Mercury Transits Libra: వేద జ్యోతిషశాస్త్రంలో గ్రహాల రాకుమారుడిగా భావించే బుధ గ్రహ సంచారానికి ఎంతో ప్రాధాన్యత ఉంది. జ్ఞానం, తెలివితేటలు, వ్యాపారం, వాక్చాతుర్యం, సంభాషణలకు కారకుడైన బుధుడు తులారాశిలోకి సంచారం చేస్తున్నాడు. నవంబర్ 13 నుంచి డిసెంబర్ 2 వరకు కొనసాగే ఈ బుధ సంచార ప్రభావం ద్వాదశ రాశులపై ఉన్నప్పటికీ.. ముఖ్యంగా 5 రాశుల జాతకులకు విశేషమైన ఆర్థిక పురోగతి, వృత్తిపరమైన ఎదుగుదల లభించనుందని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు. ఆ అదృష్ట రాశులేవో తెలుసుకుందాం..

కన్యారాశి: పెండింగ్ పనులకు మోక్షం.. పనిలో ప్రత్యేక గుర్తింపు

కన్యారాశికి అధిపతి స్వయంగా బుధుడే కావడంతో ఈ సంచారం వీరికి ఎంతో ప్రయోజనకరంగా మారనుంది. దీర్ఘకాలంగా వాయిదా పడుతూ వస్తున్న కీలక పనులు పూర్తవుతాయి. ఉద్యోగ రంగంలో మీ నైపుణ్యాలు, ప్రతిభకు తగిన గుర్తింపు దక్కుతుంది. ప్రమోషన్ లేదా అదనపు బాధ్యతలు పొందే సూచనలు ఉన్నాయి. వ్యాపారస్తులకు, స్వయం ఉపాధిలో ఉన్నవారికి సరికొత్త అవకాశాలు తలుపు తడతాయి.

మీనరాశి: పెరగనున్న నగదు ప్రవాహం.. ఆస్తి కొనుగోలు యోగం

మీన రాశి వారికి ఈ కాలంలో ఆర్థిక పరిస్థితి గణనీయంగా మెరుగుపడుతుంది. చేతికి సకాలంలో డబ్బు అందడంతో పాటు వ్యాపార రంగంలో నూతన ఒప్పందాలు కుదురుతాయి. సొంత ఇల్లు, స్థలం లేదా నూతన వాహనం కొనుగోలు చేయాలనుకునే వారి ప్రయత్నాలు ఫలిస్తాయి. కుటుంబంలోనూ సానుకూల పరిస్థితులు నెలకొంటాయి.

ధనుస్సురాశి: కెరీర్‌లో పదోన్నతులు.. అప్పుల బాధల నుంచి ఉపశమనం

ధనుస్సు రాశి ఉద్యోగులకు, వ్యాపారులకు ఈ సమయం ఊహించని వృద్ధిని ఇస్తుంది. కార్యాలయాల్లో వేతన పెంపు, పదోన్నతికి సంబంధించిన శుభవార్తలు వింటారు. వ్యాపార విస్తరణ ప్రయత్నాలు వేగం పుంజుకుంటాయి. గత కొంతకాలంగా వేధిస్తున్న పాత రుణాలు, అప్పులను క్రమంగా తీర్చి ఆర్థికంగా నిలదొక్కుకునే వెసులుబాటు లభిస్తుంది.

మేషరాశి: కొత్త ఆదాయ మార్గాలు.. పాత పెట్టుబడులతో లాభాలు

మేష రాశి వారికి బుధుడి అనుగ్రహంతో ఆర్థిక వనరులు విస్తరిస్తాయి. గతంలో చేసిన పెట్టుబడుల నుంచి ఊహించని లాభాలు అందుతాయి. కొత్త వ్యాపారాలు ప్రారంభించడానికి లేదా అదనపు ఆదాయ మార్గాలను అన్వేషించడానికి ఇది అనుకూలమైన సమయం. కార్యాలయంలో మీ కష్టానికి పైఅధికారుల నుంచి ప్రశంసలు లభిస్తాయి.

తులారాశి: సొంత రాశిలోనే సంచారం.. విదేశీ యోగం, కుటుంబ సంతోషం

బుధుడు తులారాశిలోనే సంచరిస్తున్నందున ఈ రాశి వారికి బహుముఖ ప్రయోజనాలు చేకూరనున్నాయి. పెట్టుబడుల ద్వారా ధనలాభం ఉంటుంది. విదేశీ ఉద్యోగాల కోసం లేదా విదేశీ ప్రాజెక్టుల కోసం ఎదురుచూస్తున్న వారికి శుభ పరిణామాలు ఎదురవుతాయి. వ్యాపారంలో కీలక ముందడుగు వేస్తారు. కుటుంబ సభ్యుల మధ్య ఉన్న చిన్నపాటి విభేదాలు తొలగిపోయి, అన్యోన్యత పెరుగుతుంది.

Next Story