Navaratri : నవరాత్రులు: నేడు అమ్మవారిని ఎలా పూజించాలంటే?
ఎలా పూజించాలంటే?

Navaratri: విజయవాడ కనకదుర్గమ్మ ఆలయంలో నేడు బాలాత్రిపురసుందరీ దేవిగా అమ్మవారు అలంకృతమై భక్తులకు దర్శనమివ్వనున్నారు. మొదటి రోజు అమ్మవారికి గులాబీ రంగు చీర, మందార పువ్వులు సమర్పించి, పరమాన్నం/రైస్ ఖీర్ నైవేద్యంగా పెడతారు. ఈరోజున లలితా త్రిశతి పారాయణం చేస్తే అమ్మవారి అనుగ్రహం లభిస్తుందని పండితులు చెబుతున్నారు భక్తుల కొంగు బంగారమై కోరిన కోర్కెలు తీరుస్తుందని అంటున్నారు.
ఏ నైవేద్యం పెట్టాలంటే?
Sept 22 – పరమన్నం/రైస్ ఖీర్
Sept 23 – కొబ్బరి అన్నం, అల్లపు గారెలు
Sept 24 – మినప వడలు/పులిహోర
Sept 25 – పాయసం, రవ్వ కేసరి
Sept 26 – పూర్ణాలు, రవ్వ కేసరి
Sept 27 – రవ్వ కేసరి/పాయసన్నం
Sept 28 – కట్టు పొంగలి, Sept 29 – పాయసం, శాఖన్నం
Sept 30 – కదంబం/కలగలుపు కూర
Oct 1 – చక్కెర పొంగలి
Oct 2 – దద్దోజనం, మహా నివేదన
ఏరోజున ఏ స్తోత్రం చదవాలంటే?
Day 1- లలిత త్రిశతి పారాయణ
Day 2- గాయత్రి కవచం
Day 3- అన్నపూర్ణా అష్టకం
Day 4- కాత్యాయనీ దేవి స్తోత్రం
Day 5- శ్రీ మహాలక్ష్మీ అష్టకం
Day 6- లలిత సహస్ర నామావళి
Day 7- చండీ, దుర్గా సప్తశతి
Day 8- సరస్వతీ ద్వాదశనామ స్తోత్రం
Day 9- దుర్గాసప్తశతీ పారాయణ
Day 10- మహిషాసుర మర్దిని స్తోత్రం
Day 11- నవదుర్గా స్తోత్రం, శమీ ప్రార్థన
రోజూవారి అమ్మవారి అలంకరణ
Day 1- గులాబీ రంగు చీర, మందారాలు
Day 2- నారింజ రంగు చీర, తామర/కలువ పూలు
Day 3- నీలం రంగు చీర, మల్లెలు
Day 4- పసుపు రంగు చీర, మందారాలు, మల్లెలు
Day 5- గులాబీ రంగు చీర, ఎర్ర గులాబీలు, కలువలు
Day 6- పసుపు చీర, గులాబీలు
Day 7- బంగారు రంగు చీర, పసుపు రంగు పూలు
Day 8- తెల్ల చీర, తెల్ల తామర
Day 9- ఎర్ర చీర, ఎర్ర పూలు
Day 10- నీలం చీర, శంఖు పూలు
Day 11- ఆకుపచ్చ చీర, కలువ పూలు
