Lord Venkateswara: శ్రీనివాసునికి అత్యంత ప్రీతిపాత్రమైనవి వేదం, నాదం, వాద్య నివేదనలు. వీటిలో నాదానికి విశేష ప్రాధాన్యం ఉంది. భక్తులు భక్తిశ్రద్ధలతో సమర్పించే సంగీతాన్ని, కీర్తనలను స్వామివారు ఆలకిస్తారన్నది పండితుల విశ్వాసం. అందుకే తిరుమలలో నాదం కేవలం సంగీతం కాదు… అది స్వామివారికి సమర్పించే ఒక విశిష్టమైన కైంకర్యం.

శ్రీ తాళ్లపాక అన్నమయ్య, శ్రీ పురందరదాసు, మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ వంటి వాగ్గేయకారులు తమ సంకీర్తనలతో, ఆళ్వారులు తమ పాశురాలతో శ్రీవారిని ప్రసన్నం చేసుకున్నారు. తరువాత కాలంలో దేశం గర్వించదగ్గ సంగీత విద్వాంసులు శ్రీమతి ఎం.ఎస్‌. సుబ్బలక్ష్మి, శ్రీ మంగళంపల్లి బాలమురళీకృష్ణ వంటి మహనీయులు కూడా స్వామివారికి నాదనీరాజనం సమర్పించారు.

శ్రీవారి జన్మనక్షత్రం శ్రవణం. ‘శ్రవణం’ అంటే వినడం అని అర్థం. భక్తులు సమర్పించే భక్తిగీతాలను, వేదఘోషను, వాద్య నాదాలను స్వామివారు ఆలకిస్తారనే భావనకు ఇది మరింత ప్రత్యేకతను ఇస్తుంది.

అడవుల్లోని శబ్దాల నుంచి ఆలయ మేళవాయిద్యాల వరకు

పురాణాల ప్రకారం పూర్వకాలంలో శేషాచలం అడవుల్లోని వృషభం, ఏనుగు వంటి జంతువులు తమ అరుపులతో స్వామివారిని కొలిచేవని చెబుతారు. ఆ సంప్రదాయానికి ప్రతీకగా, అలాంటి శబ్దాలను ఉత్పత్తి చేసే వాద్యపరికరాలు తరువాత కాలంలో శ్రీవారి ఆలయంలో వినియోగంలోకి వచ్చాయి. వీటిలో వృషభానికి సంబంధించిన గౌరుగోలు, ఏనుగు ధ్వనిని పోలిన త్రిచిన్నం/త్రిశూల్‌నాల్ వంటి వాద్యపరికరాలు ఉన్నాయి.

ఇలా ప్రకృతిలోని సహజ ధ్వనుల నుంచి ఆలయ కైంకర్యాల్లో భాగమైన మేళవాయిద్యాల వరకు ఒక విశిష్టమైన నాద సంప్రదాయం తిరుమలలో కొనసాగుతూ వస్తోంది.

సుప్రభాతం నుంచి ఏకాంతసేవ వరకు నాదమే కైంకర్యం

శ్రీవారి రోజువారీ పూజా కైంకర్యాల్లో నాదానికి అత్యంత ప్రాధాన్యం ఉంది. తెల్లవారుజామున సుప్రభాతం ద్వారా స్వామివారిని మేల్కొలుపుతారు. ఆ తరువాత జరిగే వివిధ కైంకర్యాల్లో వేదపారాయణంతో పాటు మేళవాయిద్యాలు కూడా ప్రత్యేక పాత్ర పోషిస్తాయి.

మేళవాయిద్య కళాకారులకు సంగీతం ప్రదర్శన కాదు… ప్రార్థనను నాదరూపంలో సమర్పించే కైంకర్యం. స్వామివారు మేల్కొనే వేళ నుంచి వివిధ సేవలు, నైవేద్యాలు, ఊరేగింపులు, ఉత్సవాలు, చివరికి ఏకాంతసేవలో సేదతీరే వరకు నాదస్వరం, డోలు తదితర వాద్యాల నాదం శ్రీవారి ఆలయ నిత్యకైంకర్యాల్లో భాగంగా ఉంటుంది.

