Nag Panchami 2026: హిందూ సంప్రదాయంలో శ్రావణ మాసానికి ఎంతో ప్రాధాన్యత ఉంది. ఈ పవిత్ర మాసంలో వచ్చే పండగల్లో 'నాగపంచమి' ఒకటి. అయితే ఈ ఏడాది నాగపంచమి వేడుకలను ఆగస్టు 16న జరుపుకోవాలా లేక 17వ తేదీనా అనే దానిపై భక్తుల్లో కొంత స్పష్టత కోరుకుంటున్నారు. తెలుగు రాష్ట్రాల్లో శ్రావణ శుద్ధ పంచమి నాడు నాగదేవతను పూజించడం ఆనవాయితీగా వస్తోంది.

పురాణాల ప్రకారం నాగపంచమి ప్రాశస్త్యాన్ని స్వయంగా పరమశివుడే పార్వతీదేవికి చెప్పినట్లు హేమాద్రి ప్రభాస ఖండంలో పేర్కొన్నారు. ఈ పవిత్ర దినాన (ఆగస్టు 17న) భక్తులు ఉపవాసాలు ఆచరించి, నాగదేవతను భక్తిశ్రద్ధలతో కొలుస్తారు. ఇళ్ల ద్వారాలకు ఇరువైపులా గోమయంతో నాగదేవతల చిత్రాలను రాసి పూజించడం ఎంతో శుభప్రదమని పండితులు చెబుతున్నారు. అయితే, నాగపంచమి రోజున కొన్ని కఠినమైన నియమాలు పాటించాలని శాస్త్రాలు చెబుతున్నాయి. ఆ రోజున పొరపాటున కూడా భూమిని దున్నకూడదని, అలాగే ఉడకబెట్టిన ఆహారాన్ని మాత్రమే భుజించాలని నిపుణులు సూచిస్తున్నారు.

తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే, తెలంగాణలో శ్రావణ మాసంలో నాగపంచమిని జరుపుకుంటే, ఆంధ్రప్రదేశ్‌లో కొన్ని ప్రాంతాల్లో కార్తీక మాసంలో నాగుల చవితిని ఘనంగా జరుపుకుంటారు. నాగపంచమి రోజున పాములకు ఎలాంటి హాని తలపెట్టకూడదని, వాటిని సుబ్రహ్మణ్య స్వామి స్వరూపంగా భావించి పూజించాలని పురాణాలు చెబుతున్నాయి. ఈ నాగపంచమి పర్వదినాన భక్తులు అంతా ఆ నాగదేవతను పూజించి స్వామి కృపకు పాత్రులు అవుదాం.

PolitEnt Media

PolitEnt Media

Next Story