంటి సానుకూల మార్పులు చోటుచేసుకోనున్నాయి. ఆ అదృష్ట రాశులేవో వివరంగా చూద్దాం.
తులారాశి
బుధుడు తులారాశిలోనే లగ్న భావంలో వక్ర సంచారం చేయనున్నాడు. ఉద్యోగం లేదా వృత్తి మార్పు కోసం ప్రయత్నిస్తున్న వారికి ఇది అనుకూల సమయం. గతంలో పూర్తికాని ప్రాజెక్టులు విజయవంతంగా పూర్తవుతాయి. వ్యాపారవేత్తలకు నూతన ఒప్పందాలు దక్కుతాయి. భాగస్వామ్య వ్యాపారాలు చేసేవారికి విశేష లాభాలుంటాయి. ఉద్యోగులకు కొత్త బాధ్యతలు, ఇంక్రిమెంట్లు లేదా పదోన్నతులు లభించే సూచనలున్నాయి. ఇతరులకు వాగ్దానాలు చేసే ముందు ఒకటికి రెండుసార్లు ఆలోచించుకోవడం మంచిది.
మేషరాశి
మేష రాశివారికి సప్తమ భావంలో బుధుడు వక్రగతిలో సంచరిస్తాడు. దీనివల్ల వ్యక్తిగత, వృత్తిపరమైన సమస్యలు సమసిపోతాయి. ఆగిపోయిన పాత లావాదేవీలు మళ్లీ మొదలవుతాయి. నూతన కాంట్రాక్టులు వ్యాపార వృద్ధికి కారణమవుతాయి. ఉద్యోగార్థులకు ఆశించిన అవకాశాలు లభిస్తాయి. ఆకస్మిక ధనలాభాలు కలిగే అవకాశం ఉంది. భాగస్వామ్యాలు, వ్యక్తిగత సంబంధాల్లో తలెత్తిన అపార్థాలు తొలగిపోయి అన్యోన్యత పెరుగుతుంది. తొందరపాటు నిర్ణయాలకు మాత్రం దూరంగా ఉండాలి.
మిథున రాశి
మిథున రాశివారికి పంచమ భావంలో బుధుడి వక్ర సంచారం జరుగుతుంది. సరికొత్త ప్రాజెక్టులు ప్రారంభించే బదులు, ఇప్పటికే చేతిలో ఉన్న ప్రాజెక్టులలోని లోపాలను సరిదిద్దడం ద్వారా అద్భుతమైన ఫలితాలు పొందుతారు. వ్యాపారస్తులకు ప్రభావవంతమైన వ్యక్తులతో కొత్త పరిచయాలు ఏర్పడతాయి. ఉద్యోగంలో అదనపు బాధ్యతలు దక్కడంతో పాటు జీతభత్యాలు పెరిగే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి.
మకర రాశి
మకర రాశివారికి దశమ భావమైన (10వ ఇంట్లో) కర్మ స్థానంలో బుధుడు వక్రగతిలో ఉంటాడు. కెరీర్‌లో గతంలో తీసుకున్న నిర్ణయాల్లోని లోపాలను సరిచేసుకుని, సరైన మార్గంలో ప్రయాణించి మంచి విజయాలు సాధిస్తారు. ఉద్యోగంలో కేటాయించిన లక్ష్యాలను సమర్థవంతంగా పూర్తిచేస్తారు. ఉన్నతాధికారుల నుంచి ప్రశంసలు, అదనపు బాధ్యతలు దక్కుతాయి. వ్యాపారంలో భారీ లాభాలను అందించే కొత్త కాంట్రాక్టులు దక్కే సూచనలున్నాయి. ఆర్థిక పరిస్థితి పటిష్టంగా ఉన్నప్పటికీ, స్తోమతకు మించి హామీలు ఇవ్వకూడదు.