శ్రీవారి ఆలయంలో తెల్లవారుజామున సుప్రభాతం నుంచి రాత్రి ఏకాంతసేవ వరకు మొత్తం 19 రకాల సంప్రదాయ వాద్యపరికరాలను వినియోగిస్తారు. వీటిలో డోలు, ముక్కువీణ, తిరిచినాళ్లు, గౌరుగోలు, సన్నడోలు, శృతి తదితర వాద్యాలు ఉన్నాయి.

ఆగమ సంప్రదాయాల ప్రకారం ఆలయంలో జరిగే కైంకర్యాలకు మేళవాయిద్యం ఎంతో ముఖ్యమైనది. సాధారణ రోజుల్లో సుమారు 14 సార్లు మేళవాయిద్యం వినిపిస్తుండగా, ఉత్సవాల రోజుల్లో ఈ సంఖ్య మరింత పెరుగుతుంది.

ప్రతి ధ్వనికి ఒక ప్రత్యేక సందర్భం…

నాదస్వరం శ్రీవారి ప్రధాన కైంకర్యాలు, నైవేద్య సమయాలు, ఊరేగింపులు, ఉత్సవాల్లో ప్రధానంగా వినిపిస్తుంది. రోజుకు రెండుసార్లు నైవేద్యం గంట సమయంలో నాదస్వరం వాయిస్తారు. అర్చకులు, జీయంగార్లు విచ్చేసే సమయంలో భక్తులను అప్రమత్తం చేసేందుకు గౌరుగోలు, సన్నడోలు వంటి వాద్యాలను వాయిస్తారు.

తిరుచిన్నం వంటి వాద్యాలు మంగళహారతి, దేవతామూర్తుల ఊరేగింపులు వంటి సందర్భాల్లో ప్రత్యేక ధ్వనిని అందిస్తాయి. డోలు, సన్నడోలు కైంకర్యాల సందర్భాన్ని సూచించే లయను అందిస్తే, శృతి వాద్యం మొత్తం మేళానికి ఆధారమైన నాదాన్ని అందిస్తుంది.

నాదస్వరం కళాకారులు తెల్లచొక్కా, పంచె, ఉత్తరీయం ధరించి ప్రత్యేక డ్రెస్‌కోడ్‌ను పాటించడం కూడా ఈ సేవకు ఉన్న సంప్రదాయ గౌరవాన్ని తెలియజేస్తుంది.

బ్రహ్మోత్సవాల్లో మరింత ఘనంగా నాదం

శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో మేళవాయిద్యాలకు మరింత విశిష్టమైన స్థానం ఉంటుంది. వాహనసేవలు, ఊరేగింపులు, వివిధ ఉత్సవ కైంకర్యాల సమయంలో మేళవాయిద్యాల నాదం తిరుమల ఆలయ ప్రాంగణాన్ని ఆధ్యాత్మికంగా మార్మోగిస్తుంది.

సాధారణ రోజుల్లో స్వామివారి కైంకర్యాలను సూచించే నాదం, బ్రహ్మోత్సవాల సమయంలో వేలాది మంది భక్తుల మధ్య ఉత్సవ వాతావరణాన్ని మరింత ఘనంగా తీర్చిదిద్దుతుంది.

ఏకాంతసేవలో నాదం… జోలపాటలా…

రోజంతా భక్తులతో, వేదఘోషతో, మేళవాయిద్యాలతో సందడిగా ఉండే శ్రీవారి ఆలయం రాత్రి ఏకాంతసేవ సమయంలో ప్రశాంతంగా మారుతుంది. అయితే ఆ సమయంలోనూ నాదం ఆగిపోదు. స్వామివారు సేదతీరే వేళ ముక్కువీణ, తిరిచినాళ్లు, గౌరుగోలు, సన్నడోలు, శృతి వంటి వాద్యాలను మృదువుగా, వినసొంపుగా వాయిస్తారు.

ముక్కువీణ వంటి పురాతన వాద్యాలు ఈ సమయంలో మరింత సున్నితమైన ధ్వనిని అందిస్తాయి. స్వామివారిని అలంకరించి, నైవేద్యాలు సమర్పించి, తరిగొండ వెంగమాంబ ముత్యాలహారతిని సమర్ప…

Next Story