Mercury Transit in Pisces: జాగ్రత్త.. మీన రాశిలో బుధ సంచారం.. రాబోయే 20 రోజులు ఈ రాశుల వారికి గండం..
రాబోయే 20 రోజులు ఈ రాశుల వారికి గండం..

Mercury Transit in Pisces: నవగ్రహాలలో తెలివితేటలు, వ్యాపారం మరియు వాక్కుకు కారకుడైన బుధుడు, ఏప్రిల్ 11న కుంభ రాశి నుండి మీన రాశిలోకి ప్రవేశించాడు. గురు గ్రహానికి అధిపతి అయిన మీన రాశిలో బుధుడు బలహీనంగా (నీచ స్థితిలో) ఉంటాడు. ఏప్రిల్ 30 వరకు అంటే సుమారు 20 రోజుల పాటు బుధుడు ఇదే స్థితిలో కొనసాగుతాడు. దీనివల్ల ఏర్పడే 'నీచ భంగ రాజయోగం' కొన్ని రాశుల వారికి ప్రతికూల ఫలితాలను ఇచ్చే అవకాశం ఉందని జ్యోతిష్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ఆ అశుభ ప్రభావం ఎదుర్కోబోయే రాశులు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవే:
మేష రాశి : ఆర్థిక విషయాల్లో ఆచితూచి..
బుధుడు మేష రాశి నుండి 12వ ఇంట్లోకి సంచరిస్తున్నాడు. ఈ కాలంలో మేష రాశి వారు వృత్తి, వ్యాపారాల్లో చాలా అప్రమత్తంగా ఉండాలి. తొందరపడి ఎటువంటి పెద్ద పెట్టుబడులు పెట్టకండి. ముఖ్యమైన ఆర్థిక నిర్ణయాలను వాయిదా వేసుకోవడం మంచిది. పని ఒత్తిడి పెరిగే అవకాశం ఉంది, కాబట్టి ఓపికగా వ్యవహరించండి.
కన్యా రాశి : ఆటంకాలు ఎదురయ్యే సూచన
కన్యా రాశి వారికి ఈ 20 రోజులు పరీక్షా కాలం అనే చెప్పాలి. మీరు ఎంత కష్టపడినా ఆశించిన ఫలితాలు రాకపోగా, పనుల్లో ఆటంకాలు ఎదురుకావచ్చు. కుటుంబ సభ్యుల మధ్య చిన్నపాటి వివాదాలు తలెత్తవచ్చు. అనారోగ్య సమస్యలను అస్సలు నిర్లక్ష్యం చేయవద్దు. ఈ సమయంలో ఇతరుల వాహనాలను అరువుగా తీసుకోవడం కానీ, నడపడం కానీ చేయకపోవడమే ఉత్తమం. పనిలో క్రమశిక్షణ తప్పనిసరి.
తులా రాశి: ఆరోగ్యమే మహాభాగ్యం
తులా రాశి వారికి బుధుడు ఆరవ ఇంట్లోకి ప్రవేశిస్తున్నాడు. ఇది శత్రువుల బాధను లేదా ఆరోగ్య సమస్యలను సూచిస్తుంది. చిన్నపాటి అనారోగ్య లక్షణాలు కనిపించినా వెంటనే వైద్యుడిని సంప్రదించండి. మందులు వాడుతున్న వారు సమయానికి వేసుకోవడం మర్చిపోవద్దు. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారు అధిక శ్రమ చేయాల్సి ఉంటుంది. ఏకాగ్రత దెబ్బతినకుండా చూసుకోవాలి.

