Navapanchama Rajyoga: జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాల సంచారానికి, వాటి మధ్య ఏర్పడే సంయోగాలకు అత్యంత ప్రాముఖ్యత ఉంది. గ్రహాల స్థాన చలనం వల్ల కొన్ని రాశుల వారికి అపారమైన ధనలాభం, రాజయోగాలు కలుగుతుంటాయి. ఈ క్రమంలోనే శని, శుక్ర గ్రహాల కలయిక వల్ల విశ్వంలో అత్యంత అరుదైన, శుభప్రదమైన "నవపంచమ రాజయోగం" ఏర్పడబోతోంది. జూన్ 25వ తేదీన ఏర్పడనున్న ఈ మహా రాజయోగం కారణంగా కొన్ని రాశుల వారి జాతకాలు పూర్తిగా మారిపోనున్నాయి. ముఖ్యంగా వారి కెరీర్, ఆర్థిక పరిస్థితి, వ్యాపారం మరియు వైవాహిక జీవితంలో ఊహించని ధన ప్రవాహం, సక్సెస్ రాబోతున్నాయి. ఆ అదృష్ట రాశులు ఏవో ఇప్పుడు చూద్దాం.

అసలు నవపంచమ రాజయోగం అంటే ఏమిటి?

జ్యోతిష్యశాస్త్రంలో నవపంచమ రాజయోగాన్ని అత్యంత శక్తివంతమైనదిగా భావిస్తారు. రెండు గ్రహాలు ఒకదానికొకటి నిర్దిష్ట దూరంలోకి వచ్చినప్పుడు ఈ త్రికోణ యోగం ఏర్పడుతుంది. కర్మఫల దాత అయిన శని దేవుడు, సుఖసంతోషాలను ఇచ్చే శుక్రుడు.. ఒకరికొకరు 5, 9వ స్థానాల్లో (త్రికోణ స్థానాలు) ఉన్నప్పుడు ఈ నవపంచమ యోగం సిద్ధిస్తుంది.

ఈ రాజయోగం వల్ల బంపర్ బెనిఫిట్స్ పొందే ఆ 4 రాశులు ఇవే..

వృషభ రాశి

నవపంచమ రాజయోగం వృషభ రాశి వారికి కొండంత అదృష్టాన్ని, కుటుంబంలో ఆనందాన్ని తెచ్చిపెడుతుంది. ఉద్యోగంలో చాలా కాలంగా ఎదురుచూస్తున్న పురోగతి లభిస్తుంది. మీ జీవితంలో గత కొంతకాలంగా వేధిస్తున్న ఆటంకాలు, సమస్యలు పూర్తిగా తొలగిపోతాయి. వ్యాపార రంగంలో ఉన్నవారికి లాభాల పంట పండుతుంది. సమాజంలో, ఆఫీసులో మీ కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి.

మిథున రాశి

మిథున రాశి జాతకులకు ఈ కాలంలో కొత్త ఆదాయ మార్గాలు తెరుచుకుంటాయి. ఇంట్లో నెమ్మది, మానసిక ప్రశాంతత లభిస్తాయి. ఉద్యోగస్తులకు జీతాల పెరుగుదల, ప్రమోషన్లు వచ్చే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి. కుటుంబంలో ఉన్న చిన్నచిన్న విభేదాలు తొలగిపోయి, భార్యాభర్తల మధ్య వైవాహిక బంధం మునుపటికంటే మరింత బ్రాండ్ అవుతుంది.

కన్యా రాశి

కన్యా రాశి వారికి ఈ రాజయోగం వల్ల ఊహించని విధంగా ఆకస్మిక ధనలాభం కలుగుతుంది. ఎక్కడో నిలిచిపోయిన డబ్బు లేదా పాత బాకీలు చేతికి అందుతాయి. ఆర్థిక వనరులు పెరుగుతాయి. ఉద్యోగం చేసే వారికి పై అధికారుల పూర్తి మద్దతు లభిస్తుంది. బాధ్యతాయుతమైన కొత్త పదవులు దక్కుతాయి. అయితే పని ఒత్తిడి వల్ల మధ్యమధ్యలో కొంత చిరాకు, కోపం వచ్చే అవకాశం ఉంది కాబట్టి సహనంతో వ్యవహరించడం మంచిది.

కుంభ రాశి

కుంభ రాశికి శని దేవుడే అధిపతి. అందువల్ల ఈ నవపంచమ యోగం కుంభ రాశి వారికి అఖండ విజయాలను చేకూరుస్తుంది. గత కొన్ని నెలలుగా మిమ్మల్ని తీవ్రంగా వేధిస్తున్న మానసిక ఒత్తిడి, కోర్టు సమస్యలు లేదా ఇతర ఇబ్బందులు సద్దుమణుగుతాయి. శని దేవుని అనుగ్రహంతో మీరు అనుకున్న పనులన్నీ సకాలంలో పూర్తవుతాయి. ఆరోగ్యం మెరుగుపడుతుంది.

PolitEnt Media

PolitEnt Media

Next Story